ఫర్ట్ చేసే క్రమంలో అబ్బాయిలు చేసే పొరపాట్లు ఇవే..!

First Published | Jan 29, 2022, 2:47 PM IST

అలా కాకుండా మీ టీజింగ్ వారికి నచ్చకపోయినా.. మీ ఫ్లర్టింగ్ వారిని ఇబ్బంది పెట్టినా.. మీకు మార్కులు పడవు. సరదాగా ఆ అమ్మాయి మిమ్మల్ని ఆటపట్టిస్తే.. మీరు కూడా అంతే ఆటపట్టించడండి. కానీ గట్టిగా అరవడం లాంటివి కూడా చేయకూడదు.

ఫ్లర్ట్ చేయడంలో అబ్బాయిలు మాష్టర్స్.. ఈ విషయంలో ఎలాంటి అనుమానం లేదు. అయితే.. ఈ ఫ్లర్టింగ్ కూడా అందరికీ రాదట. చాలా కొద్ది మందికి మాత్రమే..  దీనిలో టాలెంట్ ఉంటుందట.  ఈ ఫ్లర్టింగ్ లో పెద్దగా ప్రావీణ్యం లేని వారు మాత్రం.. పొరపాట్లు చేసి అడ్డంగా బుక్కైపోతుంటారు. కామన్ గా ఫ్లర్ట్ చేసే టప్పుడు అబ్బాయిలు చేసే పొరపాట్లు ఏంటో ఓసారి చూసేద్దామా..
 

చాలా మంది అబ్బాయిలు తాము ప్రేమించిన అమ్మాయిని టీజ్ చేయడాన్ని ఇష్టపడతారు.  అదే పనిగా.. వారిని రోస్ట్ చేస్తూ ఉంటారు. అయితే.. మీరు చేస్తుున్న దానిని ఆ అమ్మాయి ఎంజాయ్ చేసినప్పుడే.. వారు మీ ప్రేమలో పడతారు. అలా కాకుండా మీ టీజింగ్ వారికి నచ్చకపోయినా.. మీ ఫ్లర్టింగ్ వారిని ఇబ్బంది పెట్టినా.. మీకు మార్కులు పడవు. సరదాగా ఆ అమ్మాయి మిమ్మల్ని ఆటపట్టిస్తే.. మీరు కూడా అంతే ఆటపట్టించడండి. కానీ గట్టిగా అరవడం లాంటివి కూడా చేయకూడదు. అలా చేస్తే.. వారి అహం పూర్తిగా దెబ్బతింటుంది.


ఇక కొందరు అబ్బాయిలు.. తాము ఫ్లర్ట్ చేస్తే ఎలాంటి అమ్మాయి అయినా కచ్చితంగా పడిపోతుందనే ధీమాలో ఉంటారు. ఒకటి అది లవ్ అయినా అయ్యిండొచ్చు. మరొటి సెక్స్ కోసమైనా అయ్యి ఉండొచ్చు. అయితే.. మీ ఫ్లర్టింగ్ చేసేటప్పుడు.. తర్వాత జరిగే లాభాల గురించి ఆలోచించకూడదు. ఆ ఫ్లర్టింగ్ వల్గర్ కూడా ఉండకూడదు. సరదాగా మాత్రమే ఉండాలి. వారు మీకు పడినా.. పడకున్నా.. మీరు గుర్తొస్తే.. వారిని ఆనందం కలిగేలా.. ఫ్లర్ట్ చేయగలగాలి.

అలా కాకుంటే.. మీకు ఎవరో అనుకోకుండా ఓ అమ్మాయి పరిచయం అయ్యిందనుకోండి.. మీరు సరదాగా మాట్లాడుకున్నారు అనుకోండి. ఆ తర్వాత ఆ సంభాషణను వెంటనే క్లోజ్ చేయవద్దు. మీరు మాట్లాడిన మాటలు వారికి నచ్చితే.. ఆ విషయం మీకు అర్థమౌతుంది. కాబట్టి.. వారి ఫోన్ నెంబర్ అడిగి తీసుకోవడంలో ఎలాంటి తప్పులేదు. అమ్మాయి మొహమాటంతో అడగకపోయి ఉండొచ్చు. కాబట్టి.. మీకు ఆ అమ్మాయి నచ్చితే.. ఫోన్ నెంబర్ అడిగి తీసుకోండి. అయితే.. నెంబర్ ఇచ్చిన తర్వాత వారికి నచ్చకపోతే మాత్రం ఇబ్బంది పెట్టకూడదు అనే విషయాన్ని గుర్తుంచుకోండి.

ఇక మీ అదృష్టం బాగుండి ఫోన్ నెంబర్ ఇస్తే.. వెంటనే మెసేజ్ మాత్రం చేయకూడదు. అలా అని రోజుల తరపడి ఎదురుచూసేలా చేయడం కూడా తప్పే. కాబట్టి.. ఒక రోజు ఆగిన తర్వాత.. మెసేజ్ చేయాలి. అప్పుడు.. వారికి కూడా మీతో మాట్లాడే ఇంట్రస్ట్ కలుగుతుంది.

flirting

ఇక మీరు ఎవరితో అయినా ఫ్లర్ట్ చేస్తున్నట్లయితే.. ఆ అమ్మాయి ఫీలింగ్స్ పై కూడా మీరు కన్నేయాలి. మీరు ఏం చెబితే వారికి నవ్వు వస్తోంది..? ఏం చెబితే కోపం వస్తుంది అనే విషయాన్ని వారి ముఖ కవలికలను బట్టి గమనించాలి. ఆమె బాడీ లాంగ్వేజ్ ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. 

Latest Videos

click me!