కోపంలో ఉన్నప్పుడు మీ పార్ట్ నర్ తో ఈ విషయాలు మాట్లాడకండి..!

First Published May 30, 2022, 3:50 PM IST

మీ పార్ట్ నర్ కోపంలో ఉన్నప్పుడు మీరు కొన్ని మాటలు అనకుండా.. దూరంగా ఉండటమే మంచిదని  నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ మీకు కోపం వచ్చినా కూడా  కొన్ని పదాలను వాడకూడదు.

couple fight

కోపం.. మనిషిలోని ఆలోచనా శక్తిని చంపేస్తుంది. కోపంలో ఉన్నప్పుడు.. మనం తీసుకునే నిర్ణయాలు అనాలోచితంగా ఉంటాయి. అంతేకాదు... ఏది పడితే అది మాట అనేస్తూ ఉంటారు. వారు కోపంగా ఉన్న సమయంలో మీరు మీ పార్ట్ నర్ ని రెచ్చగొట్టడం, లేదంటే ఇంకేమైనా మాటలు అనడం లాంటివి చేస్తే.. వారి కోపం మరింత ఎక్కువ అవుతుంది. అందుకే మీ పార్ట్ నర్ కోపంలో ఉన్నప్పుడు మీరు కొన్ని మాటలు అనకుండా.. దూరంగా ఉండటమే మంచిదని  నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ మీకు కోపం వచ్చినా కూడా  కొన్ని పదాలను వాడకూడదు. మరి  అవేంటో ఓసారి  చూసేద్దామా...

దంపతుల మధ్య కోపం రావడం. దాని వల్ల వారి మధ్య గొడవలు జరగడం చాలా సహజం. ఆ కోపంలో మాటలు జారి... ఆ తర్వాత... ఎందుకు మాట్లాడామా అని పశ్చాత్తాప పడుతూ ఉంటారు. అయితే... కోపంలో.. ‘ నువ్వు ఎప్పుడూ ఇంతే ఇలానే చేస్తావు’ లేదంటే.. ‘ నువ్వు ఎప్పుడూ  ఏదీ చేయవు’  లాంటి మాటలు అస్సలు వాడకూడదట. ఈ మాటలు మీ పార్ట్ నర్ కి గట్టిగా తగులుతాయి. అవి మీ బంధానికి  సమస్యలు తెచ్చే అవకాశం ఉంది.

వీటితో పాటు...మీ భాగస్వామి లేదా వారి అభిప్రాయం పట్ల మీకు ఆసక్తి లేదని భావించేలా చేసే భాషను ఉపయోగించవద్దు. మీరు పట్టించుకోని వైఖరిని అరిచే పదబంధాలు అవతలి వ్యక్తికి వినబడని అనుభూతిని కలిగిస్తాయి. మీరు అంగీకరించకపోయినా ఫర్వాలేదు కానీ మీరు వాటిని వినడం చాలా ముఖ్యం. ‘ అయితే ఏంటి..?’ ‘ నిన్ను ఎవరు పట్టించుకుంటారు’ లాంటి పదాలను వాడకూడదట.
 


కోపంలో దాదాపు అందరూ.. ఎదుటివారిని ఎలా బాధ పెట్టాలా అని చూస్తూ ఉంటారు. దాని కోసం ఏమి చేయడానికైనా వెనకాడరు. మీరు ఆ స్థాయికి దిగజారితే వారి నమ్మకాన్ని శాశ్వతంగా కోల్పోతారు. ఇద్దరూ ప్రశాంతంగా ఉన్నప్పుడు మౌనంగా ఉండి సమస్య గురించి మాట్లాడుకోవడం ఉత్తమం.
 

దంపతుల మధ్య గొడవలు  జరగడం సర్వ సాధారణం. ఆ కోపం కారణంగా గొడవలు జరిగినప్పుడు గతాన్ని తవ్వడం మంచిది కాదు. గతాన్ని తవ్వడం వల్ల.. మరింత సమస్యలు రావడం ఖాయం. అది మీ భాగస్వామిని మరింత బాధ పెట్టే అవకాశం ఉంది.

ప్రేమగా ఉన్నప్పుడు.. ముద్దుగా పిలుచుకునే వారు.. కోపం రాగానే పేర్లతో పిలుచుకుంటారు. అలా చేయడం మరింత హర్టింగ్ గా ఉంటుంది. గొడవ మరింత ముదిరిపోవడానికి కారణమౌతుంది.

click me!