వాలంటైన్స్ డే యువకులే జరుపుకోవాలా..?

First Published | Feb 13, 2023, 4:06 PM IST

మీ జీవిత భాగస్వామికి గులాబీని ఇవ్వండి. వారి ముఖంలో ఆనందాన్ని చూడండి. సంబంధంలో మాధుర్యాన్ని, శృంగారాన్ని కొనసాగించడానికి ఒక్క చిన్న పువ్వు సరిపోతుంది.

ప్రేమికుల రోజు అనగానే... దానిని కేవలం యువకులు మాత్రమే జరుపుకుంటారు అనే భావన చాలా మందిలో ఉంటుంది. కానీ.... ప్రేమకు వయసుతో పని ఏముంది..? మనసులో ప్రేమ ఉంటే... అది ఏ వయసులో నైనా వ్యక్తపరచవచ్చు.  అయితే... ఆ ప్రేమను వ్యక్తపరిచే విధానంలో తేడాలు ఉంటే ఉండి ఉండొచ్చు. మరి 40ఏళ్లు దాటిన వారు.. వాలంటైన్స్ డేని ఏ విధంగా జరుపుకోవచ్చో..? ఓసారి చూద్దాం...


గులాబీ మీ ప్రేమను పెంచుతుంది: మీ బాధ్యతలన్నీ మీ స్వభావాన్ని మారుస్తాయి. ప్రేమికుల దినోత్సవాన్ని యువకుల్లాగా జరుపుకోలేం. కాబట్టి మీరు ఈ రోజును బోరింగ్‌గా గడపాల్సిన అవసరం లేదు. మీ జీవిత భాగస్వామికి గులాబీని ఇవ్వండి. వారి ముఖంలో ఆనందాన్ని చూడండి. సంబంధంలో మాధుర్యాన్ని, శృంగారాన్ని కొనసాగించడానికి ఒక్క చిన్న పువ్వు సరిపోతుంది.


బహుమతి: బహుమతిని ఎవరు ఇష్టపడరు? ప్రియమైన వ్యక్తి నుండి బహుమతి మరింత ప్రత్యేకంగా ఉంటుంది. మీరు ఖరీదైన బహుమతిని ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ బడ్జెట్‌కు తగ్గట్టు దుస్తులు ఇచ్చినా సరిపోతుంది. మీ భాగస్వామి ఆశ్చర్యపోతారు. మీకు మరింత దగ్గరవుతారు.

మీ భాగస్వామితో సమయం గడపండి: సమయం కంటే ఏదీ ముఖ్యమైనది కాదు. మీరు ప్రతిరోజూ మీ పనిలో బిజీగా ఉన్నారా. అయితే ప్రేమికుల రోజున మీ భాగస్వామికి సమయం ఇవ్వండి. కలిసి వంట చేసుకోవడం లేదా ఇంటి పని చేయడం. అలా కాదు అంటే... ఇద్దరూ కలిసి సరదాగా పార్క్ కి వెళ్లడం చేయాలి. అలా వెళ్లి.. అక్కడ మీ పాత జ్ఞాపకాలను నెమరువేసుకోవచ్చు.
 

ప్రేమగా మాట్లాడుకోవడం: యువకులు తమ ప్రేమను హాయిగా వ్యక్తం చేస్తారు. కానీ వృద్ధ దంపతులు మనసులోని భావాన్ని బయట పెట్టరు. తన భాగస్వామికి ఐ లవ్ యూ చెప్పడం వారికి కాస్త ఇబ్బందిగా ఉంది. మీ భావాలు మీ భాగస్వామికి తెలియవు అనుకుంటే... ప్రేమికుల రోజు మీ ప్రేమను వ్యక్తీకరించడానికి మంచి సమయం.వారికి కొంత సమయం ఇచ్చి... మీ మనసులోని మాటను తెలియజేయాలి.
 

Latest Videos

click me!