ఒకప్పుడు పెళ్లికి ముందు కనీసం ఒకరితో మరొకరికి ముఖ పరిచయం కూడా ఉండేది కాదు. పెళ్లిచూపుల్లో చూశామా.. పెళ్లిచేసుకున్నామా అన్నట్లుగా ఉండేది. తర్వాత కొద్దిగా కాలం మారింది. ఒకరినొకరు ముందుగా ఇష్టపడి అదే.. ప్రేమించుకోని తర్వాత పెళ్లిళ్లుచేసుకుంటున్నారు. ఒకవేళ పెద్దలు కుదర్చిన పెళ్లి అయినా.. కొద్ది రోజులు మాట్లాడుకున్న తర్వాత పెళ్లికి సై అంటున్నారు.
కానీ.. ఇప్పుడు కాలం పూర్తిగా మారిపోయింది. పెళ్లి అంటే.. అదొక బరువుగా భావిస్తున్నవారు చాలా మంది ఉన్నారు. దాని వల్ల తాము స్వేచ్ఛను కోల్పోతున్నామని ఫీలై.. ఇప్పట్లో పెళ్లి వద్దు అని పారిపోతున్నారు. ఈ క్రమంలో కొందరు సహజీవనం పై అడుగులు వేస్తున్నారు. అదేనండి.. లివింగ్ ఇన్ రిలేషన్ షిప్.
ఈ బంధంలో ఇద్దరూ ఒకేచోట కలిసి ఉంటారు. ఒకరి ఇష్టాలకు మరోకరు గౌరవం ఇచ్చుకుంటారు. పెళ్లి అనే బంధం ఉండదు కాబట్టి.. ఒకరిపై మరోకరు ఆంక్షలు విధించుకునే అవకాశం ఉండదు. దీంతో దీనిపై చాలా మంది ఫోకస్ పెడుతున్నారు. అయితే.. ఏ బంధమైనా ఆనందంగా సాగాలంటే.. కొన్ని రూల్స్ పాటించాలి. అప్పుడే అది అందంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
సహజీవనంలో ఉండటానికి ముందు కొన్ని రూల్స్ పాటించాలని నిపుణులు చెబుతున్నారు. మానసికంగా వీటికి సిద్ధంగా ఉన్నప్పుడే ఈ విషయంలో అడుగు ముందుకు వేయాలని సూచిస్తున్నారు.
లివింగ్ రిలేషన్ లో ఉన్నప్పుడు.. అవతలివారి ఇష్టాలతో పాటు.. అయిష్టాలను కూడా గౌరవించాలి. అంతేకాకుండా.. మామూలుగా కంటే.. మీ లివ్ ఇన్ పార్ట్ నర్ కి అదనంగా ప్రాముఖ్యత ఇవ్వాలి
ఇష్టా అయిష్టాలు తెలుసుకోవాలి. సెలవు సమయాన్ని వారికి కేటాయించడం చాలా ముఖ్యం. వాళ్ల జీవితంలో అత్యంత ప్రాముఖ్యతమైనవేంటో ముందుగానే తెలుసుకోవాలి.
ఈ బంధంలో ఇగో లకు అస్సలు చోటు ఇవ్వకూడదు. అహం పెట్టినప్పుడే ఈ బంధం ముందుకు సాగుతుంది. అలా కాదని పంతానికి పోతే.. ఈ బంధం కూడా ముక్కులైపోవడం ఖాయం.
ఈ రిలేషన్ లో ఒకరి గురించి మరొకరు తెలుసుకోవడం చాలా ముఖ్యం. అయితే.. వాళ్లకంటూ కొన్ని రహస్యాలు ఉంటే.. వాటిని తెలుసుకునే ప్రయత్నం చేయకపోవడం మంచిది.
మరీ ఎక్కువగా తెలుసుకున్నా కూడా సమస్యలు ఎక్కువౌతాయి. పార్ట్ నర్ చెప్పకూడదు అని భావించిన విషయాలు తెలుసుకోవాలనే ప్రయత్నం చేయకపోవడమే బెటర్.
ఈ బంధంలోకి అడుగుపెడుతున్నప్పుడే.. ఆర్థిక సమస్యల గురించి కూడా ఆలోచించుకోవాల్సి ఉంటుంది.
ప్రతి ఒక్కరికీ ఖర్చులు ఉంటాయన్న విషయం తెలుసుకోవాలి. ఎవరికి ఎంత ఖర్చు అవుతుంది.. ఆ బాధ్యతను ఎవరు నిర్వర్తిస్తారు అనే విషయంపై కూడా ముందే ఒక నిర్ణయానికి రావాలి.
ఇద్దరిలో ఒక్కరికైనా ఈ బంధం తెంచుకోవాలని పదే పదే అనిపిస్తే.. దానిని అక్కడితోనే వదిలేయడం మంచిది. అలాకాదని బలవంతపెడితే.. సమస్యలు మరింత ఎక్కువగా అవుతాయి.