పెళ్లికి ముందు శృంగారం.. కఠిన శిక్షతప్పదు

First Published | Nov 5, 2019, 2:29 PM IST

వివాదాస్ప‌దంగా మారిన ఈ బిల్లు ప్ర‌స్తుతం వాయిదా ప‌డ్డా.. ఆందోళ‌న‌కారులు మాత్రం దానిపై నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నారు. పెళ్లికి ముందు సెక్స్‌లో పాల్గొంటే.. వారికి ఏడాది కాలం పాటు జైలు శిక్ష విధించ‌నున్న‌ట్లు కొత్త చ‌ట్టం చెబుతోంది. ఒక‌వేళ వివాహేత‌ర సంబంధం పెట్టుకున్నా.. వారికి ఆర్నెళ్ల జైలు శిక్ష ఉంటుంది. 
 
పెళ్లికి ముందు శృంగారం అనేది విదేశాల్లో చాలా కామన్. మన దేశ సంస్కృతీ సంప్రదాయాలకు మాత్రం ఇది విరుద్ధం. ఈ మధ్యాకాలంలో పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడిన యువత దీనిని మన దేశంలో కూడా పాటిస్తున్నారు.
ఇక వివాహేతర సంబంధాలు కూడా విదేశాల్లో కామన్ గానే ఉంటాయి. అయితే...వీటికి ఇండోనేషియా ప్రభుత్వం చెక్ పెట్టాలని భావిస్తోంది. ఈ మేరకు కొత్త చట్టాన్ని తీసుకురావాలని భావించింది. అయితే... ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి ఆ దేశంలో తీవ్ర వ్యతిరేకత మొదలైంది.

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఇండోనేషియా దేశస్తులు భగ్గుమన్నారు.  దీన్ని నిర‌సిస్తూ ఆ దేశ ప్ర‌జ‌లు పార్ల‌మెంట్‌ను చుట్టుముట్టారు. ఆందోళ‌న‌కారుల‌ను చెద‌ర‌గొట్టేందుకు పోలీసులు టియ‌ర్ గ్యాస్ ప్ర‌యోగించారు.
ఇండోనేషియా రాజ‌ధాని జ‌క‌ర్తాతో పాటు ఇత‌ర న‌గ‌రాల్లోనూ ప్ర‌ద‌ర్శ‌న‌లు మిన్నంటాయి. ఈ బిల్లును ఆమోదిస్తే, దేశంలో అబార్ష‌న్లు త‌గ్గుతాయ‌ని ప్ర‌భుత్వం వాదిస్తున్న‌ది.
వివాదాస్ప‌దంగా మారిన ఈ బిల్లు ప్ర‌స్తుతం వాయిదా ప‌డ్డా.. ఆందోళ‌న‌కారులు మాత్రం దానిపై నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నారు. పెళ్లికి ముందు సెక్స్‌లో పాల్గొంటే.. వారికి ఏడాది కాలం పాటు జైలు శిక్ష విధించ‌నున్న‌ట్లు కొత్త చ‌ట్టం చెబుతోంది. ఒక‌వేళ వివాహేత‌ర సంబంధం పెట్టుకున్నా.. వారికి ఆర్నెళ్ల జైలు శిక్ష ఉంటుంది.
దేశాధ్య‌క్షుడిని, ఉపాధ్య‌క్షుడిని, మ‌తాన్ని, ప్ర‌భుత్వ సంస్థ‌ల‌ను, జాతీయ గీతాన్ని అవమానించినా.. వారికి భారీ శిక్ష‌ను అమ‌లు చేయ‌నున్నారు. అబార్ష‌న్ చేసుకున్న మ‌హిళ‌ల‌కు నాలుగేళ్ల శిక్ష‌ను విధించ‌నున్నారు. వాస్త‌వానికి ఈ బిల్లుపై మంగ‌ళ‌వారం ఓటింగ్ జ‌ర‌గాల్సి ఉంది, కానీ దాన్ని వాయిదా వేశారు.

Latest Videos

click me!