న్యూమరాలజీ ప్రకారం కొన్ని తేదీల్లో పుట్టిన అమ్మాయిలు అత్త మనసుని ఈజీగా గెలుచుకుంటారు. గయ్యాళి అత్త కూడా వీళ్లకు ఫిదా అయిపోతుందట. మరి ఆ మ్యాజిక్ చేసే కోడళ్లు ఎవరో చూద్దాం పదండి.
అత్త లేని కోడలు ఉత్తమురాలు, కోడలు లేని అత్త గుణవంతురాలు అంటారు. ఎందుకో తెలుసా? ఈ ప్రపంచంలో ఎవరితోనైనా స్నేహం చేయొచ్చు. కానీ అత్తా కోడళ్లకు మాత్రం కుదరదంటారు. కానీ ఇప్పుడు తల్లి, కూతుళ్లలా ఉండే అత్తా కోడళ్లని చూస్తూనే ఉన్నాం. ఇలాంటి అరుదైన దృశ్యాలు చూడటానికి కారణం ఆ కోడలు పుట్టిన తేదీ అని మీకు తెలుసా?
సంఖ్యాశాస్త్రం ప్రకారం.. కొన్ని తేదీల్లో పుట్టిన అమ్మాయిలు అత్తల మనసుల్ని ఈజీగా గెలుచుకుంటారట. ఏ అత్త అయినా వీళ్లకి ఫిదా అయిపోతుందట. మరి ఆ స్పెషల్ డేట్ ఏంటో చూద్దాం రండి.
25
ఈ తేదీల్లో పుట్టినవారు అత్తకు చాలా ఫేవరైట్
సంఖ్యాశాస్త్రం ప్రకారం 3, 12, 21, 30 తేదీల్లో పుట్టిన అమ్మాయిలు అత్తారింట్లో మంచి పేరు తెచ్చుకుంటారు. ముఖ్యంగా అత్త మనసు గెలుచుకుంటారు. దీంతో అత్తారిల్లే స్వర్గమవుతుంది. ఈ తేదీల్లో పుట్టినవాళ్లు పుట్టుకతోనే అదృష్టవంతులట. గురు గ్రహం ప్రభావం ఉండటం వల్ల అన్నీ అనుకూలంగా ఉంటాయి. ఇది వాళ్లకి అదృష్టాన్ని తెస్తుందట.
35
అత్తకు నచ్చేలా..
ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిల గుణాలు, ప్రవర్తనతో అత్త మనసుని ఈజీగా గెలుస్తారు. అత్తకి నచ్చేలా ఉంటారు. కుటుంబంలో అందరినీ ప్రేమగా చూసుకుంటారు.
45
అత్తింటికి అదృష్టం..
న్యూమరాలజీ ప్రకారం ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు అత్తారింటికి అదృష్టం తెస్తారట. వాళ్లు వచ్చాక ఆ ఇంట్లో ఐశ్వర్యం, సంతోషం పెరుగుతాయట.
55
పాజిటివ్ ఎనర్జీ
ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని పెంచుతారు. గొడవల్లేకుండా, హ్యాపీగా ఉండటానికి హెల్ప్ చేస్తారు. కుటుంబంలో సంతోషాన్ని పెంచడమే కాకుండా, భర్తకి కూడా అదృష్టం తెస్తారు. దాంపత్య జీవితం సుఖంగా ఉంటుంది. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు ఎప్పుడూ హ్యాపీగా ఉంటారు. భర్తతో, కుటుంబంతో గొడవపడే మనస్తత్వం వీళ్లకి తక్కువ. చిన్న చిన్న గొడవలు వచ్చినా సర్దుకుపోయి సంతోషంగా ఉండటానికి ట్రై చేస్తారు.