పెళ్లైన కొత్తలో అంతా బాగుంటుంది. మన లైఫ్ పార్ట్ నర్ మనతో చిన్న మాట మాట్లాడినా, కాసేపు చెయ్యి పట్టుకున్నా, హగ్ చేసుకున్నా ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది. ఆ టచ్, మాట అన్నీ మనం ఆనందంగా ఫీలౌతూ ఉంటాం. కానీ.. తర్వాతర్వాత ఆ ఫీల్ తగ్గిపోతూ ఉంటుది. ఫలితంగా వారి మధ్య గొడవలు రావడం మొదలౌతూ ఉంటాయి. ఆ గొడవలు దూరాన్ని కూడా పెంచేస్తూ ఉంటాయి. కానీ.. ఈ దూరాలను పోగొట్టి.. ఇద్దరి బంధాన్ని దగ్గర చేసే శక్తి ఒక్క హగ్ కి ఉంటుందట.