అప్పుడే గర్భం వద్దని మహిళలు చేసే పని ఏంటంటే...

First Published | Dec 20, 2019, 2:24 PM IST

ఆధునిక పద్ధతులను అనుసరిస్తూ అవాంఛిత గర్భాన్ని రాకుండా అడ్డుకోవడంలో భారత మహిళలు ఈ సర్వే జరిపిన 69 దేశాల మహిళల కంటే 33% మెరుగ్గా ఉన్నారని తేలింది. 

అప్పుడే గర్భం అవసరం లేదు... పిల్లలకు తొందరేముంది అనుకునేవాళ్లు... ఏదైనా పొరపాటు వల్ల గర్భం వస్తుందేమో అని భయపడేవాళ్లు గర్భనిరోదక మాత్రలు వాడుతుంటారు. ఈ మధ్యకాలంలో... వీటి వాడకం బాగా పెరిగిపోయింది. మన దేశంలో దాదాపు 13.7కోట్ల మంది వీటిని వినియోగిస్తున్నారంటే వాడకం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఒకప్పుడు వీటి కొనుగోలు పెద్దగా ఉండేది కాదు. అవాంఛిత గర్భాలు వస్తూనే ఉండేవి. రాను రాను... ప్రజల్లో అవగాహన పెరుగుతండటంతో.. వీటిపై ఆసక్తి చూపిస్తున్నారు. ఓ సర్వేలో తేలిన విషయం ఏమిటంటే.. ఆధునిక పద్ధతులను అనుసరిస్తూ అవాంఛిత గర్భాన్ని రాకుండా అడ్డుకోవడంలో భారత మహిళలు ఈ సర్వే జరిపిన 69 దేశాల మహిళల కంటే 33% మెరుగ్గా ఉన్నారని తేలింది.

అంటే దాదాపు 13.7 కోట్ల మంది మహిళలు మార్నింగ్‌ ఆఫ్టర్‌ పిల్‌, కండోమ్స్‌, ఐయూడీ(మహిళలకు సంబంధించిన గర్భనిరోధక వస్తువు), ఫ్యామిలీ ప్లానింగ్‌ వంటి పద్ధతుల్లో అవాంఛిత గర్భాన్ని అడ్డుకోవడంతో పాటు ప్రమాదకర అబార్షన్లను తప్పించుకుంటున్నారు. ఫలితంగా గర్భస్త మరణాలను కూడా అదుపు చేస్తున్నారు.
ఫ్యామిలీ ప్లానింగ్‌ కోసం నిధులను కేటాయించడంలో ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌, బంగ్లాదేశ్‌, ఇండోనేషియా మొదటి వరుసలో ఉన్నాయి. 2017-18 ఏడాదికి గాను ఫ్యామిలీ ప్లానింగ్‌ కోసం భారతదేశం కేటాయించిన నిధులు దాదాపు 311 మిలియన్‌ డాలర్లని సర్వే చెబుతోంది.
దీంతో గర్భనిరోధక పద్ధతులను వినియోగించుకోని మహిళల శాతం ప్రతి ఏడాదికీ తగ్గుతూ వస్తోందని సర్వే తేల్చింది.
2012లో ఈ మహిళలు 20.3% ఉంటే.. 2019లో 18.9 శాతానికి చేరినట్లు సర్వే ద్వారా తెలుస్తోంది.
మొత్తంగా మహిళలు ఈ గర్భనిరోధక పద్ధతులను వినియోగించుకుంటుండడం వల్ల ఈ ఏడాది ముగిసేలోపు మన దేశం 5.3 కోట్ల అవాంఛిత గర్భధారణలను, 18 లక్షల ప్రమాదకర అబార్షన్లను, 22,000 వేల పురిటి చావులను తప్పించనున్నట్లు సర్వే చెబుతోంది.
ఎప్పుడైనా తప్పనిసరి సమయంలో... వీటిని వాడటం వల్ల ఎలాంటి నష్టం ఉండదు. కానీ.. కొందరు వీటిని అవసరానికి మించి వాడేస్తున్నారు. దాని వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
మరీ ఎక్కువగా వీటిని వినియోగిస్తే... భవిష్యత్తులో అసలు పిల్లలు పుట్టే అవకాశం లేకుండాపోయే ప్రమాదం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు.అంతేకాకుండా గుండె సంబంధిత వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది.
ఈ మాత్రల్లో ఉండే రసాయనాల వల్ల నరాల్లో కొవ్వు పెరిగి రక్త సరఫరా తగ్గుతుందని, తద్వారా రక్త ప్రసరణ ఆగిపోయి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందన్నారు. బీపీ సమస్యలు ఉత్పన్నమవుతాయని చెప్పారు. శరీరంలో మంచి కొవ్వు తగ్గి చెడు కొవ్వు పెరుగుతుందన్నారు. రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉందని చెప్పారు. గర్భనిరోధక మాత్రలు వాడాలనుకొనే మహిళలు ఎట్టి పరిస్థితుల్లోనూ వైద్యులను సంప్రదించాలని, సూచిస్తున్నారు.

Latest Videos

click me!