శృంగారం గురించి ఆడవారు, మగవారు ఈ విషయాలను ఖచ్చితంగా తెలుకోవాలి

First Published May 18, 2023, 9:39 AM IST

సేఫ్ సెక్స్ గురించి ఆడవారు, మగవారు ఖచ్చితంగా కొన్ని విషయాలను తెలుసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇవి ఎన్నో లైంగిక రోగాల నుంచి కాపాడుతాయి. 
 

సెక్స్ ప్రతి వ్యక్తి జీవితంలో చాలా ముఖ్యమైన భాగం. ఎందుకంటే ఇది ఎన్నో రోగాల నుంచి కాపాడుతుంది. మానసిక స్థితిని కూడా మెరుగ్గా ఉంచుతుంది. నిజానికి సెక్స్ తో లాభాలే కాదు నష్టాలు కూడా ఉన్నాయి. ఈ నష్టాలు మీరు సెక్స్ లో పాల్గొనే విధానమే డిసైడ్ చేస్తుందంటున్నారు నిపుణులు. అసురక్షిత  సెక్స్ లో అంటే ఒకరి కంటె ఎక్కువ మంది భాగస్వాములతో సెక్స్ చేయడం, కండోమ్ లను యూజ్ చేయకపోవడం వంటి కారణాల వల్లే సెక్స్ తో ఎన్నో సమస్యలు వస్తాయి. కానీ సురక్షిత సెక్స్ తో అన్నీ లాభాలే ఉన్నాయి. బేసిక్ గా సెక్స్ గురించి ఆడవారు, మగవారు ఎలాంటి విషయాలను తెలుసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

కండోమ్ వాడకం

సెక్స్ లో కండోమ్ ల వాడకం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది మిమ్మల్ని, మీ భాగస్వామిని ఎన్నో రోగాల నుంచి కాపాడుుతుంది. ఇది ప్రపంచం మొత్తానికి తెలుసు. కానీ చాలా మంది కండోమ్ లను వాడటానికి ఇష్టపడరు. మీకు పెళ్లి అయ్యి బిడ్డను కనాలనుకుంటున్న వారకు మీరు సురక్షితమైన సెక్స్ లో పాల్గొనడం ముఖ్యమంటున్నారు నిపుణులు. అంటే పిల్లల్ని కానాలి అనుకుంటున్నంత వరకు కండోమ్ ను ఖచ్చితంగా వాడాలి. ఓరల్ సెక్స్ సమయంలో కూడా లేటెక్స్ కండోమ్ లు, డెంటల్ డ్యామ్ లను ఖచ్చితంగా ఉపయోగించండి. ఒకవేళ మీరు సెక్స్ టాయ్స్ ను ఉపయోగిస్తున్నట్టైతే అప్పుడు కూడా కండోమ్ ను ఉపయోగించండి. దీనివల్ల భాగస్వాములు లేదా స్నేహితుల ద్రవాలు మీకు అంటుకోకండా ఉంటాయి. 


కండోమ్ తప్పులు చేయొద్దు

కండోమ్ ను ధరించే ముందు దాన్ని అన్ రోల్ చేయొద్దు

మళ్లీ ఉపయోగించొద్దు

తప్పుడు సైజు కండోమ్ ను ఉపయోగించొద్దు. 

సరైన లూబ్రికెంట్ ను ఉపయోగించండి
 

సంపర్కం లేని లైంగిక కార్యకలాపాలు

ఒక వ్యక్తి పరిశుభ్రత, అతని కున్న వ్యాధుల గురించి, అతని గురించి మీకు పూర్తిగా తెలిసే వరకు సెక్స్ లో పాల్గొనకపోవడమే మంచిది. ఇందులో సైబర్ సెక్స్, పరస్పర హస్త ప్రయోగం, సెక్స్టింగ్, ఫోన్ సెక్స్ వంటివి ఉన్నాయి. ఇవి ద్రవాల వ్యాప్తి అవకాశాన్ని తొలగిస్తాయి.
 

Image: Getty

లైంగిక భాగస్వాములను పరిమితం చేయండి

జీవితంలో సెక్స్ చాలా ముఖ్యం. కానీ మీకు ఒకరి కంటే ఎక్కువ మంది లైంగిక భాగస్వాములు ఉంటే మీకు లైంగిక సంక్రమణ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రమాదాన్ని తగ్గించే మార్గాలలో ఒకటి మీ లైంగిక భాగస్వాములకు టెస్ట్ చేయించడం, అలాగే వారి లైంగిక చరిత్ర గురించి తెలుసుకోవడం. మీ గురించి వాళ్లకు పూర్తిగా చెప్పడం. సురక్షితమైన సెక్స్ పద్ధతులనే అనుసరించండి. మీకు పెళ్లి అయినప్పటికీ.. పిల్లల్ని కనడానికి ప్లాన్ చేసే వరకు మీ భాగస్వామితో సురక్షితమైన శృంగారంలోనే పాల్గొనండి. 
 

Image: Getty

ఓరల్ సెక్స్ భద్రత

మీరు ముద్దుపెట్టుకునే ఇద్దరూ పళ్లు తోముకుని, నోటిని శుభ్రం చేసుకోవాలి. నోటి నొప్పి, నోట్లో పుండ్లు ఉంటే ఓరల్ సెక్స్ కు దూరంగా ఉండండి. లిప్ కిస్ కూడా పెట్టుకోవద్దు. ముద్దు తర్వాతే చాలా మంది ఓరల్ సెక్స్ లో పాల్గొంటుంటారు. కానీ ఓరల్ సెక్స్ కు ఎన్నో పరిశుభ్రత చిట్కాలను పాటించాలి. మీరు ఓరల్ సెక్స్ చేయడానికి ముందు మీ భాగస్వామి అతని లేదా ఆమె జననేంద్రియాలను కడుక్కోమని చెప్పండి. అలాగే నోటిని పరిశుభరంగా ఉంచుకోండి. 
 

click me!