ఈ ట్రిక్స్ తో.. అబద్ధాలను ఇట్టే పసిగట్టవచ్చు..!

Published : Dec 08, 2021, 11:59 AM IST

ఎవరైనా ఏదైనా విషయాన్ని ఇతరులకు చెప్పేటప్పుడు.. ఆ విషయాన్ని చాలా స్మూత్ గా చెప్పడానికి ప్రయత్నిస్తారు. అది వారికి కన్వే చేయాలనే ఉద్దేశంతో.. సరళంగా మాట్లాడతారు.

PREV
17
ఈ ట్రిక్స్ తో.. అబద్ధాలను ఇట్టే పసిగట్టవచ్చు..!

జీవితంలో ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు అబద్ధాలు చెబుతూనే ఉంటారు.  కొందరు కావాలని అబద్ధాలు చెబుతారు. మరి కొందరు.. పరిస్థితి నుంచి తప్పించుకోవడానికి అబద్ధం చెబుతుంటారు. అయితే.. ఎదుటివారు చెప్పింది అబద్ధం అని తెలిసినప్పుడు.. విన్నవారికి చాలా బాధగా, ఇబ్బందిగా ఉంటుంది. అయితే.. అసలు ఎదుటివారు చెప్పేది.. నిజమో, అబద్దమో అనే విషయాన్ని.. కొన్ని సింపుల్ ట్రిక్స్ తో కనిపెట్టేయవచ్చట.  అదెలాగో ఇప్పుడు చూద్దాం..

27

ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగా వారు మాట్లాడే  విషయం గురించి ముఖ్యమైన వివరాలను వదిలేస్తూ.. ఇతర వివరాలన్నీ  చెబుతున్నారు అంటే.. అతను లేదా ఆమె అబద్ధం చెప్పే అవకాశం ఉంది అని అర్థమట.

37

ఎవరైనా ఏదైనా విషయాన్ని ఇతరులకు చెప్పేటప్పుడు.. ఆ విషయాన్ని చాలా స్మూత్ గా చెప్పడానికి ప్రయత్నిస్తారు. అది వారికి కన్వే చేయాలనే ఉద్దేశంతో.. సరళంగా మాట్లాడతారు. అయితే.. అలా కాకుండా.. మామూలు విషయాన్ని కూడా అతిశయోక్తి చేస్తూ.. ఎవరైనా చెబుతున్నారు అంటే..  అందులో ఎంతో కొంత అబద్ధం ఉందని గుర్తించాలి.

47

ఎవరైనా ఏదైనా విషయం చెబుతున్నప్పుడు.. దానిని క్రాస్ క్వొశ్చన్ చేస్తే.. వారు చెప్పేది నిజమో, అబద్దమో తెలుసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుందట. ఎదురు ప్రశ్నలు అడిగినప్పుడు.. వారు అబద్ధం చెబుతున్న విషయం బయటపడుతుందట. రెండు సార్లు తికమక పెట్టి.. ప్రశ్నలు అడిగితే.. వారు వెంటనే తప్పుడు సమాధానాలు చెబుతారు. దీంతో.. వారు చెప్పేది అబద్దం అనే విషయాన్ని పసిగట్టవచ్చు. అబద్ధం మెదడుకు హాని చేస్తుందట. నిజం చెప్పడానికి ఆాలోచించాల్సిన అవసరం లేదు. కానీ అబద్ధం చెప్పడానికి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం ఉంటుందట. అందుకే.. క్రాస్ క్వశ్చన్స్ చేసినప్పుడు..తొందరగా ఆలోచించలేక తడపడతారు. దీంతో.. వారు చెప్పేది.. నిజమో, అబద్దమో తెలుసుకోవచ్చు.

57

అబద్ధం చెప్పే ప్రక్రియలో, ప్రజలు వారి పదాలు లేదా పదబంధాలను పునరావృతం చేస్తారు. కాబట్టి.. దానిని బట్టి.. మీ ఎదురుగా నిల్చున్న వ్యక్తి అబద్ధాల కోరు అనే విషయాన్ని గుర్తించవచ్చు.

67

మీరు అబద్ధం చెప్పినప్పుడు, మీరు మీ ట్రాక్‌లను కవర్ చేయడానికి ప్రయత్నిస్తారు. అవసరమైన దానికంటే ఎక్కువ సమాచారాన్ని అందించడానికి ప్రయత్నిస్తారు. ఈ సమయంలో మీరు వ్యక్తిని పట్టుకోవచ్చు. ఇలా అబద్ధం చెప్పే వారిని ఈజీగా కనిపెట్టవచ్చు.

77

అబద్ధం చెప్పడం ఒక కళ . చాలా తక్కువ మంది మాత్రమే దానిని స్వాధీనం చేసుకున్నారు. మీరు అబద్ధం చెప్పినప్పుడు, మీరు ఏకాగ్రతను కలిగి ఉంటారు, తద్వారా మీరు తడబడకుండా ఉంటారు. ఇది అబద్ధం చెప్పని వ్యక్తితో పోలిస్తే మీరు చాలా నిశ్చలంగా మారేలా చేస్తుంది
 

click me!

Recommended Stories