ఇలాంటి పార్ట్ నర్ మిమ్మల్ని మోసం చేయలేరు..!

First Published | Aug 25, 2023, 1:00 PM IST

మీతో కమ్యూనికేషన్ సరిగా కనసాగించలేరు. లేదు, మీతో కమ్యూనికేషన్ సరిగా ఉంది అంటే, వారి విషయంలో మీరు భయపడాల్సిన అవసరం లేదు.

దాంపత్య జీవితం ఆనందంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే, అలా బంధం ఆనందంగా సాగాలి అంటే, ఆ దంపతుల మధ్య ప్రేమ ఉండాలి. అంతేకాదు, నిజాయితీ ఉండాలి. ఒకరిపై మరొకరికి నమ్మకం ఉండాలి. తమ భాగస్వామిని ఎట్టి పరిస్థితుల్లోనూ మోసం చేయకూడదు అనే ఆలోచన ఉండాలి. నిజంగా, మీ భాగస్వామి జీవితంలో ఎప్పటికీ మిమ్మల్ని మోసం చేయరు అనే నమ్మకం ఈ కింది సంకేతాలతో తెలుస్తుంది.

1.మీ భాగస్వామి మీతో ప్రతి విషయాన్ని ప్రేమగా పంచుకుంటున్నాడు అంటే అతను మిమ్మల్ని మోసం చేయడు అని అర్థం. మీ భాగస్వామి  మరో వ్యక్తితో రిలేషన్ లో ఉంటే, మీతో కమ్యూనికేషన్ సరిగా కనసాగించలేరు. లేదు, మీతో కమ్యూనికేషన్ సరిగా ఉంది అంటే, వారి విషయంలో మీరు భయపడాల్సిన అవసరం లేదు.


2.నిజంగా, మీ భాగస్వామి మిమ్మల్ని మోసం చేయాలని అనుకోవడం లేదు అంటే, వారు మీ దగ్గర ఎలాంటి సీక్రెట్స్ ఉంచరు. ఎలాంటి విషయాన్ని అయినా, వారు మీతో పంచుకుంటారు. మోసం చేయాలి అనుకునేవారే సీక్రెట్స్ ఉంచుకుంటారు.
 

3.నిజంగా మీ భాగస్వామి నిత్యం మిమ్మల్ని ప్రేమిస్తూ ఉంటే, వారు మిమ్మల్ని బాధపెట్టాలి అని అనుకోరు. వారు ఏ విషయంలోనూ మిమ్మల్ని వదులుకోవాలి అని అనుకోరు. వారిని ఎప్పుడూ మీరు ఎక్కడ దూరం అయిపోతారా అనే భయం ఉంటుంది.

4.ఇక, వారు నిత్యం మీతో సమయం గడపాలి అనుకుంటూ ఉంటారు. వారికి కొంచెం సమయం దొరికినా, మీతోనే ఆ  సమయం గడపాలి అనుకుంటూ ఉంటారు.


5.జీవితంలో వారికి అన్నింటికంటే మీరే ఎక్కువగా అన్నట్లుగా భావిస్తారు. మీరు వారి కోసం ఏ చిన్నది చేసినా, దానిని చాలా గొప్పదిగా భావిస్తూ ఉంటారు. మీరుు కోపం చూపించినా అర్థం చేసుకుంటారు. ఇలాంటి ప్రేమ చూపించేవారు, జీవితంలో మిమ్మల్ని పొరపాటున కూడా మోసం చేయరు.

Latest Videos

click me!