భార్యతో కలిసి జీవించడం ఇష్టం లేదు అనడానికి సంకేతాలు ఇవే..!

First Published | Feb 16, 2022, 5:06 PM IST

విడిపోవాలి అని నిర్ణయం తీసుకున్నవారు మాత్రం.. ఇదిగో.. ఈ కింద చూపించిన విధంగా ప్రవర్తిస్తుుంటారు. ఎలాంటి సంకేతాలు  చూసి  ముందు మాత్రం ఇలాంటి సంకేతాలు కనపడతాయట. ఈ సంకేతాలు కనపడిన తర్వాత.. కచ్చితంగా వారు పెళ్లి బంధానికి స్వస్తి పలికే అవకాశం ఎక్కువగా ఉంటుందట.
 

ఇద్దరు వ్యక్తులను ఒకటిగా చేసే శక్తి పెళ్లి అనే బంధానికి మాత్రమే ఉంది. అయితే.. పెళ్లి తర్వాత.. అందరి జీవితాలు ఆనందంగా సాగవు. కొందరు.. పెళ్లైన మొదట్లో ఆనందంగా ఉన్నప్పటికీ.. తర్వాత మనస్పర్థలు, వివాదాలు, గొడవలు జరగడం చాలా కామన్ అయిపోతుంటాయి. 

అయితే... గొడవలు జరిగినంత మాత్రాన ఎవరూ విడిపోరు. కానీ.. విడిపోవాలి అని నిర్ణయం తీసుకున్నవారు మాత్రం.. ఇదిగో.. ఈ కింద చూపించిన విధంగా ప్రవర్తిస్తుుంటారు. ఎలాంటి సంకేతాలు  చూసి  ముందు మాత్రం ఇలాంటి సంకేతాలు కనపడతాయట. ఈ సంకేతాలు కనపడిన తర్వాత.. కచ్చితంగా వారు పెళ్లి బంధానికి స్వస్తి పలికే అవకాశం ఎక్కువగా ఉంటుందట.


చాలా మంది పురుషులు పెళ్లి చేసుకున్నప్పటికీ.. పెళ్లైన వారిలా ఉండరట. పెళ్లి తర్వాత వచ్చే బాధ్యతలను పంచుకోరు. జీవిత భాగస్వామిని కనీసం అర్థం చేసుకోరు. అలాంటి వారితో.. లైఫ్ చాలా కష్టంగా ఉంటుంది. ఇలానే కంటిన్యూ అయితే.. వీరితో బంధం ఎక్కువ కాలం సాగదు. తొందరలోనే విడాకులు తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

పెళ్లి తర్వాత.. పార్ట్ నర్స్ ఇద్దరూ.. వారి భవిష్యత్తు గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అలా కాకుండా  పార్ట్ నర్ తో సంబంధం లేకుండా.. భవిష్యత్తు నిర్ణయాలు తీసుకుంటున్నారు అంటే... వారు తమ వివాహిక బంధానికి స్వస్తి పలుకుతున్నారని అర్థమట. మీ భాగస్వామితో భవిష్యత్తు గురించి ఆలోచించడం. మీ భాగస్వామితో కలిసి మీ కలలు మరియు ఆశయాలను సాధించడం మిమ్మల్ని ఉత్తేజపరుస్తుంది మరియు అది కాకపోతే, మీరు.. విడిపోవడానికి సిద్దంగా ఉన్నట్లు అర్థమట 

మీ భార్య మరో వ్యక్తితో చనువుగా ఉంది అనే ఆలోచన వస్తే.. మామూలుగా ఏ భర్తకైనా కోపం వచ్చేస్తుంది. కానీ.. మీకు అలా రావడం లేదు అంటే.. మీకు.. మీ భార్య పట్ల ఎలాంటి ఫీలింగ్స్ లేవని అర్థం. ఆమె మరొకరితో సంతోషంగా ఉన్నా మీకు ఎలాంటి సమస్య లేదు అని అర్థం. అంటే.. మీరు ఆమెకు దూరం కావడానికి ఆల్రెడీ సిద్ధమైపోయినట్లు అర్థమట.

ముఖ్యమైన డబ్బు నిర్ణయాలు తీసుకునేటప్పుడు, మీ భాగస్వామిని చేర్చుకోవడం చాలా అవసరం. కానీ ఆ ఆలోచన మిమ్మల్ని కలవరపెడితే, మీ ఆర్థిక విషయాల గురించి మీ భాగస్వామికి చెప్పకుండా ఆపివేస్తే, మీరు బహుశా వారితో కలిసి ఉండకూడదు అనే నిర్ణయం తీసుకున్నట్లు అర్థమట. విడిపోవడానికి , విడాకులకు ప్రధాన కారణాలలో ఆర్థిక సమస్యలు ఒకటి. మీ ఆదాయ వివరాలను చెప్పడానికి ఆలోచిస్తున్నారు అంటే.. వారితో విడిపోవాలనే నిర్ణయం మీరు తీసేసుకున్నారట.

వైవాహిక జీవితంలొ సమస్యలు ఉండటం చాలా కామన్. అయితే.. కలిసి ఉండాలి అనుకునేవారు ఆ సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ.. కలిసి జీవించడం ఇష్టం లేనివారు.. ఆ సమస్యలను పరిష్కరించడంలో కనీసం ఆసక్తి కూడా చూపించరు.

Latest Videos

click me!