పురుషులు ఇలా చేస్తేనే మహిళలకు నచ్చుతుందట..!

First Published | Mar 31, 2022, 4:20 PM IST

తమ పార్ట్ నర్స్ ఎలాంటి కలయికను కోరుకుంటున్నారో కూడా పెద్దగా పట్టించుకోరు. అదొక పనిలా , ఉద్యమంలా భావించి తమ పని తాము చేసుకుంటూ వెళ్తుంటారు. అయితే.. దీనిపై నిపుణులు కొన్ని సలహాలు ఇస్తున్నారు.
 

శృంగారమంటే ప్రతి ఒక్కరికీ ఆసక్తి ఉంటుంది. కానీ... దాని గురించి బయటకు చెప్పాలన్నా.. దాని గురించి చర్చించాలన్నా.. చాలా మంది మొహమాటం అడ్డుపడుతుంది. దీంతో... దాని గురించి మాట్లాడటానికి ఇష్టపడరు. అంతే కాకుండా... దాని గురించి పూర్తిగా కూడా తెలుసుకోరు.

అంతేకాదు.. మరీ ముఖ్యంగా పురుషులు.. తమ పార్ట్ నర్స్ ఎలాంటి కలయికను కోరుకుంటున్నారో కూడా పెద్దగా పట్టించుకోరు. అదొక పనిలా , ఉద్యమంలా భావించి తమ పని తాము చేసుకుంటూ వెళ్తుంటారు. అయితే.. దీనిపై నిపుణులు కొన్ని సలహాలు ఇస్తున్నారు.


శృంగారం శరీరాన్ని ఉత్తేజపరుస్తుంది. దానిని హాయిగా ఆస్వాదించాలి తప్ప.. హడావిడిగా పనికానించేశాం అనుకోకూడదంటున్నారు నిపుణులు. మగువలను మురిపించి మైమరిపించి.. శృంగారం వైపు తీసుకువెళ్లడంలో మాత్రమే వేగం చూపించాలట.

ఆ తర్వాత పనిని ఎంత స్లోగా చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అలా చేసేవారిని స్త్రీలు ఎక్కువగా ఇష్టపడతారని వారు చెబుతున్నారు.

ఈ విషయంపై కొందరు నిపుణులు చేసిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. శృంగారం విషయంలో వేగం అస్సలు పనికిరాదు అనేది నిపుణుల వాదన. పురుషులు దూకుడుగా ఉండటాన్ని స్త్రీలు ఎక్కువగా ఎంజాయ్ చేయలేరట. నెమ్మదిగా.. ఫ్లోర్ ప్లేతో మొదలుపెడితేనే స్త్రీలు ఎక్కువగా ఇష్టపడతారని వారు చెబుతున్నారు.

అప్పుడప్పుడు భార్య, భర్తలు సెక్స్ గురించి మాట్లాడుకుంటూ ఉండాలట. అలా మనసు విప్పి మాట్లాడుకుంటేనే ఎవరు ఎలా ఇష్టపడుతున్నారనే విషయంపై స్పష్టత వస్తుందంటున్నారు.

అంతేకాదు.. ఎప్పుడూ పురుషులే ఈ విషయంలో చొరవ తీసుకోవాలని స్త్రీలు అనుకోకూడదట. అప్పుడప్పుడు స్త్రీలు కూడా చొరవతీసుకుంటే.. పురుషులు ఆనందంగా ఫీలౌతారని వారు చెబుతున్నారు.
 

శృంగారాన్ని ఆనందంగా ఆస్వాదించగలిగినప్పుడే... దాని వల్ల మనకు లాభాలు కలుగుతాయని చెబుతున్నారు. గుండె కొట్టుకునే వేగం తగ్గుతుందని, రక్తపోటును నివారించవచ్చని, రోగ నిరోధక శక్తి పెరిగి ఇన్ఫెక్షన్లు దరి చేరవని, ఒత్తిడి దూరం అవుతుందని వెల్లడించారు. వారానికి ఒకసారి శృంగారం చేయడం వల్ల అనారోగ్యం అనే సమస్య ఉండదని వైద్యులు చెబుతున్నారు.

పురుషులు తరచుగా స్కలిస్తే మరణం సంభవించే స్థాయి తగ్గుతుందని తెలిపారు. సెక్స్ పరంగా సమస్యలు ఎదుర్కొనేవారు ఇతర సమస్యలను కూడా ఎక్కువగా ఎదుర్కొంటారని ఆమె వెల్లడించారు. ఒత్తిడిని దూరం చేసి సంతోషాన్ని కలిగించే అద్భుత కార్యం.. శృంగారం అని, ఆక్సిటోసిన్ హార్మోన్ ప్రభావం అని వివరించారు.

చాలా మంది సహజ సిద్ధంగా మూడ్ రావడం లేదని బాధపడతారని, దాన్ని ఒక అలవాటుగా మార్చుకుంటే క్రమంగా డెవలప్‌మెంట్ ఉంటుందని ఆమె వెల్లడించారు. నిద్రలేమి సమస్యలతో బాధపడేవారు సెక్స్ చేస్తే వారి మెదడు త్వరగా స్విచ్ఛాఫ్ అవుతుందని, అప్పుడు రిలాక్స్‌గా ఉంటుందని తెలిపారు.
 

Latest Videos

click me!