ఈ మధ్యకాలంలో సంతానం లేక ఇబ్బందిపడేవారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. దీంతో.. సంతానం కోసం ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సి వచ్చింది.
undefined
ఆధునిక జీవన శైలి కారణంగా.. ఆరోగ్యంపై పెద్దగా దృష్టిసారించకపోవడం వల్ల పురుషుల్లో వీర్య నాణ్యత తగ్గిపోతోంది. దీంతో.. సంతానం కోసం తిప్పలు తప్పడం లేదు. అయితే.. దానికి పరిష్కారం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
undefined
ఆధునిక జీవనశైలి వల్ల రకరకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. వీటిలో సంతానలేమి ప్రధానమైంది. పురుషుల్లో వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉండటం అనేది దానికి ఓ ముఖ్య కారణం.
undefined
ప్రస్తుతం ఉన్న చికిత్సలతో దుష్ప్రభావాలూ ఉన్నాయి. వాటికి బదులు.. రోజూ గంటపాటు ప్రాణాయామం, ధ్యానం చేస్తే సహజసిద్ధంగా వీర్యకణాలు వృద్ధిచెందుతాయి.
undefined
దీనిపై ఓ సంస్థ చేసిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
undefined
వీర్యకణాల సంఖ్య తక్కువుగా ఉన్న ఐదుగురు పురుషులను ఎంపిక చేసి, 21 రోజులు.. రోజుకు గంట సేపు వారితో యోగాసనాలు వేయించారు.
undefined
ప్రాణాయామం, ధ్యానం చేయించారు. ఇవి పూర్తయిన తర్వాత అత్యాధునిక డీఎన్‌ఏ సీక్వెన్సింగ్ పద్ధతి ద్వారా జన్యు స్థాయిలో వీరిలో వచ్చిన మార్పులను పరీక్షించారు.
undefined
దీనిని పట్టి.. ప్రతిరోజూ యోగా, ప్రాణయామం లాంటివి చేయడం వల్ల పురుషులు వీర్యులౌతారని.. తద్వారా ఆరోగ్యకరమైన సంతానం కలిగే అవకాశం కూడా ఉంటుంది.
undefined