మీతో సెక్స్ లో పాల్గొనాలనుకుంటే మీ భాగస్వామి బాడీ లాంగ్వేజ్ ఇలాగే ఉంటుంది..

First Published | Feb 13, 2023, 11:33 AM IST

కొన్నింటిని మాట్లల్లో అస్సలు చెప్పలేం. ఎక్కువ మొహమాటం లేదా.. విషయాన్ని ఎలా ఎక్స్ ప్రెస్ చేయాలో తెలియనప్పుడు చేతల ద్వారా దాన్ని ఎదుటి వాళ్లకు చెప్పడానికి ట్రై చేస్తుంటారు చాలా మంది. సెక్స్ విషయంలో కూడా ఇలాగే  ఉంటుంది. అవును సెక్స్ లో పాల్గొనాలనుకున్నప్పుడు నోటితో చెప్పకుండా కొన్ని కొన్ని చిలిపి పనులు చేస్తుంటారు. వాటిని బట్టే అర్థం చేసుకోవచ్చు వారు సెక్స్ ను కోరకుంటున్నారని. 

సెక్స్ ఇద్దరి వ్యక్తుల  మధ్య దూరాన్ని తగ్గిస్తుంది. ప్రేమను రెట్టింపు చేస్తుంది. అయితే సెక్స్ లో పాల్గొనాలని ఉన్నా.. దాన్ని భాగస్వామికి డైరెక్ట్ గా చెప్పలేకపోతుంటారు. కానీ చేతల్లో మాత్రం చూపిస్తుంటారు. ఆ  చిలిపి చేష్టలను బట్టే అర్థం చేసుకోవచ్చు వాళ్లు సెక్స్ ను కోరుకుంటున్నారని. ఇంతకీ సెక్స్ ను కోరుకునే వారి బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందంటే..
 

తరచుగా చేతులు పట్టుకుంటారు

చేతులు పట్టుకోవడం ప్రేమ, రక్షణ, శృంగారాన్ని సూచిస్తుంది. మీ భాగస్వామి మీ చేతులను తన చేతితో పట్టుకుంటే.. అతను మీకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నాడని అర్థం. మీ ఇద్దరి మధ్య దూరం ఉండాలనుకోవడం లేదని అర్థం. మీ భాగస్వామి కూడా ఇలా మీ చేతులను తరచుగా పట్టుకుంటే అతను మీతో సెక్స్ లో పాల్గొంటున్నారని అర్థం చేసుకోండి. 
 


ఏకాంతంగా ఉండాలని కోరుకుంటారు

మీరు భాగస్వామితో ఉన్నప్పుడల్లా.. అతను మీతో ఏకాంత సమయాన్ని గడపాలని చూస్తాడు. అంటే అతను మీ నుంచి ఇంకొంచెం ఆశిస్తున్నాడని అర్థం. అంటే ముద్దు పెట్టుకోవడం లేదా కౌగిలించుకోవడం వంటివి ఆశిస్తున్నాడని అర్థం చేసుకోవాలి. తను మిమ్మల్ని ఒంటరిగా కలవడానికి ప్రయత్నిస్తే  అది సెక్స్  కు సంకేతమే. 
 

లాంగ్ డ్రైవ్ కు పోదామని

ఏదైనా రిలేషన్ షిప్ పెట్టుకునే ముందు ఒకరినొకరు తెలుసుకోవడం చాలా ముఖ్యం.  అయితే  మీ భాగస్వామి కూడా మీ గురించి మరింత తెలుసుకోవడానికి లాంగ్ డ్రైవ్ కు వెళ్తామని అడుగుతుంటే .. మీరు అందుకు ముందుగానే మానసికంగా సిద్ధంగా ఉండాలి. ఇద్దరు ప్రేమికులు గంటల తరబడి కలిసి గడిపినప్పుడు ఒకరికొకరు దగ్గర కావడం సహజం. వాస్తవానికి ఇది సెక్స్ కు సంకేతం కూడా కావొచ్చు. 
 

వెంట్రుకలను పట్టుకోవడం 

మీ భాగస్వామి పదేపదే లీవ్ చేసిన జుట్టులో చేతిని పెట్టి అటూ ఇటూ కదిలిస్తూ.. మిమ్మల్ని దగ్గరకు తీసుకుని పట్టుకుంటే అతను మీకు దగ్గర కావాలని కోరకుంటున్నట్టు అర్థం. మీరిద్దరూ త్వరలోనే రిలేషన్ షిప్ లోకి అడుగుపెట్టాలని కోరుకుంటునట్టు.  కొన్నిసార్లు మీ స్నేహితుడు కూడా మీకు దగ్గర కావడానికి ఇలాంటి సంకేతం ఇస్తాడు. ఇదే కాకుండా మీ నడుముపై చేయి ఉంచడం, మీ బుగ్గలను సున్నితంగా తడమడం వంటివి కూడా శృంగారానికి ఆహ్వానాలే.

Latest Videos

click me!