కొందరు తరచుగా మాట్లాడటానికి ఇష్టపడతారు. ఎలా అంటే.., మాట్లాడుతూనే ఉంటారు. ఎప్పుడు ఆపాలో వారికి తెలియదు. మీరు స్వచ్ఛందంగా సమాచారాన్ని అందించినప్పుడు, మీ దగ్గర ఇక రహస్యాలు ఏమీ ఉండవు. మీ గురించి ఎదుటివారు స్పెషల్ గా తెలుసుకోవడానికి ఎలాంటి సమాచరం ఉండదు. అలాంటప్పుడు వారు కనీసం.. మిమల్ని ఒక ప్రశ్న కూడా అడగలేరు. అందుకే.. అలా ఉండకూడదు. అన్ని చెప్పేయకూడదు. అవసరానికి మించి మాట్లాడకూడదు. అలాంటివారు ఎదుటివారిని ఆకర్షించగలరు.