ప్రేమ
అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా కాబోయే భార్యలో తమపై ఎనలేని ప్రేమను చూపాలని ఆశిస్తారట. తనపట్ల , తన కుటుంబం, ఇతరుల పట్ల ఎంతో ఆప్యాయంగా తనకు కాబోయే భార్య ఉండాలని కోరకుంటారు. అబ్బాయిలకు దయగా, సౌమ్యంగా ఉండే అమ్మాలంటే ఎంతో ఇష్టం. ఇలాంటి వారిని ఎంతో మెచ్చుకుంటారు. ఆడవారు తమకు బాధైనప్పుడు ఎవరైనా వాళ్లను గట్టిగా పట్టుకోవాలని ఎలా అయితే కోరుకుంటారో.. పురుషులు కూడా స్పర్శను ఎక్కువగా ఇష్టపడతారు. ఇది వారి భార్యల నుంచి ఎక్కువగా ఆశిస్తారు. ముఖ్యంగా ముద్దు పెట్టే భార్య లేదా చేతులను పట్టుకునే భార్య రావాలని కోరుకుంటారట. ఆప్యాయతలున్న అమ్మాయిలంటే పురుషులకు ఎక్కుడ లేని ఇష్టం.