Relationship Tips: వారు ఏ పని చేయాలన్నా... భర్తను అడగాల్సిందే. భర్తను అడగకుండా ఏ పనీ చేయరు. పర్మిషన్ తీసుకోవడం కాదు.. ప్రతి విషయంలోనూ భర్తపై ఆధారపడుతూ ఉంటారు. తాము తమ భర్తపై ఎంతగా ఆధారపడ్డారో అర్థం చేసుకోవడం లో కూడా విఫలమౌతూ ఉంటారు.
భార్యాభర్తల బంధం సరిగా ఉండాలంటే వారి మధ్య ప్రేమ ఒక్కటే ఉంటే సరిపోదు. ఒకరినొకరు అర్థం చేసుకోవడం, ఒకరి ఆలోచనలకు మరొకరు విలువ ఇవ్వడం కూడా చాలా అవసరం. ఒకరికి నచ్చేలా మరొకరు ఉండటం కూడా చాలా అవసరం. అయితే... ఈ విషయాన్ని చాలా మంది సరిగా అర్థం చేసుకోరు. ఒకరికి నచ్చేలా మరొకరు ఉండటం అంటే... భర్త కోసం తమ సంతోషాలన్నీ వదిలేసుకుంటూ ఉంటారు. అంతేకాదు... వారు ఏ పని చేయాలన్నా... భర్తను అడగాల్సిందే. భర్తను అడగకుండా ఏ పనీ చేయరు. పర్మిషన్ తీసుకోవడం కాదు.. ప్రతి విషయంలోనూ భర్తపై ఆధారపడుతూ ఉంటారు. తాము తమ భర్తపై ఎంతగా ఆధారపడ్డారో అర్థం చేసుకోవడం లో కూడా విఫలమౌతూ ఉంటారు. అసలు.. ఇలా ప్రతి విషయంలోనూ ఒకరిపై ఆధారపడటం మంచిదేనా? దీని గురించి నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం....
24
ఎక్కువగా ఆధారపడటం మంచిదేనా?
భార్యలు తమ భర్తలపై ఎక్కువగా ఆధారపడటం ఇద్దరి మధ్య బంధాన్ని బలహీనంగా మారుస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భార్యలు ప్రతి విషయంలో, ఏదైనా పని చేసే ముందు తమ భాగస్వామిని సంప్రదిస్తూ ఉండటం వల్ల.. వారి సామర్థ్యం తగ్గిపోతూ ఉంటుంది. ఏ సమస్య వచ్చినా వారిపై ఆధారపడుతూ ఉండటం వల్ల.. వారు లేకుండా మీరు సమస్యలను పరిష్కరించలేని స్థితికి వెళ్లిపోతారు.
34
భర్తపై భారం...
భార్య తన భర్తకు ప్రతిదానినీ అడగడం ప్రారంభించినప్పుడు, ఆమె అతనిపై భారంగా మారుతుంది. అదనపు బాధ్యతలు మోస్తున్న ఫీలింగ్ వారి ఉంటుంది. ఈ క్రమంలోనే భార్యపై ఎక్కువగా చిరాకు పడటం, తక్కువ చేసి మాట్లాడటం లాంటివి చేస్తూ ఉంటారు.
మహిళలు ప్రతిదానికీ తమ భర్తలపై ఆధారపడినప్పుడు, వారి వ్యక్తిగత అభివృద్ధి దెబ్బతింటుంది. ఇంకా, వారికి ఎలాంటి లక్ష్యాలు ఉండవు. ఒకవేళ లక్ష్యాలు ఉన్నా.. వాటిని సాధించడం చాలా కష్టంగా మారుతుంది.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, భర్త అనుమతి తర్వాతే ఇంట్లో అన్ని పనులు జరుగుతున్నాయి అంటే.. అది వారి సంబంధాన్ని దెబ్బతీస్తుంది. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని కూడా తగ్గిస్తుంది. మీ భర్త కి భారంగా మారే బదులు, మీ స్వంత నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెట్టాలి. భర్తకు భారంగా ఉన్నామనే ఫీలింగ్ వారిలో కలగకుండా చూసుకోవాలి.