పెళ్లి తర్వాత హనీమూన్ కు వెళ్లాలనుకుంటున్నారా? అయితే ఈ తప్పులు అస్సలు చేయకండి

First Published Nov 5, 2023, 2:50 PM IST

ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి ఒక ముఖ్యమైన భాగం. ఈ స్పెషల్ సందర్భం కోసం మంది ఎన్నో ఏర్పాట్లు చేసుకుంటారు. ముఖ్యంగా పెళ్లైన జంటలు ఖచ్చితంగా హనిమూన్ కు ప్లాన్ చేసుకుంటారు. జంట ఏకాంతంగా గడపడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. కానీ హనిమూన్ విషయంలో కొన్నితప్పులను అస్సలు చేయకూడదు. దీనివల్ల ఆ స్పెషల్ మూమెంట్ పాడవుతుంది. అవేంటంటే? 

ప్రస్తుత కాలంలో చాలా మంది జంటలు పెళ్లి తర్వాత పక్కాగా హనిమూన్ కు వెళుతున్నారు. లవ్ మ్యారేజ్ వేరు.. కానీ అరేంజ్డ్ మ్యారేజ్ అయితే హనీమూన్ ఆనందం వేరే లెవెల్ లో ఉంటుంది. ఎందుకో తెలుసా? జంటగా వారిద్దరూ మొదటిసారి కొత్త ప్లేస్ కు వెళతారు. అయితే హనీమూన్ ప్లాన్ బానే ఉన్నా.. దీనికి సరైన ప్లానింగ్, బుకింగ్ లు చాలా అవసరం. ఎందుకంటే హనిమూన్ కు చాలా డబ్బు అవసరమవుతుంది. 
 

అయితే కొత్త జంట ఫస్ట్ టైం బయటకు వెళ్లి అక్కడ కొన్ని తప్పులు చేస్తే వెళ్లిన ఆనందం కూడా ఉండదు. మనసులో ఆ తప్పే మెదులుతూ ఉంటుంది. దీంతో ఆ అందమైన క్షణాలను ఆస్వాధించలేరు. ఇది మీ ప్రయాణాన్ని పాడు చేస్తుంది. కాబట్టి హనీమూన్ సమయంలో మీరు చేయకూడని తప్పుల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

ఇద్దరికి నచ్చేలా..

చాలా మంది పెళ్లికి ముందే హనీమూన్ ప్లానింగ్ చేసుకుంటారు. మీరు కూడా ఇలా చేస్తున్నట్టైతే ఎక్కడి వెళ్లాలో మీరొక్కరే డిసైజ్ చేయకుండా మీ భాగస్వామిని కూడా అడగండి. ఇద్దరికీ నచ్చిన ప్లేస్ కు వెళితేనే మీరిద్దరూ ఆనందంగా గడుపుతారు. ఒక్కరి నిర్ణయమే అయితే మీ భాగస్వామి సంతోషంగాఉండకపోవచ్చు. ఎక్కడికి వెళ్లాలి, ఏం తినాలి? షాపింగ్ వంటి విషయాలను ఇద్దరూ కలిసి నిర్ణయం తీసుకోండి. 
 

సోషల్ మీడియాలో టైమ్ వేస్ట్ చేయొద్దు

ప్రస్తుత కాలంలో చాలా మంది ఎక్కడికైనా వెళ్లే ముందు.. నేను ఇక్కడికి వెళుతున్నా.. ఇలా ఎంజాయ్ చేస్తున్నా అని అన్ని అప్డేట్స్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. ఇది మంచి అలవాటు కాదు. ఒకవేళ మీరు పెళ్లి తర్వాత హనిమూన్ కు వెళ్లినప్పుడు వారితో సమయాన్ని గడపకుండా ఫోటోలు, వీడియోలను తీసి సోషల్ మీడియాలో  పోస్ట్ చేసే పని పెట్టుకోకండి. ఇది మీ వృథా చేస్తుంది. అందుకే మీ భాగస్వామితో ఆ క్షణాలను ఆస్వాధించడానికి ప్రయత్నించండి.
 

సరైన గమ్యం

అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్న జంటలు పబ్లిక్ గా ఎక్కువగా మాట్లాడుకోరు. లేదా వారి మనసులో ఉన్న మాటలను అస్సలు చెప్పరు. అందుకే మీ భాగస్వామికి ఏదైనా మాట్లాడటం అసౌకర్యంగా అనిపించొచ్చు. అలాగే ప్రయాణాన్ని ఆస్వాదించలేకపోవచ్చు. కాబట్టి మీరిద్దరూ ఒకరినొకరు జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. తమ తమ అవసరాలను తెలుసుకుంటూ ఉండాలి.
 

హోటల్ లో ఎక్కువ గడపొద్దు

హనీమూన్ ప్యాకేజ్ తీసుకుంటే లగ్జరీ రిసార్టులు, హోటల్ గదుల్లో ఫుల్ టైమ్ గడిపే తప్పు మీరు అస్సలు చేయకండి. హనీమూన్ సమయం చాలా అంటే చాలా ప్రత్యేకమైంది. కాబట్టి  మీరు వెళ్లిన ప్రదేశాన్నంతా చుట్టి రండి. 
 

click me!