అరెంజ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారా? ఈ తప్పులు మాత్రం చేయకండి

First Published | Dec 9, 2023, 10:45 AM IST

కొంతమంది ప్రేమ పెళ్లిళ్లు చేసుకుంటే.. ఇంకొంతమంది పెద్దలు కుదిర్చిన పెళ్లిని చేసుకుంటారు. ఏ రకమైన పెళ్లి చేసుకున్నా.. భాగస్వామి విషయంలో మాత్రం కేర్ లెస్ గా ఉండకూడదు. ముఖ్యంగా అరెంజ్డ్ మ్యారేజ్ లో భాగస్వామికి ముందే అన్నీ చెప్పేయడం మంచిది. లేదంటే పెళ్లి తర్వాత ఎన్నోసమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. 
 

పెళ్లి

అరెంజ్డ్ మ్యారేజ్ లో లైఫ్ పార్టనర్ ను ఎంచుకోవడం కాస్త కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే ఇది మీ లైఫ్ మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది. ప్రేమ పెళ్లిలో అమ్మాయి, అబ్బాయి ఒకరికొకరు బాగా తెలుసుకుంటారు. అలాగే ఒకరి గురించి ఒకరికి అన్ని విషయాలు తెలిసి ఉంటాయి. అలా అని అరెంజ్డ్ మ్యారేజ్ చెడ్డదని కాదు. ప్రేమ పెళ్లి అయినా.. పెద్దలు కుదిర్చిన పెళ్లి అయినా.. అబ్బాయి లేదా అమ్మాయి గురించి పూర్తిగా తెలుసుకోవాలి. అయితే అరెంజ్డ్ మ్యారేజ్ లో అమ్మాయి, అబ్బాయి కంటే పెద్దల భాగస్వామ్యమే ఎక్కువగా ఉంటుంది. ఏదేమైనా మన ఇండియాలో అమ్మాయి లేదా అబ్బాయిల కుటుంబం ఎలాంటిదని ముందుగా ఆరా తీస్తారు. ఆ తర్వాతే అమ్మాయి లేదా అబ్బాయి గురించి అడుగుతారు. 
 

indian marriage

అరెంజ్డ్ మ్యారేజ్ లో సరైన భాగస్వామిని ఎంచుకుంటే లైఫ్ మొత్తం సంతోషంగా సాగుతుంది. ఇద్దరూ ఆనందమైన జీవితాన్ని గడుపుతారు.  అయితే కొన్ని సార్లు అరెంజ్డ్ మ్యారేజ్ లో చేసే కొన్ని తప్పుల వల్ల జీవితాంతం ఇబ్బంది పడాల్సి వస్తుంది. మరి అరెంజ్డ్ మ్యారేజ్ లో  భాగస్వామిని ఎంచుకునేటప్పుడు చేయకూడని తప్పల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..


marriage

మీ ప్రాధాన్యతలను విస్మరించడం

అబ్బాయి అయినా.. అమ్మాయి అయినా.. జీవిత భాగస్వామి ఇలా ఉండాలి? అలా ఉండాలని ఎన్నో కలలు కంటుంటారు. అయితే పెద్దల కోసం ఈ కలలను వదిలేస్తుంటారు. అంటే వీరి కోరికలను అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు. కానీ మీరు జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు మీ కోరికలు, లక్ష్యాల గురించి మీ ఫ్యామిలీకి ముందుగానే చెప్పండి. దీంతో వారు మీకు నచ్చేవిధంగా ఉండే భాగస్వామిని చూస్తారు. 
 

పెళ్లి

తొందరపాటు నిర్ణయాలు వద్దు

పెద్దల బలవంతం వల్లో.. మరే ఇతర కారణాల వల్లో చాలా మంది తొందర పాటు నిర్ణయాలు తీసుకుంటుంటారు.కానీ ఈ తొందర పాటు పెళ్లి తర్వాత ఎన్నో సమస్యలకు దారితీస్తుంది. అందుకే ఎవరి ఒత్తిడివల్లే మీరు వెంటనే మీ నిర్ణయం చెప్పకుండా.. ఒకరినొకరు మాట్లాడుకుని, తెలుసుకుని ఓకే చెప్పండి. అంతేకానీ ఏదీ తెలుసుకోకుండా పెళ్లికి ఓకే చెప్తే మాత్రం చిక్కుల్లో పడతారు. 
 

marriage

మాట్లాడుకోకపోవడం

అరెంజ్డ్ మ్యారేజ్ లో పెద్దలదే అంతా ఉంటుంది. అంటే పెళ్లి చేసుకునే అబ్బాయి, అమ్మాయి మాట్లాడుకోవడం చాలా తక్కువగా ఉంటుంది. కొంతమంది పెద్దలు పెళ్లికి ముందు అబ్బాయిని, అమ్మాయిని ఒకరితో ఒకరు మాట్లాడుకోనివ్వరు. లేదా చాలా తక్కువగా మాట్లాడుకుంటారు. కానీ దీనివల్ల అమ్మాయి లేదా అబ్బాయి ఒకరికొకరు పూర్తిగా తెలుసుకోలేరు. దీనివల్లే అరెంజ్డ్ మ్యారేజ్ లో ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి  వస్తుంది. ఎలాంటి సంబంధమైనా సరే బలంగా ఉండటానికి ఒకరికొకరు మాట్లాడుకోవడం చాలా చాలా ముఖ్యం. 
 

marriage

నిర్ణయం మీరే తీసుకోండి

అరెంజ్డ్ మ్యారేజ్ లో పెద్దల మాటకు విలువ ఎక్కువ. అయితే ఇలాంటి పెళ్లిల్లో.. పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చినప్పుడు ‘నాకిష్టమే లేకున్నది మీ మాటతోనే చేసుకున్నా’ అని పెద్దలను నిందిస్తూ ఉంటారు. మీకు కూడా ఇలా కాకూడదంటే.. మీ నిర్ణయమేంటో అప్పుడే చెప్పేయండి. పెళ్లి తర్వాత బాధపడినా పెద్దగా లాభం ఉండదు. అందుకే ఆచీతూచీ నిర్ణయాలు తీసుకోండి. 

Latest Videos

click me!