1. తులసి..
ఈ మొక్క ప్రతి ఇంట్లో కచ్చితంగా ఉండాలట. ఈ మొక్క మనకు ఎంతో ఉపయోగకరమైనది. అంతేకాకుండా.. ప్రేమ, సంపద, అందం, అదృష్టాన్ని తీసుకువస్తుందట. మన ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలోనూ సహాయం చేస్తుంది. ఆహారంలో తులసిని భాగం చేస్తే.. ఆ వంటకం తినే వారి అభిరుచి మేల్కొల్పుతుందని నమ్ముతారట. దీనిలో మంచి యాంటీ సెప్టిక్, యాంటిడిప్రెసెంట్ అని కూడా అంటారు.
అంతేకాకుండా మెదడు చురుగ్గా పనిచేస్తుంది: మెదడు పనితీరును మెరుగుపరచడానికి తులసి చక్కగా పనిచేస్తుంది. కాచి చల్లార్చిన నీటిలో తులసి రసాన్ని (Tulasi juice) కలుపుకుని ఉదయాన్నే పరగడుపున తాగడంతో మెదడు చురుగ్గా పనిచేస్తుంది. జ్ఞాపక శక్తి (Memory) పెరుగుతుంది.