వాలంటైన్స్ డే రోజు సింగిల్స్ ఇలా ఎంజాయ్ చేయవచ్చు..!

First Published | Feb 13, 2023, 1:28 PM IST

భోజనం స్పెషల్ గా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ ఒక్కరోజు క్యాలరీలు పక్కన పెట్టి... మంచి మీల్ ప్రిపేర్ చేసుకొని... మంచి డ్రెస్ ధరించాలి.

వాలంటైన్స్ డే అనగానే ఎవరికైనా ప్రేమికులే గుర్తుకు వస్తారు. ఈ రోజున ప్రేమికులు ఏం చేయొచ్చు... ఎక్కడికి వెళ్లొచ్చు ఇలా అందరూ చెబుతారు. వారి ప్లాన్సింగ్స్ వారికి ఉంటాయి. కానీ.... సింగిల్స్ పరిస్థితే చాలా దారుణంగా ఉంటుంది. తమకు ఎవరూ పెయిర్ లేరని ఫీలైపోతూ ఉంటారు. అయితే.... సింగిల్స్ మరీ అంత బాధపడిపోకూండా... వారు కూడా ఎంజాయ్ చేయవచ్చట. అదెలాగో ఓసారి చూద్దాం..

1. సింగిల్స్ తమను తాము ఆరోజు చాలా స్పెషల్ గా ఫీలవ్వాలి.  కామన్ గా కాకుండా... భోజనం స్పెషల్ గా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ ఒక్కరోజు క్యాలరీలు పక్కన పెట్టి... మంచి మీల్ ప్రిపేర్ చేసుకొని... మంచి డ్రెస్ ధరించాలి.


2.ఈ వాలంటైన్స్ డే రోజుని మరింత స్పెషల్ గా జరుపుకునేందుకు... సరదాగా మీ స్నేహితులతో గడపండి. వారితో కలిసి ఫన్ యాక్టివిటీస్ చేయండి. వారంతా కలిసి ఏదైనా ఈ వెంట్స్ కి వెళ్లండి. సినిమాకి వెళ్లండి. గ్యాంగ్ తో ఏం చేసినా ఎప్పుడైనా అందంగా ఉంటుంది.


3.ఈ రోజు మీ మనసుకు ఆనందం కలిగించాలి అంటే..... ఈ వాలంటన్స్ డే రోజున మీరు వాలంటర్ గా మారి... ఏదైనా ఎన్జీవో కోసం పని చేయడం మంచిది. ఇది చాలా ఆనందాన్ని ఇస్తుంది.

4.ఈ స్పెషల్ రోజున ఇతర పనులను పక్కన పెట్టేసి...మీకు నచ్చిన పని చేయాలి. అంటే కుకింగ్, పెయింటింగ్ ఇలా మీకు నచ్చిన హాబీతో గడపండి.
 

5.ఈ వాలంటైన్స్ డే రోజున  స్పెషల్ గా  ఏదైనా ట్రిప్ కి వెళ్లండి. చిన్న ట్రిప్... ఒక్క రోజులో పూర్తయ్యే ట్రిప్ కి వెళ్లండి. సోలో ట్రిప్ లేదంటే... ఫ్రెండ్స్ తో వెళ్లండి.
 

single

6.ఈ రోజున మీ కోసం మీరు కొంత మనీ స్పెండ్ చేసుకోవాలి. అంటే.. మీ బ్యూటీ పై ఫోకస్ పెట్టండి. చక్కగా స్పాకి వెళ్లండి. మసాజ్ చేయించుకోండి, ఫేషియల్ చేయించుకోండి. మీ అందాన్ని మెరుగుపరుచుకునే ప్రయత్నం చేయండి.

Latest Videos

click me!