లైంగిక ఆరోగ్యం విషయంలో అందరికీ ఉండే అపోహలు ఇవే...!

First Published | Jan 4, 2023, 1:04 PM IST

సంతానం కలగకపోవడానికి స్త్రీలలో ఎంత సమస్య ఉందో... పురుషుల్లోనూ  అంతే సమస్య ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. పురుషుల్లో స్పెర్మ్ సమస్యల కారణంగా కూడా సంతానం కలగదు.

Sex Problem

శృంగారం గురించి చాలా మందికి అపోహలు ఉంటాయి అనే విషయం మనకు తెలిసిందే. కేవలం సెక్స్ మాత్రమే... లైంగిక ఆరోగ్యం విషయంలోనూ చాలా మందికి చాలా అపోహలు ఉంటాయి. వాటిలో చాలా కామన్ గా ఉండే అపోహలు ఏంటో ఓసారి చూద్దాం....

1.ఫెర్టిలిటీ..
పెళ్లి తర్వాత సంతానం కలగకపోతే... అందరూ ఆ తప్పు... మహిళలపైనే వేస్తారు. మహిళలోనే లోపం ఉందని... అందుకే సంతానం కలగలేదని చాలా మంది భావిస్తూ ఉంటారు. అయితే... అది పూర్తిగా అపోహ అని నిపుణులు చెబుతున్నారు. సంతానం కలగకపోవడానికి స్త్రీలలో ఎంత సమస్య ఉందో... పురుషుల్లోనూ  అంతే సమస్య ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. పురుషుల్లో స్పెర్మ్ సమస్యల కారణంగా కూడా సంతానం కలగదు.

Latest Videos


2.లైంగిక ఆరోగ్యంపై ఉన్న అతి పెద్ద అపోహల్లో ఇది ఒకటి. సంభోగం గురించి ప్రజలకు ఉన్న అవగాహన సరిగా లేదు. ఉపసంహరణ పద్ధతి గురించి కూడా అవగాహన ఉండదు. దీనిలో స్కలనానికి ముందు పురుషాంగం యోని నుండి బయటకు తీస్తారు. అవాంఛిత గర్భాన్ని నిరోధించడానికి ఈ చర్య ఒక ఖచ్చితమైన మార్గంగా పరిగణించబడుతున్నప్పటికీ, వాస్తవం ఈ నమ్మకానికి చాలా భిన్నంగా ఉంటుంది.

3. రెండు కండోమ్‌లు ధరించడం వల్ల రక్షణ పెరుగుతుంది..

ఇది ఒక అపోహ. రెండు కండోమ్స్ ధరిస్తే రక్షణ పెరుగుతుంది అనుకోవడం పొరపాటు. రక్షణ కోసం కేవలం ఒకటి ధరిస్తే సరిపోతుంది.  రెండు ధరిస్తే.. ఘర్షణ పెరిగి.. ఇబ్బంది పెడతుంది. 

4. మాత్రలు తీసుకోవడం వలన STI ల నుండి మిమ్మల్ని రక్షించవచ్చు
గర్భనిరోధక మాత్రలు... మిమ్మల్ని లైంగికంగా సంక్రమించే అంటువ్యాధుల (STIs) నుండి రక్షించగలదనేదానిలో నిజం లేదు.  కేవలం గర్భం రాకుండా మాత్రమే నిరోధించగలదు. అంతేకానీ...  లైంగిక వ్యాధులను కంట్రోల్ చేయలేదు.

5. స్వలింగ సంపర్కులకు మాత్రమే హెచ్ఐవీ వస్తుందా..?

చాలా మంది కేవలం స్వలింగ సంపర్కులకు మాత్రమే  హెచ్ఐవీ వస్తుందని భావిస్తారు. అందులో ఎలాంటి నిజం లేదు. ఇది ఎవరికైనా సోకే అవకాశం ఉంది. జాతి,వయసుతో సంబంధం  లేకుండా అందరికీ సోకే అవకాశం ఉంది.

6. సంభోగం తర్వాత మూత్ర విసర్జన అవసరం లేదు

లైంగిక సంపర్కం తర్వాత మూత్రవిసర్జన చేయడం చాలా మంచిది. లైంగిక చర్య తర్వాత మూత్రాశయాన్ని ఖాళీ చేయాలని వైద్యపరంగా సిఫార్సు చేశారు.
దీని వెనుక కారణం సెక్స్ తర్వాత మీ మూత్రాన్ని శుభ్రపరచడం సెక్స్ సమయంలో ప్రవేశించిన వ్యాధికారకాలను తొలగించడంలో సహాయపడుతుంది.

 

7.స్పెర్మ్ విడుదలైన తర్వాత కొన్ని సెకన్ల పాటు మాత్రమే జీవించగలదు

నిజానికి స్పెర్మ్‌లు శరీరంలో 5-6 రోజుల వరకు జీవించగలవు. మీరు స్వయంగా కడిగిన తర్వాత కూడా స్పెర్మ్‌లు శరీరం లోపల జీవించగలవు.
 

8.ఎక్కువు మందితో సంభోగంలో పాల్గొన్న వారికే లైంగిక వ్యాధులు వస్తాయి..

STI( లైంగిక వ్యాధులు) ప్రమాదం సంభోగం సమయంలో మీరు , మీ భాగస్వామి అనుభవిస్తున్న పరిశుభ్రతపై ఆధారపడి ఉంటుంది. మీరు కలిగి ఉన్న లైంగిక భాగస్వాముల సంఖ్యతో దీనికి ఎటువంటి సంబంధం లేదు.
 

click me!