జీవితాంతం ప్రేమ పొందాలంటే.. మీరు ఇలా చేయాల్సిందే...!

First Published Sep 27, 2022, 11:58 AM IST

మీరు ప్రేమించగానే సరిపోదు... ఆ ప్రేమను వారిపై చూపించడం కూడా నేర్చుకోవాలి. నిజాయితీగా.. మీరు వారిపై ప్రేమను చూపించడం నేర్చుకోవాలి.

ప్రేమ మొదలైన కొత్తలో అందంగానే ఉంటుంది. చాలా మధురంగా అనిపిస్తుంది. తరచూ తాము ప్రేమించిన వ్యక్తితోనే ఉండాలనే ఉంటుంది. కానీ... కాలం గడుస్తున్న కొద్దీ.. ఆ ప్రేమలోని మధురానుభూతి తగ్గుతుంది. అయితే... జీవితాంతం ఆ ప్రేమ తగ్గకుండా.. అందంగా ఉండాలంటే.... ఈ కింద నియమాలు పాటించాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఓసారి చూద్దాం...
 

lovers

1.దంపతుల మధ్య చిన్న చిన్న వివాదాలు రావడం సహజం. అయితే... ఆ వివాదాలు వచ్చినప్పుడు ఫ్రస్టేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి సమయంలో నిరాశ చెందడం వల్ల కలిగే ఉపయోగం ఏమీ ఉండదు. మీ జీవిత భాగస్వామిని ఇబ్బంది పెట్టకూడదు. వారికి కొంత సమయం ఇవ్వాలి. వారు మీ అవసరాన్ని గుర్తించి.. రియలైజ్ అయ్యి మీ దగ్గరకు వచ్చే అంత వరకు కాస్త ఎదురు  చూడటంలో తప్పులేదు.

2.జీవితాంతం ఒకే వ్యక్తితో ఉండాలనే కమిట్మెంట్ ఇవ్వడం చాలా గొప్ప విషయం. మీ పార్ట్ నర్ మీకు ఆ కమిట్మెంట్ ఇచ్చినా కూడా... వారిని మీరు నాతో ఉండకపోతే నేను అలా చేస్తా... ఇలా చేస్తా అని బెదిరించడం, వారిని భయపెట్టడం లాంటివి చేయకూడదు. అలా చేయడం వల్ల వారు మీతో ఉండాలని అనుకున్నా.. కూడా మీ ప్రవర్తన కారణంగా దూరమయ్యే అవకాశం ఉంది.

3.రిలేషన్ లో ఉన్నవారు ముందుగానే.. తమ రిలేషన్ ని ముందుకు కొనసాగించేలోపు వారు కొన్ని బౌండరీ లైన్స్ పెట్టుకోవాలి. ఫిజికల్, ఎమోషనల్, సెక్సువల్ గా అన్ని బౌండరీలు పెట్టుకోవాలి. కాబట్టి... ఈ విషయాల్లో చాలా క్లారిటీ ఉండాలి. సందిగ్దత ఉండకూడదు.
 

4.మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి. అదేవిధంగా వారిని కూడా మీరు ప్రేమించాలి. మీరు ప్రేమించగానే సరిపోదు... ఆ ప్రేమను వారిపై చూపించడం కూడా నేర్చుకోవాలి. నిజాయితీగా.. మీరు వారిపై ప్రేమను చూపించడం నేర్చుకోవాలి.

lover


5.మీ పార్ట్ నర్ కి అవసరమైన సమయంలో వారికి మద్దతుగా నిలవడం నేర్చుకోవాలి. దాదాపు పురుషులు తొందరగా తమ ఫీలింగ్స్ ని బయటపెట్టరు. కాబట్టి వారిని అర్థం చేసుకోవాలి. వారికి అండగా ఉండాలి.

6.ప్రేమలో అప్పుడప్పుడు కాస్త దూరంగా ఉండటం కూడా మంచిదే. దూరంగా ఉండటం వల్ల ప్రేమ మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే... మీ జీవిత భాగస్వామిని గ్రాంటెడ్ గా తీసుకోవడం అస్సలు మంచిది కాదు.


7.ప్రేమించిన వారి దగ్గర కావాల్సినవి అడిగి తీసుకోవడం మంచిదే. కానీ... అలా అని మరీ ఎక్కువగా డిమాండ్స్ చేయడం మంచిది కాదు వారిని ఇబ్బంది పెట్టే డిమాండ్స్ చేయడం మంచిదికాదు.


8.ఇక.. ఒక బంధం అందంగా సాగాలంటే... వారి మధ్య ప్రేమ, సెక్స్ లైఫ్ కూడా బాగుండాలి. సెక్స్ లైఫ్ ని సరిగా ఉండేలా చూసుకోవాలి, రొమాన్స్, రోల్ ప్లేకి ఎక్కువ స్కోప్ ఇవ్వాలి.

click me!