శోభనం గదిలోకి వరుడితోపాటు ముగ్గురు సోదరులు.. వధువు షాక్

First Published | Jan 15, 2021, 12:08 PM IST

పెళ్లి తర్వాత అత్తారింట్లోకి అడుగుపెట్టిన తర్వాత వారి గురించి పూర్తి గా తెలుసుకొని యువతి షాకైంది.

పెళ్లి అనేది కేవలం ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన విషయం కాదు.. రెండు కుటుంబాలకు సంబంధించిన వ్యవహారం. ఒకరితో మరొకరు జీవితాంతం కలిసి ఉంటామనే నమ్మకంతో.. పెళ్లి బంధంలోకి అడుగుపెడతారు. భర్తతో జీవితాంతం ఆనందంగా గడపాలని ఏ వధువైనా కోరుకుంటుంది. అయితే.. ఓ అమ్మాయి విషయంలో మాత్రం ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. అచ్చంగా పురుణాల్లో జరిగిన ఓ సంఘటన ఓ యువతికి ఎదురైంది.
పురాణాల్లో ద్రౌపది ప్రేమించి పెళ్లి చేసుకుంది.. అర్జునుడుని మాత్రమే. స్వయం వరంలో ఆమెను గెలుచుకుంది అర్జునుడు మాత్రమే. కానీ.. తల్లి మాట ప్రకారం.. ద్రౌపది ని పాండురాజు కుమారైలైన ఐదుగురు పాండవులు ఆమెను మనువాడతారు. ఇలాంటి చదువుకోవడానికి వినడానికి బాగానే ఉంటాయి. కానీ.. నిజ జీవితంలో ఊహించలేం.

ఉత్తరప్రదేశ్ లో ఓ యువతికి పెళ్లి కాగా.. శోభనానికి వరుడితోపాటు.. అతని ముగ్గురు సోదరులు కూడా రావడం గమనార్హం. వారంతా కోడలితో గడపాలంటూ వరుడు తల్లి పేర్కొనడం గమనార్హం. ఈ సంఘటన యూపీలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
గజియాబాద్ కి చెందిన ఓ యువతికి రెండు నెలల క్రితం పెళ్లయ్యింది. తొలుత పెళ్లిచూపుల సమయంలో చిన్న కుమారుడిని చూపించారు. దాదాపు పెళ్లి ఖాయం అనుకున్న తర్వాత ఏవేవో కారణాలు చెప్పి.. పెద్ద అబ్బాయితో పెళ్లి జరిపించారు. ఆ విషయంలోనూ సదరు యువతి సర్దుకుపోయింది.
పెళ్లి తర్వాత అత్తారింట్లోకి అడుగుపెట్టిన తర్వాత వారి గురించి పూర్తి గా తెలుసుకొని యువతి షాకైంది.
పెళ్లి పెద్ద కొడుకుతో జరిగినప్పటికీ.. సంసారం మాత్రం నలుగురు కొడుకులతో చేయాలంటూ అత్త సదరు యువతికి ఆర్డర్ వేయడం గమనార్హం.
అయితే.. అందుకు ఆ వధువు అంగీకరించలేదు. కేవలం భర్తతో మాత్రమే తాను శృంగారంలో పాల్గొంటానని చెప్పినా.. వినిపించుకోకపోవడం గమనార్హం.
బలవంతంగా నలుగురు తనతో శారీరకంగా సంబంధం పెట్టుకున్నారని.. వినకపోతే.. దారుణంగా కొట్టి.. చిత్ర హింసలకు గురిచేశారని సదరు వధువు వాపోయింది.
రెండు నెలలపాటు వారి నుంచి నరకం అనుభవించిన వధువు.. ఎట్టకేలకు పోలీసులను ఆశ్రయించింది. తన భర్తకు మొత్తం ముగ్గురు సోదరులు కాగా.. వారిలో ఇద్దరికి పెళ్లిళ్లు అయ్యాయని.. అయినా వారితోకూడా తాను సంసారం చేయాలంటూ తన అత్త బెదిరించిందని ఆమె వాపోయింది.
ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Latest Videos

click me!