Relationship: నిజమైన ప్రేమ అంటే శారీరక సుఖమా.. ప్రేమకు విలువ ఇదేనా?

First Published | Aug 25, 2023, 9:30 AM IST

Relationship: మన తాతల నాటి ప్రేమకు నిర్వచనం వేరు, ప్రెసెంట్ జనరేషన్ కి ప్రేమ నిర్వచనం వేరు. నేడు ప్రేమ అంటే రెండు శరీరాల కలయిక అని చాలామంది యువత అభిప్రాయం. అయితే నిజమైన ప్రేమ ఏంటో ఇప్పుడు చూద్దాం.
 

 నిజానికి ప్రేమను నిర్వచించే శక్తి ప్రపంచంలో ఎవరికి లేదు. ఒక్కొక్కరు తమ ప్రేమని ఒక్కొక్క రూపంలో తెలియజేస్తారు. కొందరు త్యాగం రూపంలో,  కొందరు కృతజ్ఞత రూపంలో మరికొందరు మరొక రూపంలో తెలియజేస్తారు. అయితే నేటి యువతలో చాలామంది ప్రేమ అంటే రెండు శరీరాల కలియక అని భ్రమలో బ్రతుకుతున్నారు.
 

కానీ ప్రేమ అనేది ఒక ఆనిర్వచనీయమైన అనుభూతి. అది శరీరాల కలియక వల్ల లభించేది కాదు. రెండు మనసుల సంఘమం వల్ల లభించేది. అయితే స్వచ్ఛమైన ప్రేమను కనుక్కోవడం ఎలా అనేది కూడా నేటి జనరేషన్ కి పెద్ద సవాల్.
 


నీ నుంచి ఏమీ ఆశించకుండా నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకునే వ్యక్తి నిన్ను నిజంగా ప్రేమిస్తున్నట్టు అర్థం. నీ శరీరాన్ని మాత్రమే కోరుకునే వాడు నిన్ను ఇంప్రెస్ చేసే విధానం వేరేగా ఉంటుంది. నువ్వు సంతోషంగా మాత్రమే ఉంటే చాలు అనుకునే వాళ్ళ ప్రవర్తన వేరేగా ఉంటుంది.
 

నువ్వు సుఖంగా ఉండటం కోసం తనకు సంబంధించిన జీవితాన్ని త్యాగం చేస్తున్నప్పుడు అతను నిజంగా నిన్ను ప్రేమిస్తున్నట్టు. నీ భవిష్యత్తు కోసం తమ శ్రమపడుతుంటే అతను నిజంగా నిన్ను ప్రేమిస్తున్నట్టు.. నువ్వు కష్టంలో ఉన్నట్టు నువ్వు చెప్పకపోయినా..
 

తనకు తానుగా తెలుసుకుని ధైర్యం చెప్పడానికి వస్తాడే..ఒక వ్యక్తి, అతను నిజంగా నిన్ను ప్రేమించే వ్యక్తి. నువ్వు డౌన్ ఫాలోయింగ్ లో ఉన్నప్పుడు నేనున్నానని ధైర్యం చెప్తాడు ఒక వ్యక్తి, అతను నిన్ను ప్రేమిస్తున్నట్టు. మీ ఇద్దరి మధ్య శారీరక సంబంధం లేకపోయినా కొన్ని నెలల తరబడి దూరంగా..
 

ఉన్నప్పటికీ ఇద్దరూ సంతోషంగా ఉంటే వాళ్లది స్వచ్ఛమైన ప్రేమ. ఇలాంటి స్వచ్ఛమైన ప్రేమ ఎప్పుడూ ఓడిపోదు. శరీరం కోసం ప్రేమించేవాడు వాడి అవసరం తీరగానే ముఖం చాటేస్తాడు. కాబట్టి ప్రేమ విషయంలో ఆలోచించి అడుగు ముందుకు వేయండి.

Latest Videos

click me!