హస్తప్రయోగం అతి సాధారణ విషయం.. కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు...

First Published | Apr 4, 2022, 1:19 PM IST

ఎప్పుడూ వివాదాల్లో ఉండే బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనారనౌత్ ఇటీవల హస్తప్రయోగం గురించి హాట్ హాట్ కామెంట్స్ చేసింది. ఇప్పుడిది బాలీవుడ్ వర్గాల్లో సంచలనంగా మారింది. ఏక్తా కపూర్ నిర్వహిస్తున్న రియాలిటీ టీవీ షో లాక్ అప్ లో తాజా ఎపిసోడ్‌లో కంటెస్టెంట్‌లలో ఒకరైన మందన కరీమికి ఈ విషయంగా కంగనా రనౌత్ క్లాస్ పీకింది. 

లాక్ అప్ షో లో కంటెస్టెంట్ లో ఒకరు బాత్రూంలో హస్తప్రయోగం చేసినా అవమానించడం తగదని, హస్తప్రయోగం చేయడం సాధారణ విషయమని అంగీకరించాలని చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యం హస్తప్రయోగం చుట్టూ ఉన్న కొన్ని అపోహలేంటో చూద్దాం. 

హస్త ప్రయోగం చేస్తున్నారంటే.. నిరాశలో ఉన్నట్టు.. 
డెస్పరేట్ అనే పదం చాలా సందర్భాలలో దుర్వినియోగం చేయబడుతుంది. హస్తప్రయోగం అనేది నిరాశతో ఉన్న వ్యక్తులకు సంకేతం అని బాగా నమ్ముతారు. అయితే ఇది అతి మామూలుగా నమ్మే అర్ధంలేని సిద్ధాంతం. కంగనా చెప్పినట్లుగా, ఆరోగ్యంగా ఉండడానికి హస్త ప్రయోగం కూడా ఇంపార్టెంటే అని సైన్స్ కూడా నిరూపించింది. దీనివల్ల ఒత్తిడి, కండరాల పనితీరు చక్కబడుతుంది. జెండర్ తో సంబంధం లేకుండా ఎవరైనా హస్తప్రయోగం చేసుకోవచ్చు.


sex

కపుల్స్ హస్తప్రయోగం చేయకూడదు
భార్యాభర్తలుగానో, రిలేషన్ షిప్ లోనో, సహజీవనంలోనో ఉన్నప్పుడు కూడా హస్తప్రయోగం చేసుకోవచ్చు. ఇది చాలా సాధారణమైన విషయం. ఆరోగ్యకరమైనది కూడా. ఫిలడెల్ఫియాలోని బోర్డు-సర్టిఫైడ్ సెక్సాలజిస్ట్జస్టిన్ మేరీ షుయ్, PhD.. ఏమంటారంటే.. "జనాలు వివిధ స్థాయిల లైంగిక కోరికలను కలిగి ఉంటారు. దీన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అలాంటి వాటిల్లో masturbation పూర్తిగా ఆరోగ్యకరమైన చర్య, అంతేకాదు చాలాసాధారణమైనది’ అని చెప్పుకొచ్చారు. 

ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే హస్తప్రయోగం చేయాలి
అలా ఏమీ లేదు. ఎవరిష్టం వారిది. కొందరికి భాగస్వామిని చూస్తూ హస్తప్రయోగం చేసుకోవడం అలవాటు. అందులో తప్పేమీ లేదు. అందుకే ఒంటరిగా ఉన్నప్పుడే హస్తప్రయోగం చేయవచ్చనే నియమం లేదు. జంటలు కలిసి దీన్ని చేయడానికి ఇష్టపడేవాళ్లూ ఉన్నారు. 

హస్త ప్రయోగం వల్ల అంధత్వం
ఇది చాలా మంది ప్రజలు విశ్వసించే చాలా విచిత్రమైన అపోహ. ఒకప్పుడు సెక్స్ అనేది కేవలం పిల్లలు పుట్టించడానికి మాత్రమే అని నమ్మేవారు. అందుకే హస్తప్రయోగం వల్ల సంతానోత్పత్తి తగ్గుతుందని.. ఇతర సమస్యలు వస్తాయని నమ్ముతారు. పిచ్చిపడుతుందని,  అరచేతుల్లో వెంట్రుకలు మొలుస్తాయని నమ్మేవారు. ఇంకొంతమంది హస్తప్రయోగం వల్ల గుడ్డివాళ్లవుతారని కూడా అపోహపడతారు. అయితే వీటిల్లో దేంట్లోనూ నిజం లేదు. 

Latest Videos

click me!