ఇవే పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ ను తగ్గిస్తాయి..!

First Published | Nov 6, 2023, 4:40 PM IST

చాలా మంది ప్రెగ్నెంట్ అయ్యేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయినా గర్బం దాల్చలేకపోతుంటారు. దీనికి ప్రధాన కారణం మీ భాగస్వామిలో స్పెర్మ్ కౌంట్ లేకపోవడమే అంటున్నారు నిపుణులు. అయినా ప్రస్తుత కాలంలో చాలా మంది పురుషులు తక్కువ స్పెర్మ్ తో బాధపడుతున్నారు. ఈ కాలంలో ఈ సమస్య సర్వసాధారణంగా మారుతోంది. 
 

బిజీ లైఫ్ స్టైల్ ఎన్నో సమస్యలను తెచ్చిపెడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. దీనివల్ల శారీరక శ్రమకు దూరంగా ఉంటారు. ఇదొక్కటి చాలు ఎన్నో రోగాలను అంటించడానికి. తక్కువ శారీరక శ్రమ వల్ల నేడు ఎంతో మంది పురుషులు తక్కువ స్పెర్మ్ కౌంట్ సమస్యతో బాధపడుతున్నారు. స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండే సమస్యను వైద్య పరిభాషలో 'ఒలిగోస్పెర్మియా' అని కూడా అంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. వీర్య స్ఖలనం సమయంలో విడుదలయ్యే వీర్యంలో వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉండే పరిస్థితే ఒలిగోస్పెర్మియా. ప్రపంచ ఆరోగ్య సంస్థ తక్కువ స్పెర్మ్ కౌంట్ ను  మిల్లీలీటర్ వీర్యంలో 15 మిలియన్ల కంటే తక్కువ స్పెర్మ్ కలిగి ఉందని వర్గీకరించింది. మరి ఈ వీర్యకణాలు తక్కువగా ఉండటానికి గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
 

హార్మోన్ల అసమతుల్యత

పురుషుల్లో హార్మోన్ల అసమతుల్యత వల్ల టెస్టోస్టెరాన్ స్థాయుల్లో హెచ్చుతగ్గులు ఉంటాయి. ఇది వీర్యకణాల ఉత్పత్తిపై ప్రభావం చూపుతుంది. దీని మూలంగా స్పెర్మ్ కౌంట్ బాగా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. 
 

Latest Videos


ఇన్ఫెక్షన్ 

లైంగికంగా సంక్రమించే అంటువ్యాధులు కూడా స్పెర్మ్ కౌంట్ తగ్గడానికి దారితీస్తాయని నిపుణులు అంటున్నారు. ఎస్టిఐలు లేదా ఎపిడిడిమిటిస్ వంటి లైంగిక అంటువ్యాధులు స్పెర్మ్ ఉత్పత్తి, స్పెర్మ్ చలనశీలతను ప్రభావితం చేస్తాయి. ఈ సమస్యలున్నప్పుడు హాస్పటల్ కు తప్పకుండా వెళ్లాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 
 


గాయాలు 

ప్రైవేట్ భాగాల్లో అయిన గాయాలను లైట్ తీసుకోకూడదు. ఏ రకమైన వృషణాల గాయం లేదా శారీరక గాయం స్పెర్మ్ ఉత్పత్తిని బాగా తగ్గిస్తుందంటున్నారు నిపుణులు.

జీవనశైలి 

ఆల్కహాల్ ను విపరీతంగా తాగడం, స్మోకింగ్ అలవాటుండటం, మాదకద్రవ్యాల వాడకం,  ఊబకాయం వంటి  జీవనశైలి అలవాట్లు అస్సలు మంచివి కావు. ఇవి మీ ఆరోగ్యాన్ని దెబ్బతీయడమే కాకుండా మీ స్పెర్మ్ కౌంట్ ను బాగా తగ్గిస్తాయి. 

sperm

ఆహారం

పోషకాహార లోపం వల్ల కూడా స్పెర్మ్ కౌంట్ బాగా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. మీ రోజువారి ఆహారంలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, జింక్, సెలీనియం ఎక్కువగా ఉండేట్టు చూసుకోండి. ఎందుకంటే ఇవి మీ స్పెర్మ్ కౌంట్ ను పెంచడానికి సహాయపడతాయి. అలాగే పండ్లు, కూరగాయలు, గింజలు వంటి ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాలను తినండి. ఇవి మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. 
 

sperm

లక్షణాలు.. 

తక్కువ సెక్స్ డ్రైవ్

సెక్స్ పై కోరికలు లేకపోవడం, సెక్స్ డ్రైవ్ తక్కువగా ఉండటం కూడా తక్కువ స్పెర్మ్ కౌంట్ లక్షణమేనంటున్నారు నిపుణులు. అలాగే అంగస్తంభన సమస్యలు కూడా మీకు స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉన్న సమస్యను తెలియజేస్తుంది. 

మంట

వృషణంలో గడ్డలు లేదా వాపు  కూడా తక్కువ స్పెర్మ్ లక్షణమే. హార్మోన్ల అసమతుల్యత వల్ల శరీరంలో వెంట్రుకలు తగ్గడం కూడా దీని లక్షణమేనంటున్నారు నిపుణులు.
 

click me!