ఈ సింపుల్ లక్షణాలు... సమాజంలో గౌరవాన్ని పెంచుతాయి..!

First Published | Mar 31, 2023, 9:44 AM IST

మనం సాధ్యమైనంత వరకు మన ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవాలట. మనం ఎక్కడ ఉన్నాం... ఎలా ప్రవర్తిస్తున్నాం... అనే విషయంలో ఎవరికైనా కంట్రోల్ ఉంటే..... అలాంటి వారికి ఎవరైనా గౌరవం ఇచ్చేస్తారట.

మనం చేసే పనులను బట్టి మనకు సమాజంలో గౌరవం లభిస్తూ ఉంటుంది. ఎలాంటి గౌరవం లేకుండా బతకాలని ఎవరూ అనుకోరు కదా. అంతో, ఇంతో గౌరవం ఎవరైనా ఇస్తుంటేనే మనకు ఆనందంగా ఉంటుంది. అయితే... అందరిచేతా గౌరవం పొందాలంటే.. కొన్ని లక్షణాలను అలవరుచుకోవాలట. మరి అవేంటో ఓసారి చూద్దామా..
 

ముందుగా ఎవరికైనా మన ఫిజికల్ అప్పీయరెన్సే కనపడుతుంది. మనం శుభ్రంగా, నీట్ గా ఉన్నామంటే ఎవరికైనా గౌరవం ఇవ్వాలి అనిపిస్తుంది. అలా కాకుండా... మాసిన దుస్తులతో.. ఎలా పడితే అలా ఉంటే..  శుభ్రంగా కనిపించకుంటే ఎవరికీ మర్యాద ఇవ్వాలి అని అనిపించదు.

Latest Videos


మనం సాధ్యమైనంత వరకు మన ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవాలట. మనం ఎక్కడ ఉన్నాం... ఎలా ప్రవర్తిస్తున్నాం... అనే విషయంలో ఎవరికైనా కంట్రోల్ ఉంటే..... అలాంటి వారికి ఎవరైనా గౌరవం ఇచ్చేస్తారట.
 


అతిగా మాట్లాడేవారికి అందరూ ప్రతిసారీ ఇష్టపడరట. అవసరానికి మించి మాట్లాడేవారిని అందరూ విసుక్కుంటూ ఉంటారట. అలా కాకుండా...  తక్కువగా... ఉన్నది ఉన్నట్లు మాట్లాడేవారి కి అందరూ ఎక్కువగా గౌరవం ఇస్తూ ఉంటారట.
 

ఇతరులకు అవసరమైనప్పుడు మీరు సహాయం గా ఉన్నా... వారికి తోడుగా ఉండటం అలవాటు చేసుకుంటే... వారు కూడా మీ సమయానికి  గౌరవం ఇవ్వడం మొదలుపెడతారు.

మన ముఖంపై ఎప్పుడూ చిరునవ్వు చెరగనివ్వకుండా చూసుకోవాలి. మన ముఖంపై చిరునవ్వు ఉంటే...అందరినీ ఆకర్షించవచ్చు. అలా కాకుండా ఎప్పుడూ ముఖం మాడ్చుకొని.. కోపంగా ఉండేవారితో ఎవరూ పెద్దగా కలిసిపోవాలని అనుకోరు.

woman

మనం ఎవరికైనా ఏదైనా చెప్పేటప్పుడు... మాట్లాడేటప్పుడు చాలా కాన్ఫిడెంట్ గా ఉండాలి. ఈ లక్షణం కూడా అందరి పట్ల మిమ్మల్ని గౌరవించేలా చేస్తుంది.

వ్యక్తిగత, వృత్తిపరంగా ఆరోగ్యకరమైన బౌండరీస్ ఎప్పుడూ ఉంచుకోవాలి.   అంతేకాకుండా చాలా మంది అందరినీ ఇంప్రెస్ చేయాలని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆ అలవాటు మార్చుకోవాలి. ఇతరులపై ఫోకస్ పెట్టకుండా మీ పై మీరు ప్రత్యేక దృష్టి పెడితే అది మిమ్మల్ని అందరిలోనూ ప్రత్యేకంగా ఉంచుతుంది.

ఇతరులతో మాట్లాడే సమయంలో మీరు ఐ కాంటాక్ట్ ఇవ్వడం చాలా ముఖ్యం. ఇది కూడా ఇతరులలో మీ పై గౌరవం పెరగడానికి ఒక కారణం అవుతుంది.

click me!