ఈ మధ్యకాలంలో చాలా మంది చిన్న చిన్న కారణాలకే విడాకుల బాట పడుతున్నారు. సమస్య వస్తే ఎలా పరిష్కరించాలి అని కాకుండా... ఎప్పుడు విడిపోదామా అని చాలా మంది చూస్తున్నారు. అసలు.. విడాకులు తీసుకోవడానికి గల కారణాలు ఏంటి..? ఎలాంటి తప్పులు విడాకులకు దారితీస్తున్నాయో ఓసారి చూద్దాం..
1.దంపతుల మధ్య జీవితం సజావుగా సాగాలి అంటే వారి మధ్య కమ్యూనికేషన్ చాలా అవసరం. దంతుల మధ్య కమ్యూనికేషన్ లోపించినప్పుడు సమస్యలు మొదలౌతాయి. కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చినప్పుడు మనస్పర్థలు రావడం మొదలౌతుంది.
2.దంపతులు విడాకులకు దారితీయడానికి మరో ముఖ్య కారణం.. చీటింగ్. ఒకరినొకరు మోసం చేసుకోవడం. పార్ట్ నర్ కి తెలీకుండా మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకోవడం కూడా... విడాకులు తీసుకోవడానికి ఒక కారణమౌతుంది.
3.ఆర్థిక సమస్యలు కూడా విడాకులకు కారణమౌతాయి. ఆర్థిక విషయాల్లో ఉన్న భిన్నభిప్రాయాలు దంపతుల మధ్య గొడవలకు కారణమౌతున్నాయి. మనీ మనేజ్మెంట్ సరిగా లేకపోవడం, డబ్బు సమస్యలు రావడం... చివరకు విడాకులు తీసుకోవడానికి కారణమౌతున్నాయి.
4.దంపతులు మధ్య సెక్స్ లైఫ్ సరిగాలేకపోవడం వల్ల కూడా విడాకులకు దారితీయవచ్చు. శృంగార జీవితం సరిగా ఉంటే... దంపతుల మధ్య బంధం ఆరోగ్యంగా ఉంటుంది. అది లేకపోవడం వల్ల సమస్యలకు కారణమౌతుంది.
5.దంపతులకు ఒకే ప్రయార్టీస్ లేనప్పుడు కూడా ఇలాంటి సమస్యలు మొదలౌతాయి. ఇద్దరికీ ఒకేలాంటి వాల్యూస్ , ప్రయార్టీలు వేరేగా ఉండటం వల్ల బంధాన్ని కొనసాగించలేరు. దీంతో.... చివరకు మనస్పర్థలు వచ్చి విడాకులకు దారితీస్తుంది.
6. కొన్ని సందర్భాల్లో కొందరు దంపతులు జీవితంలో ఉన్నతంగా ఎదిగి... తమ భాగస్వామిని పట్టించుకోకపోవడం వల్ల కూడా సమస్యలు వస్తూ ఉంటాయి. అవి కూడా విడాకులకు దారితీస్తుంది.
7.ప్రతి చిన్న విషయానికీ గొడవ పడుతూ... సమస్యను పరిష్కరించాల్సిన సమయంలోనూ.. సమస్యను పెంచుకుంటూ పోయే దంపతులు కూడా తొందరగా విడాకుల బాటపడుతున్నారు.
8.గొడవలు, సమస్యలు దంపతుల మధ్య రావడం సహజం. కానీ.... వాటిని పరిష్కరించుకోవడానికి ఇద్దరూ కృషి చేయాలి. అలా చేయనప్పుడే విడాకులు తీసుకోవాలనే ఆలోచనలు వస్తూ ఉంటాయి.