Relationship: ఆనంద సమయంలో అసౌకర్యం ఎందుకు.. ఎంజాయ్ చేయటానికి ఎన్నో మార్గాలు?

First Published | Jun 24, 2023, 2:20 PM IST

Relationship: తరచుగా శృంగారంలో పాల్గొనడం వల్ల ఆనందంతో పాటు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. కానీ ఈ తరం యువత ఆ కార్యం చేయటానికి అసౌకర్యంగా ఫీలవుతున్నారు. ఎందుకలా చేస్తున్నారు.. వాటికి పరిష్కారాలు ఏమిటి చూద్దాం రండి.
 

కొత్తగా పెళ్లయిన జంటలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే సమయం.. భాగస్వామితో మరో లోకాలకు వెళ్లే సమయం. అలాంటి సమయం కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. ఆ ఆనందాన్ని అనుభవించడం కోసం తాపత్రయపడతారు. కానీ కొందరికి ఆ కార్యం అంటేనే చిరాకుని ప్రదర్శిస్తున్నారు.

వీలైతే ఆ కార్యాన్ని తప్పించుకోవాలని చూస్తున్నారు. ఆనందించవలసిన సమయాన్ని ఎందుకు అసౌకర్యంగా ఫీల్ అవుతున్నారు అంటే అందుకు ప్రధాన కారణం మన ఫోన్ లే అంటున్నారు నిపుణులు. వినటానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం నేటి యువత సోషల్ మీడియా మీద పెట్టిన శ్రద్ధ పక్కనే ఉన్న భాగస్వామి మీద పెట్టలేకపోతున్నారు.


పడుకునేటప్పుడు, ఆ కార్యంలో ఆనందించేటప్పుడు  వేరే ఏ పని మీద ఉన్నా కూడా దృష్టి మాత్రం సెల్ ఫోన్లు మీదే ఉంటుంది. అందుకే చేసే పనిని ఆస్వాదించలేకపోతున్నారు. పరోక్షంగా మీ భాగస్వామి చిరాకుకి కూడా కారణం అవుతున్నారు. ఇక మరొక ప్రధాన కారణం ఒత్తిడి. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఆఫీసులో సమస్యలు.
 

సమస్యలు ఏమైనాప్పటికీ దాని ప్రభావం  సెక్స్ మీద పడుతుంది. మీకు తెలియని విషయం ఏమిటంటే సెక్స్లో పాల్గొనడం వలన మానసిక శారీరక సమస్యలు చాలా మటుకు కంట్రోల్లోకి వస్తాయి. ఆ సమయంలో మెదడు చురుగ్గా పనిచేయడం వల్ల ఆలోచనా విధానం కూడా మారుతుంది కాబట్టి ఒత్తిడి మూలంగా ఆ కార్యాన్ని వాయిదా వేయకండి.
 

ఇక సెక్స్ లో అసౌకర్యానికి మరొక ముఖ్య కారణం నీలి చిత్రాలని చూడటం. నీలి చిత్రాలను చూసి చాలా ఎక్కువగా ఊహించుకొని వాటిని ఎంజాయ్ చేయటం కోసం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు. దీనివల్ల మీరు ఎంజాయ్ చేయకపోగా మీ భాగస్వామి అసంతృప్తికి కూడా కారణం అవుతారు. కాబట్టి మీరు మీ భాగస్వామి ఇద్దరు సంతృప్తి పడేలా సాధారణ భంగిమలో ఆ కార్యాన్ని చేస్తే ప్రతి నిమిషాన్ని ఎంజాయ్ చేయవచ్చు.

Latest Videos

click me!