married life
ఇద్దరు వేర్వేరు వ్యక్తులను ఒక్కటి చేసే శక్తి పెళ్లికి ఉంది. కేవలం ఇద్దరు వ్యక్తులను మాత్రమే కాదు.. రెండు కుటుంబాలను దగ్గర చేస్తుంది. ప్రేమ పెళ్లిళ్లు అంటే వేరు కానీ.. పెద్దలు కుదర్చిన పెళ్లిలో మాత్రం.. వధూవరులకు ఒకరి గురించి మరొకరు తెలుసుకోవడానికి చాలా సమయమే పడుతుంది. ఈ క్రమంలో.. చాలా మంది తెలిసీ తెలియక కొన్ని తప్పులు చేస్తూ ఉంటారట. కామన్.. ప్రతి ఒక్క దంపతులు పెళ్లైన కొత్తలో చేసే తప్పులు కొన్ని ఉన్నాయి. అవేంటో ఓసారి చూద్దాం..
married life
1.పెళ్లైన వెంటనే చాలా మంది దంపతులు తమ చుట్టూ సరిహద్దు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారట. అప్పటి వరకు ఉన్న పాత స్నేహితులతో మాట్లాడటం వదిలేయడం లాంటివి చేస్తుంటారు. ఇలానే ఉండాలి.. అలానే ఉండాలి.. వారితోనే మాట్లాడాలి.. వీరితోనే మాట్లాడాలి అంటూ తమకు తాము బౌండరీస్ క్రియేట్ చేసుకుంటారు. అయితే.. దీని వల్ల కొందరికి మంచి జరిగినా.. కొందరు తమ శ్రేయోభిలాషులకు దూరమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొందరైతే తమ నిర్ణయాలను కూడా తాము తీసుకోలేరు.
married life
2. ఇక రెండోది.. పెళ్లికి ముందు ఎలా ఉన్నా.. పెళ్లి తర్వాత మాత్రం తమ భాగస్వామి ఎలాంటి తప్పులు చేయకూడదు అన్నట్లుగా ప్రవర్తిస్తారు. మీరు పొరపాట్లు చేయవచ్చు కానీ.. మీ పార్ట్ నర్ మాత్రం చేయకూడదు అని భావిస్తూ ఉంటారు. అయితే.. అలా చేయకూడదట. దాని వల్ల ఇద్దరి మధ్య సమస్యలు వస్తాయి. ఇప్పుడే కదా మీరు బంధంలోకి అడుగుపెట్టింది.. తెలిసీ తెలియక కొన్ని పొరపాట్లు జరిగే అవకాశం ఉంది. కాబట్టి.. వారు నేర్చుకునేవరకు వదిలేయాలి. ఇద్దరూ ఒకరినొకరు అర్థంచేసుకునే ప్రయత్నం చేయాలి.
3.చాలా మంది పెళ్లైన కొత్తలో తమ కుటుంబం, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరినీ దూరం పెడతారు. మీ ఇద్దరికీ ప్రైవసీ కావాలి కాబట్టి.. కాస్త దూరం పెట్టడం మంచిదే. అయితే.. మరీ దూరం పెట్టడం మాత్రం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. మరీ వారిని మర్చిపోయేంత దూరం పెట్టడం మాత్రం అస్సలు మంచిది కాదు. మీరు స్నేహితులతో సరదాగా గడిపే రోజులు, అమ్మాయిలు డే అవుట్ లేదా అబ్బాయిలు డే ఔట్, గేమింగ్ డే, లేదా కార్డ్ నైట్ లేదా సినిమా కోసం స్నేహితులను పిలవడం లాంటివి చేయాలి. మీ జీవిత భాగస్వామిని కూడా అలా చేయమని ప్రోత్సహించండి. దీని వల్ల మీకు కాస్త హాయిగా ఉంటుంది. ఇద్దరికీ మధ్య వచ్చే కొన్ని చికాకులు, ఆపీస్ టెన్షన్స్ తగ్గే అవకాశం ఉంటుంది.
4.పెళ్లి తర్వాత చాలా మంది చాలా వస్తువులను కామన్ గా ఉపయోగించడం మొదలుపెడతారు. అంటే బ్రష్, సోప్ లాంటివి. దీని వల్ల మొదట్లో ఏం కాకపోయినా.. ఎవరైనా పొరపాటు చేస్తే.. గొడవలు జరిగే అవకాశం ఉంది. పేస్ట్ ట్యూబ్ మూత పెట్టడం మర్చిపోవడం, సోప్ వాటర్ లో పడేయడం లాంటివి. నువ్వు ఎక్కువగా వాడుతున్నావ్.. నేను తక్కువ వాడుతున్నా లాంటి గొడవలు కూడా జరుగుతాయట. ఇవి దంపతుల మధ్య గొడవలకు కారణమయ్యే అవకాశం చాలా ఎక్కు.వ. దీనికి బదులు.. ఇలాంటి వస్తువులు.. సోప్, బ్రష్, సీరమ్ లాంటివి ఎవరివి వారు ఉపయోగించడమే ఉత్తమమట.
5. పెళ్లికి ముందు మన ఇల్లు మనకు నచ్చినట్లు గా ఉంచుకుంటాం. కానీ పెళ్లి తర్వాత.. మన జీవితంలోకి వచ్చిన వ్యక్తికి కూడా కొన్ని అభిరుచులు ఉంటాయి అనే విషయాన్ని గుర్తించాలి. వారితో మాట్లాడాలి.. ఇద్దరూ కలిసి తమకు నచ్చినట్లుగా.. ఇంటిని మార్చుకోవచ్చు. ఇంట్లో కర్టెన్స్, కుషన్ కవర్స్ లాంటివి ఇద్దరూ కలిసి ఇద్దరికీ నచ్చినట్లుగా మార్చుకోవాలి. చాలా మంది అలా చేయరట. దాని వల్ల.. ఆ ఇంటికి కొత్తగా వచ్చిన పెళ్లికూతురికి చాలా అసౌకర్యంగా ఉండే అవాకశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి.. ఇద్దరూ కలిసి ఇంట్లోని ఇంటీరియర్ లో స్వల్ప మార్పులు చేసుకోవడం లో ఎలాంటి తప్పులేదట.