రోజుకి 13 ప్రేయసి కౌగిలింతలు... ఆహా.. జన్మదన్యమంతే..!

First Published Feb 12, 2020, 3:00 PM IST

అంతెందుకు విడిపోయిన ఇద్దరు ప్రేమికులు చాలా కాలం తర్వాత కలుసుకున్నప్పుడు ఒక్కసారి హగ్ చేసుకుంటే... వాళ్ల పాత ప్రేమ మళ్లీ చిగురించడం ఖాయమట. ఎంతటి ధ్వేషాన్నైనా  ఒక్క హగ్ తో పొగొట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు.

కౌగిలింత.. దీనికి చాలా మహిమ ఉంది. భార్యభర్తలు, ప్రేమికులకే ఇది పరిమితమైంది కాదు. ప్రతి ఒక్కరికీ దీనితో ఓ ప్రత్యేక అనుబంధం ఉంటుంది. దెబ్బ తగిలి ఏడ్చే పిల్లవాడికి తల్లి కౌగిలించుకోగానే బాధమర్చిపోయి ఆనందంగా నవ్వేస్తాడు.
undefined
ఏదైనా శుభవార్త వినగానే మనకు నచ్చినవారిని ఆటోమెటిక్ గా కౌగిలించుకుంటాం.. అంతేకాదు.. ఏదైనా బాధలో ఉన్నప్పుడు ఆ బాధను పంచుకోవడానికి.. లేదా ఎవరైనా బాధలో ఉంటే ఓదార్చడానికి కూడా ఈ హగ్ ఓ మందులా పనిచేస్తుంది.
undefined
అంతెందుకు విడిపోయిన ఇద్దరు ప్రేమికులు చాలా కాలం తర్వాత కలుసుకున్నప్పుడు ఒక్కసారి హగ్ చేసుకుంటే... వాళ్ల పాత ప్రేమ మళ్లీ చిగురించడం ఖాయమట. ఎంతటి ధ్వేషాన్నైనా ఒక్క హగ్ తో పొగొట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు.
undefined
వాలంటైన్స్ డే వీక్ లో భాగంగా ఈ రోజు హగ్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అసలు ఎందుకు కౌగిలించుకోవాలి..? దాని వల్ల మనకు కలిగే లాభాలేంటి..? దీనిపై సర్వేలు ఏమంటున్నాయో ఒకసారి మీరు కూడా లుక్కేయండి.
undefined
కావలింతల ద్వారా అనుబంధం ఏర్పడటమే కాకుండా, పలు వ్యాధులు కూడా మటుమాయమవుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కావలింతలకు ఉన్న ప్రాముఖ్యతను గుర్తించిన దరిమిలా ప్రతీయేటా ఫిబ్రవరి 12న వరల్డ్ హగ్ డే‌ను నిర్వహిస్తున్నారు. శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం ప్రతీరోజు ఆనందంగా గడిచేందుకు రోజుకు కనీసం 4 కావలింతలు అవసరం.
undefined
చాలామంది తల్లిదండ్రులు తాము పిల్లలను దగ్గరకు తీసుకున్నప్పుడు అన్నింటినీ మరచిపోతామని, ఎంతో సంతృప్తి కలుగుతుందని చెబుతుంటారు. అదేవిధంగా తల్లిదండ్రులు తమ పిల్లలను కావలించుకున్నప్పుడు వారికి మానసిక ఆరోగ్యం సమకూరుతుందని శాస్త్రవేత్తలు చెబుతుంటారు.
undefined
బ్రిటన్ దేశీయులు ప్రతిరోజూ 13 సార్లు కౌగలించుకుంటారని ఒక సర్వే చెపుతోంది. ఒక్కొక్క కౌగిలిగి 9.5 సెకండ్ల చొప్పున నెలకు సుమారు ఒక గంట కౌగిలింతలతో గడిపేస్తారట. ఇంత శారీరక టచ్ కలిగినా...ఇంకా మరిన్ని కౌగిలింతలకై వారు కోరుతున్నారని కూడా సర్వే తెలుపుతోంది.
undefined
కౌగిలింత కావాలి అనుకునేవాళ్లు దాదాపు 69శాతం మంది తమ ప్రేమికుల వద్దకు, 14శాతం మంది సన్నిహితుల వద్దకు వాలిపోతున్నారని ఓ సర్వేలో తేలింది. కేవలం 9శాతం మంది మాత్రమే తమ పేరెంట్స్ వద్దకు వెళతారట.
undefined
కౌగిలింత వెనుక గల ఉద్దేశ్యం....'ఓదార్పు'. రోజంతా పనిచేసుకొని ఇంటికి వచ్చిన వారికి హాయినిస్తుంది. ఈ ఓదార్పు బ్రిటనీయులకు కౌగిలింతల్లో బాగా దొరుకుతోందట. మహిళలు కొంచెం వేదనకు లోనైతే చాలు, కౌగిలింత కోరతారని కూడా సర్వే చెపుతోంది.
undefined
అయితే, ప్రతి ఏడుగురిలో ఒకరు మాత్రం పబ్లిక్ స్ధలాలలోను, ఆఫీసులలోను కౌగలింతలు సరికాదని హేండ్ షేకులు, ఒకరిపై ఒకరు కొద్దిగా ఒంగటాలతో సరిపెట్టేసుకుంటున్నారని, వీటి ప్రభావం కూడా ఎంతో కొంత ఓదార్పుగానే వుందని పరిశోధకులు చెబుతున్నారు.
undefined
అసలు అంతలా ఓదార్పు ఇవ్వడానికి హగ్ లో ఉన్న మహత్యం ఏమిటా అని మీకు అనుమానం కలగొచ్చు. నిజంగానే కౌగిలింతలో ఓ అద్భుతమైన శక్తి ఉందంటున్నారు నిపుణులు. ఎదుటివారిని కౌగిలించుకున్నప్పుడు శరీరంలో ఆక్సిటోసిన్, డోపమైన్, సెరొటోనిన్ అనే రసాయనాలు విడుదలౌతాయి. ఇవి మెదడును శాంతి పరుస్తాయి.
undefined
అందుకే ఒక కౌగిలింత మనలో డిప్రెషన్ ని పోగొడుతుంది. ఆందోళన, ఒత్తిడి తగ్గిపోయి రిలాక్స్ అయిపోతుంటాం అని నిపుణులు చెబుతున్నారు.
undefined
కౌగిలింతల వల్ల శరీరంలో ఉండే వాపులు కూడా తగ్గుతాయని సైంటిస్టులు చెబుతున్నారు. ముఖ్యంగా గుండె జబ్బులు, డయాబెటిస్, హార్ట్ ఎటాక్స్ రాకుండా ఉంటాయట. అలాగే శరీరంలో ఉండే ఫ్రీ ర్యాడిక్సల్ నాశనమౌతాయని.. దీనివల్ల శరీరంపై దుష్ప్రభావాలు పడకుండా ఉంటాయంటున్నారు.
undefined
అంతేకాదు ఎవరినైనా కౌగిలించుకున్నప్పుడు మనలో థైమస్ గ్రంథి ఉత్తేజానికి గురౌతుంుది. దీంతో మన శరీరంలో తెల్లరక్తకణాల సంఖ్య పెరుగుతుంది. అలాగే రోగ నిరోధక వ్యవస్థ పటిష్టమౌతుంది. దీంతో వ్యాధులు మన దరిచేరకుండా ఉంటాయి.
undefined
click me!