సాధారణంగా సమస్యలు ఇన్ సెక్యూరిటీ వల్ల వస్తాయి ఈ ఇన్ సెక్యూరిటీ ఆడవాళ్ళ కంటే మగవాళ్ళకి ఎక్కువగా ఉంటుందంట. తెలివిగా అలాంటి వాళ్ళు వాళ్ళ ఫీలింగ్ ని బయట పెట్టకుండా పార్ట్నర్ మీద నిందలు వేస్తూ వాళ్లపై తన అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఉంటారు.
మరి కొందరు మగాళ్లు అయితే తమ భార్యలతో మైండ్ గేమ్స్ కూడా ప్లే చేస్తారట. తమ భాగస్వాములు బాధపడుతూ ఉంటే ఆ బాధని ఈ ఇన్ సెక్యూర్డ్ హస్బెండ్స్ ఎంజాయ్ చేస్తారంట. అభద్రతాభావంలో ఉండే భర్తలు తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు దానిని భార్యపై నెట్టే ప్రయత్నం చేస్తారు.
తాము చేసిన పొరపాట్లు కూడా తమ భార్యల ఖాతాల్లో వేస్తారు. పదిమందిలోని తమ తప్పు ఏమీ లేదు తప్పంతా భార్యదే అని నిరూపించడానికి ప్రయత్నిస్తారు. మానసికంగా బాధపడేవారు భావోద్వేగంగా బాగా నటిస్తారట.. మీతో అవసరం పడితే మీ బలహీనతని తెలుసుకొని దాన్ని అస్త్రంగా వాడుకొని అయితే బెదిరించి గాని లేకపోతే నటనతో గాని భార్యని లొంగ తీసుకుంటారు.
చాలామంది భార్యాభర్తలు కలిసి పని చేసుకుంటారు కానీ కొందరు మాత్రం నా కోరికలు అవసరాలు కేవలం తన భార్య మాత్రమే తీర్చాలి అన్నట్లు ప్రవర్తిస్తారు. ఆ భార్యకి ఎప్పుడూ ఏదో ఒక పని చెబుతూ ఆమెని శారీరక శ్రమకి గురి చేస్తూ ఉంటారు. ఒకవేళ ఆ పని ఆమె చేయకపోతే ఇక తిట్లతో ఆమెని సాధించడం మొదలుపెట్టి వాళ్లలో శాడిజం ని సంతృప్తి పరచుకుంటారు.
మరి కొందరు భర్తలు తమ స్నేహితుని భార్యలనో, తమ బంధువుల భార్యలనో చూసి వాళ్లతో తన భార్య అందాన్ని పోల్చుకొని అసూయతో రగిలిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా తమ శాడిజాన్ని భార్యల మీద ప్రదర్శిస్తూ ఉంటారు. ఇలాంటి మగవాళ్ళతో జాగ్రత్త. బంధం అవసరమే కానీ భార్యలు బలికాకుండా ఉండడానికి వాళ్ల ఇన్ సెక్యూరిటీ కి కారణం తెలుసుకొని మార్చగలగాలి అలా కుదరనప్పుడు ఇలాంటి భర్తలకి దూరంగా ఉన్నా మంచిదే.