ఇలా చేస్తే.. పనిచేసే భార్యాభర్తల మధ్య గొడవలే ఉండవు

First Published | Nov 24, 2023, 2:37 PM IST

భార్యా భర్తల మధ్య గొడవలు, కొట్లాటలు చాలా కామన్.  కానీ మీరు చేసే కొన్ని తప్పులు మీ బంధాన్ని విడిపోయే దాకా తీసుకెళ్తాయి. ముఖ్యంగా మీరు ఆఫీసులో వర్క్ చేస్తున్నట్టైతే కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అప్పుడే మీ మధ్య ఎలాంటి గొడవలు రావు. 

పనిలో సమతుల్యత లేకపోవడం, అలాగే పనిచేసే జంటల మధ్య తరచుగా గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఆఫీసులో వర్క్ టెన్షన్స్ వల్ల ఒక్కోసారి ఇంటి బాధ్యతలు నిర్వర్తించడం కష్టమవుతుంది. ముఖ్యంగా పిల్లలు ఉంటే ఈ సమస్య మరీ పెద్దగా కనిపిః్తుంది. ఈ కారణంగానే చాలా మంది విడిపోతుంటారు కూడా. మీకు ఇలా కాకూడదంటే.. భార్యాభర్తలిద్దరూ కొన్ని చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. ఇవి మీ దాంపత్య జీవితాన్ని ఆనందంగా సాగేలా చేస్తాయి. ఇందుకోసం ఏం చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

సంభాషణ 

ఒకే విషయం గురించి రోజూ గొడవ పడుతుంటే.. కోపంతో భాగస్వామితో మాట్లాడటం ఆపేయకండి. వాళ్లను ఒప్పించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే సంబంధంలో కమ్యూనికేషన్ గ్యాప్ అస్సలు ఉండకూడదు. ఎందుకంటే ఇది విడిపోవడానికి అతిపెద్ద కారణం కావొచ్చు. ఫలానా ప్రాజెక్ట్ కారణంగా మీరు ఒత్తిడికి గురైతే.. మీ ఆఫీసు పని గురించి మీ భాగస్వామితో మాట్లాడండి. అలాగే మీరు కూడా ఏదైాన చెప్పడానికి ప్రయత్నించండి. ఆఫీసులో ఆఫీసు పనులు చూసుకోండి. కానీ వాటిని ఇంటికి మోసుకొస్తే ఇంట్లో గొడవలు ఖచ్చితంగా జరుగుతాయి. అందుకే ఆఫీసుకు సంబంధించిన ఆలోచనలైనా.. పనులనైనా ఆఫీసులోనే వదిలిరావాలి. 
 

Latest Videos


పనులనే కాదు భాగస్వామిని కూడా గౌరవించండి

మీకు పెళ్లై ఉండి, మీరే వర్కింగ్ ప్రొఫెషనల్ అయితే రిలేషన్ షిప్ లో కూడా మీరు ఎంతో శ్రద్ధ పెట్టాలి. అంటే మీ భాగస్వామి సమస్యను అర్థం చేసుకోవాలి. మీకున్న బాధ్యతలను నిర్వర్తించాలి. మీ నుంచి వచ్చే చిన్న సహాయం సంబంధంలో విభేదాలను తగ్గించడానికి సహాయపడుతుంది. 
 

షెడ్యూల్ 

వర్కింగ్ ప్రొఫెషనల్స్ గొడవ పడకుండా తమ బంధాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటే.. మీరు ఒక షెడ్యూల్ ను రూపొందించండి. ఆఫీసు నుంచి వచ్చిన తర్వాత భాగస్వామితో సమయం గడపడం, ఇంటి పనులను చేయడం, పిల్లల హోంవర్క్ చేయించడం మొదలైనవి చేయండి. రిలేషన్ షిప్ లో ప్రేమను మెయింటైన్ చేయడానికి షెడ్యూల్ ఎంతగానో ఉపయోగపడుతుంది.
 

click me!