హార్ట్ పేషెంట్స్ సెక్స్ చేయకూడదా..? చేస్తే ఏమౌతుంది..?

First Published | Jul 6, 2022, 10:00 AM IST

సెక్స్ సమయంలో గుండెపోటు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందని, ఎలాంటి లక్షణాలు లేనంత కాలం భయపడాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. మీరు జాగింగ్ చేయగలిగినా లేదా ఎటువంటి ఇబ్బంది లేకుండా మెట్లు నడవగలుతున్నారు అంటే.. మీరు సెక్స్ చేయవచ్చు అని నిపుణులు చెప్పారు.

ఒకప్పుడు గుండె సంబంధిత సమస్యలు కేవలం ముసలివాళ్లకు మాత్రమే వచ్చేవాటిగా పరిగణించేవారు. కానీ.. ఇప్పుడు నీ, నా అనే తేడా లేకుండా.. అందరినీ పట్టి పీడిస్తున్నాయి. ప్రతి సంవత్సరం గుండెపోటుతో 1.8 మిలియన్ల మంది ప్రపంచ వ్యాప్తంగా ప్రాణాలు కోల్పోతున్నారు. వారిలో అందరూ 70ఏళ్ల లోపు వారే ఉండటం గమనార్హం. అయితే..యువకుల్లోనూ ఈ గుండె సమస్యలు రావడం అందరినీ కలచివేస్తోంది. ఈ గుండె సమస్యలు రావడానికి చాలా కారణాలే ఉన్నాయి. వాటిలో సెక్స్ కూడా ఒక కారణంగా చెబుతుండటం గమనార్హం.
 

గుండెపోటు వచ్చే ప్రమాద కారకంగా సెక్స్

ఇటీవల, 28 ఏళ్ల యువకుడు సెక్స్ చేస్తూ గుండెపోటుతో మరణించాడు. నాగ్‌పూర్‌కు చెందిన అజయ్ పార్టేకి తన ప్రియురాలితో కలిసి ఓ లాడ్జిలో ఉండగా గుండెపోటుతో మృతి చెందాడు. వృత్తిరీత్యా డ్రైవర్, పార్ట్ టైమ్ గా వెల్డింగ్ టెక్నీషియన్‌గా కూడా పనిచేస్తున్నాడు.
నివేదికల ప్రకారం, పార్టేకి గత కొన్ని రోజులుగా జ్వరం ఉంది. సెక్స్ సమయంలో గుండె నొప్పి వచ్చి ప్రాణాలు కోల్పోయాడు. అతనికి కనీసం మద్యం అలవాటు కూడా లేకపోవడం గమనార్హం.


sex

గుండె సమస్యలు ఉన్నవారికి సెక్స్ ప్రమాదకరమా?

చికిత్స చేయని కరోనరీ ఆర్టరీ వ్యాధి సెక్స్ సమయంలో ప్రాణాంతకంగా మారుతుంది, ఇది కఠినమైన వ్యాయామం. ఈ రోజుల్లో యువతలో కరోనరీ ఆర్టరీ వ్యాధి సాధారణంగా కనిపిస్తుంది. సెక్స్ వంటి అధిక-తీవ్రత చర్య సమయంలో గుండెకు మరింత ఆక్సిజన్, రక్తం అవసరం. ఒకరికి గుండె సంబంధిత సమస్యలు ఉంటే సెక్స్ సమయంలో పెరిగే హృదయ స్పందన రేటు మరియు రక్తపోటు మరింత ప్రమాదకరంగా మారుతుంది. రోగి వైద్య పరీక్షలు క్రమం తప్పకుండా చేయకపోతే ఈ ప్రమాదం అకస్మాత్తుగా గుండెపోటుకు దారి తీస్తుంది. అందుకే.. 20 సంవత్సరాల వయస్సు నుండే రెగ్యులర్ బాడీ చెకప్ పట్ల శ్రద్ధ వహించాలి.
 

sex

సెక్స్, గుండె జబ్బుల గురించి నిపుణుల అభిప్రాయం..
మైఖేల్ బ్లాహా, M.D., M.P.H, జాన్స్ హాప్కిన్స్ సిక్కరోన్ సెంటర్ ఫర్ ది ప్రివెన్షన్ ఆఫ్ హార్ట్ డిసీజ్‌లో క్లినికల్ రీసెర్చ్ డైరెక్టర్ ప్రకారం, ఛాతీ నొప్పి, శ్వాస ఆడకపోవడం, సక్రమంగా కొట్టుకోవడం, వికారం లేదా అజీర్ణం వంటి లక్షణాలు ఉంటే లైంగిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి. సెక్స్ సమయంలో గుండెపోటు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందని, ఎలాంటి లక్షణాలు లేనంత కాలం భయపడాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. మీరు జాగింగ్ చేయగలిగినా లేదా ఎటువంటి ఇబ్బంది లేకుండా మెట్లు నడవగలుతున్నారు అంటే.. మీరు సెక్స్ చేయవచ్చు అని నిపుణులు చెప్పారు.

సెక్స్ సమయంలో గుండెపోటు సంభవించే రేటు ఎంత?

హార్వర్డ్ మెడికల్ స్కూల్ పరిశోధకుల  అధ్యయనం ప్రకారం, సెక్స్ అనేది కొంతమందిలో, ముఖ్యంగా పురుషులలో గుండెపోటును ప్రేరేపిస్తుంది, అయితే అందరికీ జరుగుతుందనే గ్యారెంటీ లేదు. అన్ని గుండెపోటు కేసులలో 1 శాతం మాత్రం.. సెక్స్ కారణంగా జరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. సెక్స్ సమయంలో గుండెపోటు చాలా తక్కువగా జరుగుతుందని.. పలువురు పరిశోధకులు, ఆరోగ్య నిపుణులు తెలిపారు.

JAMA కార్డియాలజీలో ప్రచురించబడిన ఒక ఇటీవలి అధ్యయనం ప్రకారం.. 1994, 2020 మధ్య లండన్‌లోని ఒక ఆసుపత్రిలో శవపరీక్ష చేసిన మొత్తం ఆకస్మిక గుండె మరణాలలో 0.2% సెక్స్ కారణంగా సంభవించినట్లు కనుగొంది. అంటే 1000 ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్ కేసుల్లో..2 సెక్స్‌కు సంబంధించినవి కావడం గమనార్హం.
 

గుండెపోటు  సాధారణ లక్షణాలు:
ఛాతి నొప్పి
ఛాతీలో అసౌకర్యం 
మెడ, దవడ , చేతులలో నొప్పి
శ్వాస ఆడకపోవడం లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
వికారం
 చెమటలు పట్టడం..

sex

 సెక్స్ నిజానికి గుండెకు మంచిది..సెక్స్ ద్వారా గుండెకు  అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయని చాలా అధ్యయనాల్లో తేలింది. 
శారీరక వ్యాయామం వల్ల మానవ శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో సెక్స్ కూడా అదే ప్రయోజనాలను అందిస్తుంది. ఇది హృదయ స్పందన రేటును మెరుగుపరుస్తుంది, రక్తపోటును తగ్గిస్తుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది. చాలా మంది వ్యక్తులలో నిద్రను మెరుగుపరుస్తుంది. గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే ఒత్తిడి సంబంధిత సమస్యలను రెగ్యులర్ సెక్స్‌తో తొలగించవచ్చు.

Latest Videos

click me!