పిల్లలు పుట్టడానికి పురుషులకి ఆ పరీక్ష అవసరమా?

First Published | Dec 14, 2021, 4:16 PM IST

పిల్లలు పుట్టకపోవడానికి భార్యాభర్తలిద్దరి బాధ్యత (Responsibility) ఉంది. చాలామంది పిల్లలు పుట్టకపోవడానికి మహిళలలో లోపంగా (Error) భావిస్తారు. మహిళలకు అన్ని టెస్టులు చేయించినా పిల్లలు పుట్టరు. కానీ పిల్లలు పుట్టకపోవడానికి పురుషులలోని లోపాలు కూడా కారణమని వైద్యులు తెలుపుతున్నారు. పురుషులు ఈ పరీక్ష తప్పనిసరిగా చేయించుకోవాలని దానికి తగిన చికిత్స తీసుకుంటే పిల్లలు పుట్టే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఆ పరీక్ష ఏమిటో ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.

వివాహం తర్వాత మహిళలు మాతృత్వం (Motherhood) పొందడం అనేది ఒక గొప్ప వరంగా భావిస్తారు. కానీ ఎన్ని సంవత్సరాలు గడిచినా వారికి మాతృత్వం లభించగా నిరాశ చెందుతుంటారు. ఒకవేళ గర్భం దాల్చిన మూడు నెలలకే అబార్షన్లు (Abortions) జరగడం వంటి సమస్యలు ఏర్పడతాయి. తగిన జాగ్రత్తలు, చికిత్సలు తీసుకున్న తగిన ఫలితం లభించదు.
 

అయితే పిల్లలు పుట్టకపోవడానికి, అబార్షన్లు జరగటానికి పురుషులలోని వీర్యకణాల లోపం (Sperm deficiency) కూడా ప్రధాన కారణమని వైద్యులు చెబుతున్నారు. పురుషులలో ఆరోగ్యకరమైన వీర్యకణాలు ఉత్పత్తి ఉన్నప్పుడు మహిళలు గర్భం దాల్చినప్పుడు ఎటువంటి సమస్యలు లేకుండా సంతానప్రాప్తి (Fertility) పొందగలరు.
 


మహిళల్లో గర్భధారణ జరగాలంటే పురుషులలో వీర్యకణాలతో పాటు వారిలోని జన్యుపదార్థం (Genetic material) ఆరోగ్యంగా ఉండాలి.  అయితే మగవారిలో వీర్యంలో లోపాలు ఉన్నా, వీర్య కణాలలోని జన్యు పదార్థాలలో లోపాలు ఉన్నా అండం ఫలదీకరణ (Egg fertilization) జరగదు. ఒకవేళ గర్భధారణ ఏర్పడిన అబార్షన్లు జరిగే అవకాశం ఉంటుంది.

పురుషులు బిగుతైన లోదుస్తులు ధరించడం, ఎక్కువసేపు కుర్చీలో కూర్చొని పనిచేయడం, వేడితో కూడిన వాతావరణంలో పని చేయడం కారణంగా వృషణాల ఉష్ణోగ్రత (Testicular temperature) పెరుగుతుంది. దీంతో శుక్రకణాల నాణ్యత దెబ్బతిని గర్భధారణ జరగదు. వీర్యకణాలలో ఇన్ఫెక్షన్ల (Infection) కారణంగా వీర్యం నాణ్యత తగ్గుతుంది.
 

ఇవి గర్భధారణ జరుగుటకు సహకరించవు. ఇలాంటి వారు తగిన చికిత్స తీసుకుంటే మహిళలలో గర్భధారణ జరిగి, పండంటి బిడ్డకు జన్మనిస్తారు. అలాంటప్పుడు వారు డాక్టర్ల సలహా మేరకు వారు స్పెర్మ్  డి. ఎన్. ఏ టెస్ట్ (Sperm D. N. A test) చేయించుకోవాలి. ఈ పరీక్ష చేయించుకున్నాక లోపం ఉంటే మూడు నెలల పాటు తగిన చికిత్స తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
 

వీర్యకణాల లోపం ఎక్కువగా 45 ఏళ్ల పైబడిన పురుషుల్లో, వేరికోసిల్ సమస్య (Varicocele problem) ఉన్న వారిలో, క్యాన్సర్ చికిత్స (Cancer treatment) తీసుకున్న వారిలో ఎక్కువగా ఉంటుంది.  వేరికోసిల్ మొదటి దశలో ఉన్నప్పుడు మందులతో నయం చేసుకోవచ్చు. అదే ఈ సమస్య చివరి దశలో ఉంటే సర్జరీ తప్పనిసరి.
 

పురుషులు మద్యపానం (Alcohol), ధూమపానం (Smoking) వంటి చెడు చెడు అలవాటు కూడా వీర్యకణాల నాణ్యతను తగ్గిస్తాయి. ఈ చెడు అలవాట్లను తగ్గించి తగిన చికిత్స తీసుకుంటే మహిళలకు గర్భధారణ జరిగి వారు సంతాన ప్రాప్తి పొందగలుగుతారు.

Latest Videos

click me!