Happy Life: ప్రతి రోజు రొమాంటిక్‌గా, ఆనందంగా ఉండాలంటే ఇలా చేయండి

Published : Mar 05, 2025, 08:38 AM IST

Happy Life: రోజువారీ పనుల్లో పడి జీవితం ఒక్కోసారి రొటీన్‌గా అనిపిస్తుందా? చిన్న చిన్న విషయాల్లో అందాన్ని గమనిస్తే మీ రొటీన్ లైఫ్ కూడా చాలా అందంగా మారుతుంది. ఇక్కడ ఉన్న చిట్కాలు పాటించి మీ డైలీ లైఫ్ ని ఆనందంగా మార్చుకోండి.      

PREV
15
Happy Life: ప్రతి రోజు రొమాంటిక్‌గా, ఆనందంగా ఉండాలంటే ఇలా చేయండి

1. కూల్ గా రోజును ప్రారంభించండి 

ఉదయం లేవగానే టెన్షన్ పడుతూ ఆ రోజు చేయాల్సిన పనులు హడావుడిగా మొదలు పెట్టకుండా కాసేపు ప్రశాంతంగా ఉండండి. దేవుడి ముందు దీపం వెలిగించండి. మంచి పాట వినండి. సూర్యోదయం చూస్తూ నెమ్మదిగా కాఫీ తాగండి. ఇలా చేయడం వల్ల రోజంతా హాయిగా ఉంటుంది. 

25

2. మీకు నచ్చినట్టగా డ్రెస్సింగ్ చేసుకోండి

సాధారణంగా ప్రత్యేక సందర్భంలో మాత్రమే నచ్చినట్టుగా డ్రెస్సింగ్ చేసుకుంటాం కదా. అలా కాకుండా ప్రతి రోజు మీకు ఇష్టమైన దుస్తులు వేసుకోండి. లేదా మీరు వేసుకున్న వాటిని ఇష్టపడండి. తిట్టుకుంటూ, నచ్చలేదని అనుకుంటూ డ్రెస్సింగ్ చేసుకోకండి. మీకు ఇష్టమైన డియోడ్రెంట్ లేదా పర్ఫ్యూమ్ చల్లుకోండి. ఇలా చేస్తే  మీ గురించి మీరు శ్రద్ధ తీసుకుంటున్నారని మీ సబ్ కాన్షియష్  మైండ్ కి అర్థమవుతుంది. ఆటోమెటిక్ గా మీరు అనుకున్న పనులు విజయవంతంగా పూర్తవుతాయి. 

35

3. చుట్టూ మీకు నచ్చిన వస్తువులు ఉండేలా చూసుకోండి

చుట్టూ ఉండే వాతావరణం మనసుపై ప్రభావం చూపుతుంది. కాబట్టి మీరు వర్క్ చేసే ప్లేస్ లో గాని, ఇంటిలో గాని మీకు నచ్చిన వస్తువులు ఉండేలా చూసుకోండి. మీ గది ఎప్పుడూ కాంతివంతంగా ఉండేలా చూసుకోండి. లైట్లు వెలిగించండి. మీకు ఇష్టమైన పుస్తకాలు లేదా బొమ్మలు పెట్టుకోండి.

45

4. చిన్న చిన్న ఆనందాలను ఆస్వాదించండి 

జీవితాన్ని రొమాంటిక్‌గా మార్చుకోవడం అంటే చిన్న విషయాలను కూడా ఆస్వాదించడమే. ఇంట్లో పువ్వుల సువాసనను ఆస్వాదించండి. నెమ్మదిగా నడవండి. మీకు ఇష్టమైన ప్లేట్‌లో భోజనం చేయండి. ఏదైనా కొనేందుకు తక్కువ దూరం అయితే నడిచి వెళ్లండి. చుట్టూ ఉన్న పరిసరాలను చూసి ఆనందించండి. 

55

 5. ఈ విషయాల్లో నెమ్మదిగా ఉండండి

అనవరమైన పనులన్నీ హడావుడిగా పూర్తి చేయకుండా నెమ్మదిగా చేయండి. భోజనం ఆస్వాదిస్తూ తినండి. మంచిగా మాట్లాడండి. ప్రతి క్షణాన్ని పూర్తిగా అనుభవించండి. దేవుని పూజకు పూలు కోయండి. జీవితాన్ని పూర్తిగా అనుభవించినప్పుడే అది రొమాంటిక్‌గా మారుతుంది.

click me!

Recommended Stories