మెడపై ముద్దు పెడితే అర్థమేంటో తెలుసా?

First Published | Feb 13, 2024, 2:51 PM IST

వాలెంటైన్ వీక్ లో ఫిబ్రవరి 13ను కిస్ డేగా జరుపుకుంటారు. ఈ రోజు భాగస్వామిని ముద్దు పెట్టుకుని తమ ప్రేమను వ్యక్తపరుస్తారు. అయితే ముద్దుల్లో ఎన్నో రకాలు ఉన్నాయి. అయితే ప్రతి రకం ముద్దు వెనుక ఒక్కో రకమైన సందేశం ఉంటుంది. ఎలా ముద్దు పెట్టుకుంటే.. ఎలాంటి అర్థం వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.. 
 

ప్రేమికులు ఎంతగానో ఎదురుచూసే ప్రేమికుల రోజుకు ఇంకా ఒక్కరోజే మిగిలి ఉంది. అంటే ఈ రోజు ప్రేమికులంతా కిస్ డే ను జరుపుకుంటున్నారు. ఈ రోజున ప్రేమికులు, పెళ్లైన జంటలు తమ భాగస్వామికి ముద్దుతో తమ ప్రేమను తెలియజేస్తారు. మీకు తెలుసా? ముద్దులు చాలా రకాలే ఉన్నాయి. అందులో ఈ మధ్యే లవ్ లో పడ్డ కొన్ని జంటలు కొన్ని రకాల ముద్దులకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇవి మీ భాగస్వామిని ఇబ్బందులకు గురిచేస్తాయి. నిజానికి ముద్దు పెట్టడానికి మీకు ఎన్నో మార్గాలు ఉన్నాయి. అందులోనూ మీరు పెట్టే ఒక్కో ముద్దు ఒక్కో అర్థాన్ని ఇస్తుంది. మరి ఎలా ముద్దు పెట్టుకుంటే ఎలాంటి అర్థమొస్తుందో ఓ లుక్కేద్దాం పదండి. 

Image: Getty Images

నుదుటికి ముద్దు

కొంతమంది తమ భాగస్వామి నుదిటిపై ముద్దు పెట్టుకుంటారు. ఇలా ముద్దు పెట్టుకోవడం వల్ల భాగస్వామి పట్ల ప్రేమతో పాటుగా శ్రద్ధ కూడా కనిపిస్తుంది. నుదిటిపై ముద్దు పెట్టుకోవడం కూడా మీకు సురక్షితమైన అనుభూతిని కలిగించడానికి ఒక మార్గం.
 


Image: Getty Images

ముక్కుపై ముద్దు

భాగస్వామి ముక్కుపై ముద్దు పెట్టుకోవడం అంటే మీ స్వచ్ఛమైన భావోద్వేగాలను వ్యక్తీకరించడానికి ఒక మంచి మార్గం అన్న మాట. జీవితాంతం మీ భాగస్వామితో కలిసి జీవించాలని కలలు కంటున్నారని ఈ ముద్దు విధానం వెనుక ఉన్న సందేశం.

Image: Getty Images

మెడపై ముద్దు

చాలా మంది మెడపై కూడా ముద్దు పెట్టుకుంటుంటారు. మెడపై పెట్టుకోవడం అంటే వారు మీతో శృంగారంలో పాల్గొనడానికి సిద్దంగా ఉన్నారని అర్థం. ఇది మీ భాగస్వామి పట్ల మీకున్న భావాన్ని చూపుతుంది. ఈ ముద్దు మీ బంధాన్ని బలపరుస్తుంది.
 

.

హ్యాండ్ కిస్

చేతులపై ముద్దు పెట్టుకోవడం అంటే మీరు మీ భాగస్వామికి మీ గౌరవాన్ని చూపించడమే అవుతుంది. మీరు ఎవరినైనా ప్రేమించి, వారితో కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకుంటే.. మీరు చేతులపై ముద్దు పెట్టుకుని వారిని అడగొచ్చు. 
 

ఫ్రెంచ్ కిస్

మీరు భాగస్వామితో కొంచెం సౌకర్యవంతంగా ఉన్నప్పుడు ఫ్రెంచ్ ముద్దుల వర్షం కురిపించొచ్చు. ఈ రకమైన ముద్దు భాగస్వామి పట్ల మీ భావోద్వేగాలను కూడా చూపుతుంది. ఫ్రెంచ్ ముద్దు డోపామైన్ హార్మోన్ ను విడుదల చేస్తుంది. ఇది మీ ప్రేమ,  కనెక్షన్ ను పెంచుతుంది.
 


చెవి దగ్గర ముద్దు

ఈ రకమైన ముద్దు మీ ఇద్దరి మధ్య ప్రేమను పెంచడానికి పని చేస్తుంది. చెవి మన శరీరంలో సున్నితమైన భాగం. కాబట్టి ఈ ప్రదేశాన్ని ముద్దు పెట్టుకోవడం వల్ల ఉత్సాహం పెరుగుతుంది. అలాగే మీకు దగ్గరగా వచ్చే అవకాశం కూడా ఉంది. 

Latest Videos

click me!