ఇలాంటి గొడవలు చాలు.. దాంపత్య జీవితం నాశనం అవ్వడానికి..!

First Published | Jan 17, 2022, 9:22 AM IST

ఇలాంటి గొడవల వల్ల.. ఒకరిపై మరొకరికి  చెరగని కోపం లాంటివి మొదలౌతాయట. తర్వాత.. గొడవ సమసినా... మనసులో మాత్రం అది ఉండిపోతుంది. పదే పదే ఇలాంటి గొడవలు జరిగితే, సమస్య మరింత జఠిలంగా మారుతుంది.

couple fight

ఒకరిని ప్రేమించడం... పెళ్లి చేసుకోవడం చాలా సులభం. కానీ..  ఆ బంధాన్ని నిలపెట్టుకోవడమే చాలా కష్టమైన విషయం.  ఎందుకంటే.. ఒక రిలేషన్ నిలపడాలి అంటే.. ఆ ఇద్దరి వ్యక్తుల మధ్య కమిట్మెంట్ చాలా అవసరం.

రెండు భిన్న ఆలోచనలు ఉన్న వ్యక్తులు ఒకటిగా కలిసి ఉండాలి అంటే.. వారి మధ్య.. అభిప్రాయాలు కలవాలి. అలా కలవకపోతే.. వారి మధ్య.. బేధాభిప్రాయాలు రావడం జరుగుతుంది. దంపతుల మధ్య.. వచ్చే కొన్ని రకాల గొడవలు.. వారి జీవితాన్ని నాశనం చేస్తాయి. అవేంటి..? వేటికి దూరంగా ఉంటే.. బంధం బలంగా ఉంటుందో ఓసారి చూద్దాం..

Latest Videos


అన్ని జంటలు గొడవపడతాయి.. ఇది సాధారణం. అయితే, ఈ తగాదా ముగియకుంటే.. మాత్రం కోపంతో చాలా మంది...  తలుపులు పగులగొట్టి వెళ్లిపోతారు, ఇంట్లోని వస్తువలను విసిరికొట్టడం లాంటివి చేసేస్తారు. అయితే.. ఇలాంటి గొడవల వల్ల.. ఒకరిపై మరొకరికి  చెరగని కోపం లాంటివి మొదలౌతాయట. తర్వాత.. గొడవ సమసినా... మనసులో మాత్రం అది ఉండిపోతుంది. పదే పదే ఇలాంటి గొడవలు జరిగితే, సమస్య మరింత జఠిలంగా మారుతుంది.

ఇక కొందరు.. తమ లైఫ్ పార్ట్ నర్ చెప్పే ప్రతి విషయానికీ నో చెప్పేస్తుంటారు. వారు ఏది అడిగినా కాదు అనేస్తుంటారు. దీంతో.. వారిలో నిరాశ పెరుగుతుంది. అంతేకాకుండా.. ఇంట్లో చిన్న చిన్న పనుల్లో సహాయం చేయకపోవడం నిరాశను పెంచుతుంది.

ప్రతిగా, భాగస్వామిలో ఎవరైనా ఈ పనులను చేస్తే, మరొకరు తప్పనిసరిగా వారు ఏదైనా చేశారనే వాస్తవాన్ని గుర్తించి అభినందించాలి. పైన పేర్కొన్న వాటిలో ఏదీ జరగకపోయినా..భాగస్వామి ఖచ్చితంగా మీరు తమ  గురించి పట్టించుకోవడం లేదని . వారు గ్రాంట్‌గా తీసుకుంటున్నారని భావిస్తారు. ప్రతి సంబంధంలో పరస్పరం, అంగీకారం,సహాయం చాలా ముఖ్యం.

సెక్స్ అనేది కోరిక మాత్రమే కాదు, ఇది సాన్నిహిత్యాన్ని పెంచుతుంది. భాగస్వామిలో ఎవరైనా ప్రతిసారీ మరొకరికి సెక్స్‌ను తిరస్కరించినట్లయితే, సంబంధం ముగింపు దశకు చేరుకునే అవకాశం ఉంది. కాబట్టి.. పూర్తిగా సెక్స్ కి దూరం పెట్టడం కూడా కరెక్ట్ కాదు.

ఇక కొందరు.. తమ పార్ట్ నర్ తో తమ మనసులోని విషయాలను కూడా పంచుకోరు. అది చాలా నిరాశకు దారి తీస్తుంది. చివరికి.. అది మీ మనసులో తప్పుగా నాటుకుపోతుంది.  వారు కూడా మీ గురించి తప్పుగా అనుకునే అవకాశం ఉంది.  అలాగే, మీరు దూరాన్ని సృష్టిస్తున్నారని  మీ భాగస్వామి భావిస్తారు. సంబంధం అంటే అది కాదు. సంబంధంలో మీరు భాగస్వాములు, అక్కడ మీరు ఒకరితో ఒకరు పారదర్శకంగా ఉండాలి. అన్ని సమస్యలను కలిసి పరిష్కరించుకోండి. 

ఇక.. ఏదైనా గొడవ జరిగినా.. మనస్పర్థలు వచ్చినా.. క్షమాపణలు  చెప్పడం చాలా అసవరం. అయితే.. ఆ చెప్పే విధానంలో కూడా కరెక్ట్ గా ఉండాలి. వెటకారంగా చెప్పడం వల్ల ఉపయోగం ఉండదు. పైగా ఎదుటివారిని బాధిస్తుంది.  అలా కాకుండా.. ప్రతిసారీ తప్పు చేయడం..ఆ తర్వాత క్షమాపణలు చెప్పడం లాంటివి చేస్తుంటారు. దాని వల్ల కూడా ఉపయోగం ఉండదు.  ఆ తప్పు చేయకుండా ఉండేలా చూసుకోవాలి. కానీ.. తప్పు చేసి... సారీ చెప్పడం వల్ల  ఉపయోగం ఉండదు.

click me!