మీ భర్త మిమ్మల్ని మోసం చేస్తున్నాడనే అనుమానం ఉందా..? ఇలా కనిపెట్టేయండి..!

First Published | Jul 19, 2024, 11:10 AM IST

భర్తను కనీసం తమను మోసం చేస్తున్నారనే విషయం కూడా చాలా మంది మహిళలు గుర్తించలేరు. అయితే వాళ్ల ప్రవర్తనలో వచ్చిన మార్పులతో మాత్రం ఈజీగా కనిపెట్టేయవచ్చట. అదెలాగో ఇప్పుడు చూద్దాం...

భార్యభర్తల బంధం నమ్మకం అనే నావపై నడుస్తుంది. తమ కుటుంబాన్ని మొత్తం వదిలేసి ఒక అమ్మాయి.. భర్త వెంట వస్తుంది. అలాంటి తనను భర్త చాలా ప్రేమగా చూసుకోవాలి అని కోరుకుంటుంది. కానీ.. కొందరు.. భార్యను మోసం చేసి మరో వ్యక్తి మోజులో పడిపోతూ ఉంటారు. భర్తను కనీసం తమను మోసం చేస్తున్నారనే విషయం కూడా చాలా మంది మహిళలు గుర్తించలేరు. అయితే వాళ్ల ప్రవర్తనలో వచ్చిన మార్పులతో మాత్రం ఈజీగా కనిపెట్టేయవచ్చట. అదెలాగో ఇప్పుడు చూద్దాం...
 


1.మాటల ద్వారా..
భార్యను మోసం చేయాలనుకునే భర్త మాటల ద్వారా ఈజీగా కనిపెట్టేయవచ్చట. అప్పటి వరకు వారిలో ఉన్న సహజత్వం మొత్తం పోతుందట. అంంటే.. వారి మాటలు, భావాలు, అభిప్రాయాలు సహజంగా లేకుండా.. అసహజ అనుభూతిని కలిగిస్తాయట. వారి మాటల్లో నిజాయితీ కరువు అవుతుంది. ఇలా మాట్లాడుతున్నారంటే.. కాస్త అనుమానించాల్సిందే.
 


2.అభిరుచులు, అలవాట్లు..
మీ భర్త  మిమ్మల్ని మోసం చేస్తున్నారు అంటే.. సడెన్ గా వారి అలవాట్లలో మార్పులు మీరు గమనించవచ్చు. ఉదాహరణకు.. మీ భర్తకు రోజూ కాఫీ తాగే అలవాటు ఉంది అనుకోండి.. సడెగా ఆ అలవాటు.. టీ మీదకు షిప్ట్ అవుతుంది. వేరేవరినో ఇంప్రెస్ చేయడానికి అలవాట్లు మార్చుకుంటున్నారని అర్థం చేసుకోవాలి.
 

3.ప్రవర్తన..
అంతేకాదు.. వారి ప్రవర్తనలో మార్పులను కూడా మీరు గమనించవచ్చు.  ఎక్కువగా అబద్దాలు చెప్పడం, ఆఫీసు పని అంటూ.. గంటలు గంటలు బయటే ఉండటం, మీతో గడపడకుండా ఉండేందుకు సాకులు వెతకడం లాంటివి చేస్తున్నారు అంటే మీరు అనుమానించాల్సిందే.


4.ఫేక్ ఎమోషన్స్..
 భావోద్వేగాలు వ్యక్తి ముఖంలో, శరీర భాషలో కనిపిస్తాయి. సహజంగా ఆనందం, దుఃఖం, కోపం వంటి భావాలు ముఖంలో ప్రతిబింబిస్తాయి. అలాకాకుండా.. ఫేక్ ఎమోషన్స్ చూపిస్తున్నారంటే మీ దగ్గర ఏదో దాచడానికి నటిస్తున్నారని అర్థం చేసుకోవాలి.


 సహజ స్వభావం ఎప్పుడూ, ఎక్కడైనా కనిపిస్తుంది. నటన చేసే వారు ఒక నిర్దిష్ట సమయం లేదా సందర్భంలో మాత్రమే సహజంగా ఉండేలా నటిస్తారు. అలా నటిస్తున్నారంటే కూడా మీరు అనుమానాల్సిందే. మీ భర్తలో సడెన్ గా ఇలాంటి మార్పులు ఏమైనా కనిపిస్తున్నాయి అంటే వారు మిమ్మల్ని మోసం చేస్తున్నారనే అర్థం. కాబట్టి.. వెంటనే రియాక్ట్ అవ్వాలి.
 

Latest Videos

click me!