ఈ ప్రపంచంలో సెక్స్ గురించి ఎన్ని అపోహలు ఉన్నాయో.. హస్త ప్రయోగం గురించి కూడా అంతే అపోహలు ఉన్నాయి. చాలా మంది హస్త ప్రయోగం చేయడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తుంటాయి అని భయపడుతూ ఉంటారు.. ఇతరులను కూడా భయపెడుతూ ఉంటారు. అయితే.. అది ఎంత మాత్రం నిజం కాదట. హస్త ప్రయోగం చేయమని వైద్యులు కూడా సిఫార్సు చేస్తుంటారు.
లైంగిక నిరాశకు చికిత్స చేయడంలో ఇది గొప్పగా పనిచేస్తుంది. అంతేకాదు.. చాలా రకాల ఒత్తిడిని తగ్గిండంలోనూ సహాయపడుతుంది. అంతేకాదు.. చాలా మంది మహిళలు తమ శరీరంపై మరింత నమ్మకంగా ఉండటానికి కూడా ఇది సహాయపడుతుంది. కాగా.. అసలు ఈ హస్త ప్రయోగం విషయంలో ఎక్కువగా అందరూ వినే అపోహలు ఏంటో ఓసారి చూద్దాం..
1.రిలేషన్ లో ఉన్నవారు హస్త ప్రయోగం చేయకూడదు..
రిలేషన్ లో ఉన్న వారు హస్త ప్రయోగం చేయడం పెద్ద నేరమని చాలా మంది చెబుతుంటారు. అయితే.. అందులో ఏ మాత్రం నిజం లేదని నిపుణులు చెబుతున్నారు. హస్త ప్రయోగం చాలా సర్వ సాధారణం. మీ మానసిక ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. మీరు హస్త ప్రయోగంలో పాల్గొంటే.. మీరు మీ పార్ట్ నర్ ని మోసం చేసినట్లు కాదు. మిమ్మల్ని మీరు సంతృప్తి పరుచుకోవడానికి ఇలా చేయడంలో ఎలాంటి తప్పు లేదు. ఎలాంటి సంకోచం లేకుండా హస్త ప్రయోగంలో పాల్గొనవచ్చు.
2.హస్త ప్రయోగం ఎక్కువగా చేయడం వల్ల నపుంశకులు అవుతారు..
ఎక్కువగా హస్త ప్రయోగంలో పాల్గొనే వారు భవిష్యత్తులో నపుంశకులుగా మారుతారని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అయితే.. అందులో ఏ మాత్రం నిజం లేదని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల పురుషుల వీర్య కణాల సంఖ్య తగ్గడం లాంటివి అస్సలు జరగవని నిపుణులు చెబుతున్నారు.. మీరు తెలుసుకోవలసినది ఏమిటంటే, స్పెర్మ్‌లలో ఎక్కువ భాగం 12-24 గంటల్లో పునరుత్పత్తి చెందుతాయి. కాబట్టి ఈ విషయంలో ఎలాంటి భయం అక్కర్లేదు. 2016లో ఒక అధ్యయనం ప్రకారం, నెలకు 21 సార్లు స్కలనం చేసే పురుషులకు ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
3.హస్త ప్రయోగం చేసేవారి అంధులుగా మారతారు.
దీనిలో ఒక్క మాట కూడా నిజం లేదు. నిజంగా ఇదే జరిగితే ప్రపంచమంతా దాదాపు అంధత్వమే. దీనిలో ఏ మాత్రం నిజం లేదు. హస్త ప్రయోగం వల్ల అంధులుగా మారడం అనేది పచ్చి అబద్దం. ఇది కేవలం కొందరు క్రియేట్ చేసిన అపోహ మాత్రమే.
4.గర్భిణీగా ఉన్నప్పుడు హస్తప్రయోగం చేయడం తప్పు
ఒక నిర్దిష్ట దశలో సెక్స్ అనేది స్థానం ఆధారంగా హానికరం కావచ్చు కానీ హస్తప్రయోగం కాదు. బహిరంగంగా చేస్తే తప్ప అది తప్పు కాదు. గర్భిణీలు కూడా ఎలాంటి సందేహాలు లేకుండా హస్త ప్రయోగంలో పాల్గొనవచ్చు. కావాలంటే వైద్యుల సలహా తీసుకోవచ్చు.