ఆడవాళ్లూ.. హస్తప్రయోగానికి ముందు, తర్వాత ఈ విషయాలను ఖచ్చితంగా తెలుసుకోవాలి.. లేదంటే?

First Published | Sep 19, 2023, 11:57 AM IST

సెక్స్ యే కాదు హస్తప్రయోగం కూడా స్త్రీ పురుషులిద్దరికీ ఎంతో మేలు  చేస్తుంది. ముఖ్యంగా ఆడవాళ్లు హస్తప్రయోగం తో మానసిక, శారీరక ప్రయోజనాలను పొందుతారు. అయితే దీనికి ముందు కొన్ని విషయాలను ఖచ్చితంగా తెలుసుకోవాలంటున్నారు నిపుణులు. 
 

హస్త ప్రయోగంతో ఆనందం కలగడమే కాదు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి. ఏదేమైనా దీనికంటే ముందు హస్త ప్రయోగం గురించి పూర్తిగా తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది కూడా కొన్ని అనారోగ్య సమస్యలను కలిగిస్తుంది. హస్తప్రయోగంతో ప్రయోజనాలను పొందాలనుకుంటే మాత్రం.. హస్త ప్రయోగానికి ముందు, తర్వాత ఏం చేయాలో ఖచ్చితంగా తెలుసుకోవాలంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఆడవాళ్లు.. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

చేతులను శుభ్రంగా కడుక్కోవడం

ఎన్నో వస్తువులను ముట్టుకుంటూ ఉంటాం. దీనివల్ల చేతులకు దుమ్ము, ధూళి, వైరస్, బ్యాక్టీరియా అంటుకుంటాయి. అందుకే ఆడవాళ్లు హస్తప్రయోగం చేయడానికి ముందు చేతులను సబ్బుతో శుభ్రంగా కడగాలి. లేదు అలాగే హస్తప్రయోగం చేస్తే హానికరమైన బ్యాక్టీరియా, సూక్ష్మక్రిములు యోనిలోకి వెళతాయి. దీంతో సంక్రమణ, ఇతర అనారోగ్య సమస్యల ప్రమాదం పెరుగుతుంది. అందుకే చేతులను శుభ్రంగా కడగండి. హస్తప్రయోగానికి ముందే కాకుండా ఆ తర్వాత కూడా కడగడం మర్చిపోకండి. 


masturbating


గోళ్లు శుభ్రంగా ఉండాలి

అమ్మాయిలు చాలా మంది గోర్లను పొడుగ్గా పెంచడానికే ఇష్టపడతారు. కానీ ఆడవారు ఎక్కువగా హస్తప్రయోగానికి చేతివేళ్లనే ఉపయోగిస్తారు. అందుకే హస్తప్రయోగం చేసేవారు చేతులను కడుక్కోవడంతో పాటుగా గోర్లను కూడా చిన్నగా కట్ చేసుకోవాలి. నిజానికి గోర్లు పొడుగ్గా ఉంటే వాటిలో సూక్ష్మక్రిములు ఉంటాయి. ముందే యోని చర్మం చాలా మృదువుగా ఉంటుంది. ఇది యోని చర్మాన్ని దెబ్బతీస్తుంది. 
 

సెక్స్ టాయ్స్

హస్త ప్రయోగంలో చాలా మంది సెక్స్ టాయ్స్ ను కూడా ఉపయోగిస్తుంటారు. కానీ సెక్స్ టాయ్స్ ను కొనే ముందు కొన్ని విషయాలను తెలుసుకోవాలి. ఏవి మంచివో తెలుసుకోవడానికి గైనకాలజిస్ట్ ను సంప్రదించండి. సెక్స్ బొమ్మల్లో లేటెక్స్, ప్లాస్టిక్ వంటి ఉత్పత్తులు ఉంటాయి. కానీ వీటికి దుమ్ము, ధూళి, బ్యాక్టీరియా సులువుగా అంటుకుంటాయి. అందుకే వీటిని ఉపయోగించడం వల్ల అంటు వ్యాధులు రావొద్దంటే మాత్రం ఉపయోగించే ముందు వీటిని ఖచ్చితంగా శుభ్రం చేయండి. 

Latest Videos

click me!