అమ్మాయిలు.. పెళ్లి తర్వాత తమ అత్తగారితో స్నేహంగా ఉండరు. వారు ఏదైనా సలహా ఇచ్చినా దానిని పాజిటివ్ గా తీసుకోకుండా.. తనను ఏదో ఒకటి అనాలనే ఇవన్నీ చెబుతున్నారు అని ఫీలౌతూ ఉంటారు.
పెళ్లి అంటేనే చాలా మంది అమ్మాయిలు భయపడిపోతారు. ఎలాంటి అత్తగారు వస్తారో.. తనని ఎలా చూసుకుంటారో అనే అనుమానం చాలా మందిలో ఉంటుంది. ఈ అనుమానం, భయంతోనే చాలా మంది అమ్మాయిలు.. పెళ్లి తర్వాత తమ అత్తగారితో స్నేహంగా ఉండరు. వారు ఏదైనా సలహా ఇచ్చినా దానిని పాజిటివ్ గా తీసుకోకుండా.. తనను ఏదో ఒకటి అనాలనే ఇవన్నీ చెబుతున్నారు అని ఫీలౌతూ ఉంటారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్యా దూరం పెరిగి.. మనస్పర్థలు, చివరకు గొడవల దాకా దారి తీస్తాయి. మరో వైపు అత్తగార్లు కూడా అంతే.. పెళ్లి తర్వాత కోడలు తమ కొడుకును తమకు దూరం చేస్తారనే భయంతో.. వారిని ఏదో ఒకటి అంటూ ఉంటారు. అసలు.. అత్తా- కోడళ్ల మధ్య విభేదాలు రాకుండా.. వారు సంతోషంగా ఉండాలి అంటే ఏం చేయాలి? ఇద్దరు స్నేహితుల్లా, తల్లీ-కూతుళ్లా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
25
దూరంగా ఉంచాలి..
చాలా మందికి ఎదుటి వాళ్లను ఏదో ఒక మాట అనే అలవాటు ఉంటుంది. మీ అత్తగారు కూడా మిమ్మల్ని ఎగతాళి చేయడం, ప్రతి చిన్న విషయానికి మిమ్మల్ని చెడుగా మాట్లాడటం లాంటివి చేస్తే.. మీరు కూడా ఎదురుతిరిగి మాట్లాడకూడదు. ఎదురు తిరిగి వాదిస్తే.. అది గొడవే అవుతుంది. ఆ సమయంలో మీరు ప్రశాంతంగా మాట్లాడటానికి ప్రయత్నించండి. ఆమె ఏం అన్నా కూడా మీరు కోపం తెచ్చుకోకుండా.. నవ్వుకుంటూ వాటిని పట్టించుకోకుండా ఉండండి. దీని వల్ల గొడవలు జరగవు. కొంత కాలానికి ఆమే మారే అవకాశం ఉంటుంది. అలా కాదు.. మీరు మాట్లాడాల్సి వస్తే.. అది కూడా ఎక్కువ సేపు వాదించకుండా పరిమితంగా ఉండాలి. వీలైనంత వరకు తక్కువ మాట్లాడితే ఎలాంటి గొడవలు జరగకుండా ఉంటాయి.
35
మీరు చెప్పాలి అనుకున్నది సరిగా చెప్పండి..
మీ అత్తగారు చెప్పేది చాలా తప్పు అని మీరు భావిస్తే, మీ మనసులో ఉన్నదాన్ని మీరు ఆమెకు సరైన మార్గంలో చెప్పాలి. ఇది మీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయకూడదని ఆమెకు అర్థం చేస్తుంది.
మీ అత్తగారు మీతో చాలా ప్రతి విషయంలో గొడవ పడాలని చూస్తే.. మీరు ఆమె నుంచి దూరంగా ఉండండి. మీ ఆనందాన్ని మాత్రం దూరం చేసుకోవద్దు. లేదంటే.. రోజూ గొడవలు మానసిక ప్రశాంతతను దూరం చేస్తాయి. మీకు ఒత్తిడి కూడా పెరిగే అవకాశం ఉంది. ఆమె ఇంట్లో ఉంటే మీరు ఆఫీసుకు వెళ్లండి. దూరంగా ఉంటే ఎక్కువగా గొడవలు జరగవు
55
కుటుంబ సభ్యులతో మాట్లాడండి
మీ ఇద్దరి మధ్య విభేదాలు హద్దులు దాటి పెరిగితే, మీరు కుటుంబం ముందు కూర్చుని మాట్లాడుకోవాలి. మీ సంబంధంలోని సమస్యలను పరిష్కరించుకోవడంపై దృష్టి పెట్టాలి.