ఉదయాన్నే.. ప్రశాంతంగా నవ్వుతూ నిద్ర లేస్తే.. ఆ రోజంతా ఎంతో హాయిగా, ఉత్సాహంగా ఉంటుంది. ఆ ఆనందం.. మీ పార్ట్ నర్ నుంచి వస్తే.. మరింత హాయిగా ఉంటుంది. అంటే.. ఒకరిపై మరొకరు సరదాగా.. జోకులు వేసుకోవడం మొదలుపెట్టాలి. అలా చేయడం వల్ల.. ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది. అది రోజంతా ఇద్దరినీ ఆనందంగా ఉంచేలా చేస్తుంది. అయితే.. ఆ జోక్స్ చాలా సరదాగా ఉండాలి.