ఈ లక్షణాలు ఉన్న అమ్మాయి దొరికాలని ప్రతి పురుషుడు కోరుకుంటాడట..!

First Published | Mar 10, 2022, 3:44 PM IST

ఇక్కడ అలా చెప్పేవారిలోనూ లేదంటే వారి భర్తలోనూ ఎలాంటి సమస్య లేదనే చెప్పాలి. ఎందుకంటే.. దాదాపు పురుషులంతా కొన్ని రకాల లక్షణాలు ఉన్న మహిళలను ఎక్కువగా ఇష్టపడతారట.

Image: Getty Images

చాలాల మంది చాలా సార్లు చెబుతూ ఉంటారు. నేనేం చేసినా నా భర్త అసలు నన్న పట్టించుకోడు అని వాపోతూ ఉంటారు.  ఇక్కడ అలా చెప్పేవారిలోనూ లేదంటే వారి భర్తలోనూ ఎలాంటి సమస్య లేదనే చెప్పాలి. ఎందుకంటే.. దాదాపు పురుషులంతా కొన్ని రకాల లక్షణాలు ఉన్న మహిళలను ఎక్కువగా ఇష్టపడతారట.

Image: Getty Images

ఉత్తేజకరమైన లక్షణాలు కలిగిన కొన్ని రకాల స్త్రీల పట్ల పురుషులు ఆకర్షితులవుతారు. పనికిరాని విషయాల గురించి లేదా సంబంధం లేని విషయాల గురించి కబుర్లు చెప్పుకునే బోరింగ్ వ్యక్తిని ఎవరూ ఇష్టపడరు.అర్థవంతమైన సంభాషణలను నిర్వహించగలిగినప్పుడు ఇష్టపడతారు. మహిళలు బాధ్యతను స్వీకరించి స్థిరంగా ఉన్నప్పుడు కొంతమంది పురుషులు ఇష్టపడతారు. అసలు ఎలాంటి లక్షణాలు ఉన్న స్త్రీ దొరికితే.. వారి పట్ల పురుషులు జీవితాంతం ఆకర్షణీయంగా ఉంటారో ఓసారి చూద్దాం..


వ్యక్తిగత, వృత్తి జీవితంలో పురుషులు ఎన్నో ఆటుపోటులు ఎదుర్కొంటూ ఉంటారు.  కాబట్టి.. వారిని విసిగించేవారు జీవితంలో వస్తే.. వారు చిరాకు పడతారట. ఎప్పుడెప్పుడూ దూరంగా పోదామా అన్నట్లు  చూస్తారట. అలా కాకుండా.. తమకు స్పూర్తి కలిగించేలా.. ప్రేరణ కలిగించే మహిళలు తమ జీవితంలోకి వస్తే చాలా హ్యాపీగా ఫీలౌతారట. తమ సామర్థ్యం ఏంటో గుర్తించి.. ప్రేమరణ ఇచ్చే మహిళ జీవితంలోకి వస్తే.. జీవితాంతం వారితోనే ఉండాలని అనుకుంటారట. 

ఇక.. ఎప్పుడూ బోరింగ్ కలిగించే విషయాలను చెప్పేవారితో ఉండటానికి కూడా పురుషులు ఇష్టపడరట. అలా కాకుండా..  అందరి దృష్టి ఆకర్షించేలా మాట్లాడగల సత్తా ఉన్న స్త్రీలను ఎలాంటి పురుషులైనా ఇష్టపడతారట. ఎప్పుడూ తమ గురించి డప్పు కొట్టుకునేవారంటే వీరికి నచ్చదట. ఆకట్టుకునేలా మాట్లాడే స్త్రీలు జీవితంలోకి వస్తే.. వారితోనే ఉండటానికి ఇష్టపడతారు.

పురుషులు ఖచ్చితంగా ఇది ఒక ముఖ్యమైన అంశంగా భావిస్తారు. వారి స్నేహితులు ఇష్టపడని స్త్రీలతో ఉండటానికి వారు ఖచ్చితంగా వెనుకాడతారు. మరియు వారి స్నేహితులు వారి భాగస్వామిని నిజంగా ఇష్టపడితే, పురుషులు సంతోషంగా ఉంటారు! వారు తమ స్నేహితులతో సులభంగా కలిసిపోయే స్త్రీతో ఉండటానికి ఇష్టపడతారు.

ఇక చాలా మంది పురుషులు.. తమపై ఆధారపడే వారు కాకుండా.. అన్ని విషయాల్లో బాధ్యతగా ఉండేవారిని ఎక్కువగా ఇష్టపడతారట.  తమకు తోడుగా ఉంటూ.. తమ ఆర్థిక విషయంలోనూ చాలా బాధ్యతగా ఉండే వారు తమ జీవితంలోకి రావాలని వారు కోరుకుంటారు. అలాంటి అమ్మాయి దొరికితే.. వారు జీవితంలో ఎప్పుడూ వదిలేయాలి అని అనుకోరు.  ఏ సమస్యనైనా ప్రశాంతంగా పరిష్కరించగల భాగస్వామి తమ పక్కన ఉండాలని ఎవరు కోరుకోరు?

ఇక సెక్స్ విషయంలోనూ  ఎక్కువ ఆస్తిగా ఉండేవారిని పురుషులు కోరుకుంటారట. మంచం మీద.. తమను ఎంజాయ్ చేయగలిగేలా ఉండే వ్యక్తి జీవితంలో కి రావాలని వారు కోరుకుంటారట.  జీవితంలో తాము ఏదీ కోల్పోతున్నామనే భావన కలగకుండా.. ప్రేమగా చూసుకునే భార్య దొరకాలని అనుకుంటారట. 

Latest Videos

click me!