శృంగారాన్ని ఆస్వాదించాలనే తాపత్రయం అందరికీ ఉంటుంది. పడకగదిలో రెచ్చిపోవాలని తాపత్రయపడుతుంటారు. అయితే.. చాలా మంది ఈ విషయంలో వెనకపడిపోతుతంటారు. ఆసక్తి ఉన్నా.. ఎక్కువ సేపు శృంగారంలో పాల్గొనలేకపోతున్నారు.
undefined
ఇందుకు కారణం మారుతున్న ఆహారపు అలవాట్లు, ఆధునిక జీవనశైలి ఏదైనా కావచ్చు. కారణాలేవైనా.. వీటిన్నింటికీ వంటిట్లో లభించే వెల్లుల్లితో చెక్పెట్టొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వెల్లుల్లిలోని ఔషధ గుణాలు సెక్స్ సామర్థ్యాన్ని పెంపొందిస్తాయట.
undefined
నపుంసకత్వాన్ని నివారించే శక్తి సైతం దీనికి ఉందట. స్త్రీ పురుషుల లైంగిక సమస్యల్ని దూరం చేసి.. సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు వెల్లుల్లి సహాయపడుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
undefined
రోజూ వెల్లుల్లి తినడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చు. ప్రతిరోజు 2-4 రెబ్బరు తినడం వల్ల పునరుత్పత్తి వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.రక్తశుద్ధి, రక్త ప్రసరణకు వెల్లుల్లి బాగా సహాయపడుతుంది. అంతేకాదు, గర్భం ధరించేందుకు ప్రయత్నించినప్పుడు మహిళలకు అవసరమైన శక్తిని వెల్లుల్లి ఇస్తుంది.
undefined
వెల్లుల్లిలోని సెలీనియం, విటమిన్లు సీ, బీ-6 క్రోమోజోమ్ లోపాలను నివారిస్తాయి. వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ లైంగిక అవయవాలకు రక్త ప్రసరణను పెంచుతుంది.
undefined
స్త్రీ, పురుషులలో సంతానోత్పత్తిని పెంచే పోషకాలు వెల్లుల్లిలో పుష్కలంగా ఉన్నాయి. స్పెర్మ్ తో పాటు, పిండం తయారుచేసే గుడ్లను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది.
undefined
చాలామంది పురుషులలో, రియాక్టివ్ ఆక్సిజన్ జాతుల (ROS) ఉత్పత్తి పెరగడం సంతానలేమికి ప్రధాన కారణం. శరీరం సహజ యాంటీఆక్సిడెంట్లు లేనప్పుడు ఆక్సీకరణస్థాయి పెరిగి ఒత్తిడిని సృష్టిస్తుంది. వెల్లుల్లి ఒక సహజ యాంటీఆక్సిడెంట్, ఈ ఆక్సీకరణ ఒత్తిడి వల్ల కలిగే సెల్యులార్ నష్టాన్ని తగ్గించి పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతుంది.
undefined
వెల్లుల్లి పురుషులలో శక్తిని పెంచుతుంది. అంతేకాక.. హృదయనాళ వ్యవస్థకు అవసరమైన విటమిన్లు, ఇతర పోషకాలను అందిస్తుంది. వెల్లుల్లిలోనిఅల్లిసిన్ లైంగిక అవయవాలకు రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. వీర్యంలోని నాణ్యతను కూడా రక్షిస్తుంది.
undefined
వెల్లుల్లిలోని సెలీనియం సహజ యాంటీఆక్సిడెంట్ లా పనిచేసి శుక్రకణాల చలనశీలతను పెంచుతుంది. సీ, బీ-6 - ఈ విటమిన్లు వీర్యాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
undefined
పురుషులు రెగ్యులర్గా వెల్లుల్లి తీసుకోవడం వల్ల రక్తం శుద్ధికావడంతో పాటు సంతానోత్పత్తి సామర్థ్యం పెరిగే అవకాశం ఉంది. రక్త ప్రవాహాన్ని మెరుగుపరిచి అంగస్తంభన వేగంగా అభివృద్ధి చెందడానికి వెల్లుల్లి సహాయపడుతుంది.
undefined
క్రమం తప్పకుండా వెల్లుల్లిని ఆహారంలో చేర్చుకునే స్త్రీలకు నెలసరి నొప్పి బాధ తప్పుతుంది. గర్భాశయం ఆరోగ్యంగా ఉంటుంది.
undefined
ఇది చర్మం, జుట్టు, గోర్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీంతో పాటు రోగనిరోధక శక్తిని పెంపొందించేందుకు, హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు దోహదపడుతుంది.
undefined