అమ్మాయిలను ఇంప్రెస్ చేయడం.. లవ్ లో పడేయాలని అబ్బాయిలు చేయని ప్రయత్నమంటూ ఏది ఉండదు. తమకు తోచిన పనులన్నీ చేసి.. అమ్మాయిలను తమవైపు తిప్పుకోవాలని చూస్తుంటారు. కానీ.. ఎన్ని ప్రయత్నాలు చేసినా.. కొందరు అమ్మాయిలు కనీసం తల పైకి ఎత్తి కూడా చూడరు. అసలు నిజానికి ఎలాంటి అబ్బాయిలను అమ్మాయిలు ఇష్టపడతారో ఇప్పుడు చూద్దాం..
ఎలాంటి అబ్బాయి తమ జీవితంలోకి రావాలని అమ్మాయిలు కోరుకుంటారు అనే విషయంపై తాజాగా ఓ సంస్థ సర్వే చేయగా..పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి.
అందంగా ఉన్న అబ్బాయిలనే అమ్మాయిలు ఇష్టపడతారా..? అంటే కాదనే సమాధానం వినపడుతోంది. అమ్మాయిలు ఎక్కువగా అందానికి ప్రిఫరెన్స్ ఇవ్వరట. కొద్దిమంది మాత్రమే అందంగా ఉండాలని చెబుతారు. ఎక్కువ మంది జెంటిల్మెన్ లా ఉండాలని కోరుకుంటున్నారు.
ఇక అమ్మాయి కనపడితే చాలా మంది అబ్బాయిలు ఫ్లర్టింగ్ చేయడం మొదలుపెడతారు. అయితే.. అమ్మాయిలకు కూడా ఫ్లర్ట్ చేయడం నచ్చుతుందట. అయితే.. అది ఎక్కువగా ఇబ్బంది పెట్టకుండా.. ఎంజాయ్ చేసేలా ఉంటే.. అలాంటివారిని ఇష్టపడతారట.
సెన్సాఫ్ హ్యూమర్ ఎక్కువగా ఉండే అబ్బాయిలను అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడతారు. తమను ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉండేవారికి ఎక్కువగా కనెక్ట్ అవుతారు.
అంతేకాదు.. తమలానే ఆలోచిస్తున్నారు అని ఎవరితో అయినా అనిపించినా కూడా తొందరగా కనెక్ట్ అయిపోతారు. ఆలోచనలు మంచిగా ఉండేలా.. హుందాగా కనిపించేవారిని త్వరగా ఇష్టపడతారు.
ఇక వంట చేయడం బాగా వచ్చిన అబ్బాయిలకు అయితేై.. అమ్మాయిలు వెంటనే పడిపోతారు. 80శాతం అమ్మాయిలు..వంట చేయడం వచ్చిన వ్యక్తి భర్తగా వస్తే బాగుండని కోరుకుంటారు.
తమకన్నా వయసులో కొంచెం పెద్ద వ్యక్తులనే త్వరగా ఇష్టపడతారు. అలాంటి వారితోనే బంధం బలంగా ఉంటుందని వారి నమ్మకం.
హెల్పింగ్ నేచర్ ఎక్కువగా ఉన్న అబ్బయిలను కూడా అమ్మాయిలు వెంటనే ఇష్టపడతారు.
సిక్స్ ప్యాక్ అబ్బాయిల కన్నా.. నార్మల్ బాడీ మెయింటైన్ చేసేవారిని అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడతారు.
అంతేకాదు.. క్లీన్ షేవ్ చేస్తూ ఎప్పుడూ నీట్ గా ఉండే అబ్బాయిలకన్నా.. గడ్డంతో మాస్ గా కనిపించేవారిపైనే అమ్మాయిలకు క్రేజ్ ఎక్కువగా ఉంటుందట.