భార్యాభర్తల మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉండాలో తెలుసా?

First Published | Jul 23, 2024, 12:16 PM IST

సాధారణంగా పెళ్లిచూపుల్లోనే అబ్బాయి వయసెంత, అమ్మాయి వయసెంతో కనుక్కుంటారు. కానీ ఇద్దరి మధ్య ఎంత ఏజ్ గ్యాప్ ఉంటే మంచిది? ఎంత ఉంటే మంచిది కాదు? అన్న సంగతి మాత్రం చాలా మందికి తెలియదు. అసలు భార్యాభర్తల మధ్య ఎంత ఏజ్ గ్యాప్ ఉండాలో తెలుసా? 
 


పెళ్లి ఒక పవిత్రమైన బంధం. ఒక్కసారి ఇద్దరికీ ముడిపడితే.. ఇక జీవితాంతం తోడునిడగా ఉంటారు. ఇక ఈ పవిత్రమైన పెళ్లి తంతుకు ఎన్నో సంప్రదాయాలను పాటిస్తారు. కానీ మారుతున్న సమాజంతో పాటుగా పెళ్లికి సంబంధించిన సంప్రదాయాలు కూడా మారిపోతున్నాయి. అంటే ఒకప్పుడు పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు ఎక్కువగా జరిగితే.. ఇప్పుడు ప్రేమ పెళ్లిళ్లు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ ప్రేమ పెళ్లిళ్లు చెడ్డవేం కావు. కానీ దీనికి సంబంధించిన ఎన్నో సంప్రదాయాలను మర్చిపోతున్నారు. 
 

ప్రేమ గుడ్డిది అంటారు పెద్దలు. ఈ పదం ఊరికే రాలేదు. ఎన్నో అనుభవాల నుంచూ ఈ పదం పుట్టుకొచ్చింది. ముఖ్యంగా ఈ తరం యువత వయసుతో సంబంధం లేకుండా ప్రేమ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఉదాహరణ చెప్పాలంటే? క్రికెటర్ సచిన్ టెండుల్కర్ తనకంటే పెద్దదైన అంజలిని పెళ్లి చేసుకున్నాడు. ఇక బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా తనకంటే చిన్నవాడైన వ్యక్తిని పెళ్లిచేసుకుంది. 
 

Latest Videos


పెళ్లి చేసుకోబోతున్నారంటే? అసలు  అమ్మాయి వయసెంత, అబ్బాయి వయసెంతో ఖచ్చితంగా తెలుసుకోవాలి. అలాగే వారిమధ్య ఖచ్చితంగా ఏజ్ గ్యాప్ ఉండాలి. అలాగే అమ్మాయి వయస్సు కంటే అబ్బాయి వయసే ఎక్కువగా ఉండాలని చాలా మంది చెప్తుండటాన్ని మీరు వినే ఉంటారు. కానీ ఈ ఇద్దరి మధ్య ఎంత ఏజ్ గ్యాప్ ఉండాలో మాత్రం ఎవరూ చెప్పరు. నిపుణుల ప్రకారం.. భార్యాభర్తల మధ్య ఎంత ఏజ్ గ్యాప్ ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

స్త్రీ, పురుషుల మధ్య ఎంత ఏజ్ గ్యాప్ ఉండాలి? 

సాధారణంగా భార్యాభర్తల మధ్య 5 నుంచి 7 ఏళ్ల మధ్య ఏజ్ గ్యాప్ ఉండాలని నిపుణులు అంటారు. దీనిపై ఎన్నో పరిశోధనలు కూడా జరిగాయి. స్త్రీ, పురుషుల ఆలోచనా విధానంలో చాలా తేడా ఉంటుందని ఓ అధ్యయనం వెల్లడిస్తోంది. అలాగే ఇద్దరి మధ్య చాలా కేరింగ్ కూడా ఉంటుందట. అలాగే ఒకరినొకరు ఎలా జాగ్రత్తగా చూసుకోవాలో కూడా తెలుస్తుందట. 
 

ఏజ్ గ్యాప్ ఎంత ఉండాలి? 

భార్యాభర్తల మధ్య ఏజ్ గ్యాప్ విడాకుల ప్రమాదాన్ని 3% పెంచుతుందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. 10 సంవత్సరాల ఏజ్ గ్యాప్ ఉన్న జంటలు ..  39 శాతం  విడాకులు తీసుకునే అవకాశం ఎక్కువగా ఉందట. అలాగే 20 సంవత్సరాల ఏజ్ గ్యాప్ ఉన్న జంటలు 95 శాతం విడాకులు తీసుకునే ప్రమాదం ఎక్కువగా ఉందట. 
 

How to Build Relationship

భార్యాభర్తల మధ్య దూరం, ఏజ్ గ్యాప్ ఎంత తక్కువగా ఉంటే సమన్వయం అంత మెరుగ్గా ఉంటుందని అధ్యయనంలో తేలింది. ఇది ఇద్దరి మధ్య మంచి సమన్వయానికి దారితీస్తుంది. అలాగే వారి మధ్య విడాకులు అనే మాట వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయట.

click me!