భార్య భర్తల అనుబంధం గురించి చాలామందికి తెలియని అద్భుత సత్యాలు ఇవే!

First Published | Oct 21, 2021, 9:07 PM IST

భార్య భర్తల (Wife Husbands) బంధం అంటే గొడవ పడడం, తిట్టుకోవడం, విడిపోవడం కాదు. భార్య భర్తల బంధం శాశ్వతం. ఒకరికొకరు శాశ్వతం (Permanent). 

భార్య భర్తల (Wife Husbands) బంధం అంటే గొడవ పడడం, తిట్టుకోవడం, విడిపోవడం కాదు. భార్య భర్తల బంధం శాశ్వతం. ఒకరికొకరు శాశ్వతం (Permanent). ప్రతి భర్త తన భార్యను మరో తల్లి రూపంగా భావిస్తే ప్రతి భార్య తన భర్తను మొదటి బిడ్డగా భావిస్తుంది.

భార్య భర్తల వివాహ బంధంలో ప్రేమ, విశ్వాసం, భాగస్వామ్యం, సహనం, ఓర్పు ఉండాలి. భర్తకి భార్య బలం కావాలి. బలహీనత (Weakness) కాకూడదు. భార్యకి భర్త భరోసా కావాలి భారం (Burden) కాకూడదు. భార్య భర్తల బంధం అన్యోన్యంగా ఉండాలి.
 

Latest Videos


సంసారం అంటే కలిసి ఉండటం కాదు కష్టాలలో కలిసిమెలిసి (Together) ఉండి ఒకరినొకరు అర్థం చేసుకుని కడవరకూ తోడు వీడకుండా ఉండడం. గొడవలు లేని బంధం కంటే గొడవపడి విడిపోకుండా ఉన్న బంధమే గొప్పది. భార్య భర్తల మధ్య ప్రేమ (Love) అనేది చాలా ముఖ్యం.
 

భార్యాభర్తల మధ్య బంధం అనేది ఒక పుస్తకం (Book) లాంటిది. భార్య మధ్య మధ్య పొరపాట్లు (Mistakes) అనేది అందులోని ఒక పేజీ లాంటిది. ఒక పొరపాటు వస్తే సరిదిద్దుకోవాలి కానీ  మొత్తం  పుస్తకాన్ని అనరాదు.
 

భార్యాభర్తల్లో ఒకరికి ఒకరు వారి అభిప్రాయాలను తెలుసుకుంటూ వాటిని గౌరవించాలి. వారి ఇష్టాయిష్టాలను ఒకరికొకరు తెలియపరచుకోవాలి.భార్యాభర్తలిద్దరూ పాలు నీళ్ళలా (Milk is like Water) కలిసిపోవాలి. వీరి బంధంలో పక్క వారు (Another Persons) ప్రవేశించడానికి అవకాశం ఇవ్వరాదు.

కొందరు మూర్ఖురాలైన భార్యలు తమ భర్తలను బానిసగా (As a slave) చేసి తను యజమానిగా ఉంటుంది. తెలివైన భార్యలు తన భర్తలను రాజుగా (King)చేసి ఆ రాజుకు తను రాణిగా ఉంటుంది. ప్రతి భార్య తన భర్త గొప్ప స్థాయిలో ఉండేలా కోరుకోవాలి.
 

కుటుంబ సభ్యుల ముందు భర్తను తక్కువచేసి మాట్లాడరాదు, చులకనగా చూడరాదు. భర్త పరువు (Dignity) నిలబెట్టాల్సిన బాధ్యత (Responsibility) భార్యకు ఉంది. భర్తను గౌరవించాలి చులకనగా చూడరాదు.

అలాగే భర్త భార్యను కూడా ఇతరుల ముందు కించపరచరాదు. భార్యకు తగిన గౌరవం (Respect) ఇవ్వాలి. ఆమెకు కష్టసుఖాలలో ఒక మంచి స్నేహితుడులాగా (Friend's) ఉండాలి. మంచి స్నేహితుడు లాంటి భర్త దొరికినప్పుడు ఆ భార్య అదృష్టవంతురాలు.

click me!